• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా ఎఫెక్ట్ ... లాక్ డౌన్ తో ఊపిరి తీసుకుంటున్న భూమి .. తగ్గుతున్న కాలుష్యం

|

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా తీవ్ర ఆర్ధిక నష్టం జరుగుతుంది. కరోనా మహమ్మారి వల్ల తీవ్ర ప్రాణ నష్టం కూడా జరుగుతుంది . కానీ ప్రస్తుత పరిస్థితి వల్ల భూమి కాస్త ఊపిరి తీసుకుంటుంది. కాలుష్యం తగ్గుతోంది. ఢిల్లీ సహా 90 నగరాల్లో కొద్దిరోజులుగా కనీస స్థాయి కాలుష్యం నమోదవుతోంది. దీంతో వాయు నాణ్యత మెరుగుపడుతోంది. కాలుష్య నివారణ కోసం ఇలాంటి ప్రయోగాలు ఎన్నడూ చెయ్యని సర్కార్ ప్రజల ప్రాణాలకు కరోనా మహమ్మారితో ముప్పు ఉన్న నేపధ్యంలోనే లాక్ డౌన్ చేసింది. దీని వల్ల స్వచ్చ వాయువులు పీల్చుకునే అవకాశం కలుగుతుంది.

శబ్ద కాలుష్యం , వాయు కాలుష్యం లేని ప్రశాంతమైన నగరాలు

శబ్ద కాలుష్యం , వాయు కాలుష్యం లేని ప్రశాంతమైన నగరాలు

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా వేల మంది ప్రాణాలు హరిస్తుంది . లక్షల సంఖ్యల్లో వైరస్ బారిన పడిన వారు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు .ఒకరి ద్వారా మరొకరికి సోకకుండా ఉండాలంటే..ప్రజలు బయట తిరగకుండా ఉంటే మంచిదని భావించి లాక్ డౌన్ విధిస్తున్నాయి చాలా దేశాలు . ఫలితంగా ప్రజలు రోడ్డెక్కడం లేదు . ఇక అత్యవసరం మినహాయించి నిత్యం వినిపించే రణగణ ధ్వనులు వినిపించడం లేదు. ట్రాఫిక్ సమస్య లేదు. శబ్ద కాలుష్యం , వాయు కాలుష్యం లేని ప్రశాంతమైన నగరాలు భూమిని బ్రతికిస్తున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో భారీగా తగ్గిన వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో భారీగా తగ్గిన వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నిన్నా మొన్నటిదాకా డేంజర్ బెల్స్ మోగించింది . స్వచ్చమైన గాలి పీల్చాలంటే సాధ్యమయ్యేది కాదు. వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో ఢిల్లీ వాసులు ఇబ్బంది పడ్డారు . ప్రపంచంలోనే వాయు కాలుష్యం అధికంగా ఉన్న జాబితాల్లో భారత్ ఎప్పుడో చేరిపోయింది . ఇక ఇప్పుడు కానీ కరోనా పుణ్యమా అని తగ్గిపోయింది. గాలిలో సూక్ష్మ ధూళి కణాలు, నైట్రోజన్ ఆక్సైడ్ భారీగా తగ్గినట్టు సఫర్ సంస్థకు చెందిన ఓ సైంటిస్టు వెల్లడించారు.

దేశమంతా స్వచ్చమైన గాలి .. పెరిగిన వాయు నాణ్యత

దేశమంతా స్వచ్చమైన గాలి .. పెరిగిన వాయు నాణ్యత

సర్వసాధారణంగా మార్చి నెలలో గాలిలో నాణ్యత సూచి మధ్యస్తంగా ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చిందని పేర్కొన్నారు. వాయు నాణ్యతను సూచించే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెయ్యి వరకు ఉండేదని, కానీ కరోనా వల్ల ఇది ఏకంగా 129కి పడిపోయిందని ఇక వాతావరణ శాఖ కూడా వెల్లడిస్తుంది . ఢిల్లీలో వీస్తున్న గాలి చాలా స్వచ్చంగా ఉందని ఈ సందర్భంగా చెప్పారు. ఇక ఢిల్లీలోనే ఇలా ఉంటే మిగతా నగరాలలో ఏ మేరకు వాయు కాలుష్యం తగ్గి ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు .

కాలుష్యపు కోరల నుండి భూమిని కాపాడుతున్న కరోనా

కాలుష్యపు కోరల నుండి భూమిని కాపాడుతున్న కరోనా

దేశ రాజధాని ఢిల్లీలో సూక్ష్మాతిసూక్ష్మ ధూళి కణాల స్థాయి 30% తగ్గినట్లు చెబుతున్నాయి తాజా గణాంకాలు. ఇక అహ్మదాబాద్‌, పుణెల్లో ఇది 15% తగ్గింది. శ్వాసకోశ సమస్యలకు కారణమయ్యే నైట్రోజన్‌ ఆక్సైడ్‌ కాలుష్యం ముంబయిలో గత వారం రోజుల్లో 43% తగ్గిపోయింది. మరికొన్ని నగరాల్లో దీని స్థాయి 38 నుంచి 50% వరకు తగ్గింది. దేశంలో కాలుష్యం చాలా వరకు తగ్గి భూమి ఊపిరి తీసుకుంటుంది. కరోనా వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్ తో కాలుష్యపు కోరల నుండి బయట పడుతుంది.

English summary
A nationwide lockdown would result in severe financial loss. Coronavirus can also cause severe loss of life. But due to the current situation, the earth is breathing . Pollution is decreasing. Over 90 cities, including Delhi, have witnessed minimal pollution in a matter of days. This improves air quality. This can cause the inhalation of pure air.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X