వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుడు ఇసుక దెబ్బ .. ఇప్పుడు కరోనా దెబ్బ .. ఏపీలో నిర్మాణ రంగ కార్మికుల దీనావస్థ

|
Google Oneindia TeluguNews

ఏపీలో నిర్మాణ రంగ కార్మికుల పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా తయారైంది . ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నిర్మాణ రంగానికి మాత్రం గడ్డుకాలంగా మారింది . అప్పుడు ఇసుక కొరత వేధిస్తే ఇప్పుడు కరోనా కార్మికులను పరీక్షిస్తుంది . వారితో ఆకలి కేకలు వేయిస్తుంది.

కరోనా కష్టకాలంలోనూ సీఎం జగన్ డేరింగ్ డెసిషన్: వారి కోసం జీరో వడ్డీ పథకంకరోనా కష్టకాలంలోనూ సీఎం జగన్ డేరింగ్ డెసిషన్: వారి కోసం జీరో వడ్డీ పథకం

నిర్మాణ రంగ కార్మికులకు దెబ్బ మీద దెబ్బ

నిర్మాణ రంగ కార్మికులకు దెబ్బ మీద దెబ్బ

ఏపీలో అధికారంలోకి రాగానే పాత ఇసుక పాలసీని రద్దు చేసి కొత్త ఇసుక విధానం తీసుకొచ్చే క్రమంలో చోటు చేసుకున్న జాప్యం తీవ్ర ఇసుక కొరతకు కారణమై నిర్మాణ రంగ కార్మిక లోకం రోడ్డున పడింది. చాలా మంది కార్మికులు పనుల్లేక, పస్తులుండలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇక ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కరోనా దెబ్బకు కార్మికులు పనుల్లేక విలవిలలాడుతున్నారు. కన్నీటి పర్యంతం అవుతున్నారు . ఏపీలో గతంలో ఇసుక కొరత , ప్రస్తుతం కరోనా దెబ్బ వెరసి కార్మిక కుటుంబాలు దయనీయమైన పరిస్థితులు వెళ్ళబుచ్చుతున్నాయి.

 వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే రెండు సార్లు నిర్మాణ రంగ కార్మికులకు గడ్డుకాలం

వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే రెండు సార్లు నిర్మాణ రంగ కార్మికులకు గడ్డుకాలం

వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాక ముందే రెండు సార్లు తగిలిన దెబ్బ కార్మిక లోకాన్ని కష్టాలలోకి నెట్టింది . అప్పుడు ఇసుక కొరత కారణంగా ఆకలితో అలమటించిన కార్మికులు ఇప్పుడు మళ్ళీ ఒకసారి కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో తినటానికి తిండి లేక , పస్తులు ఉండలేక నరకం చూస్తున్నారు. ఆదుకునే నాధుడు లేడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలను అందరినీ ఆదుకుంటున్నామని చెప్తున్నా ప్రభుత్వ ఫలాలు క్షేత్ర స్థాయిలో అందటం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. ఫలితంగా బ్రతకటం భారంగా మారిందని వారంటున్నారు.

నిర్మాణ రంగం మీద ఆధారపడిన లక్షలాది కార్మికులు

నిర్మాణ రంగం మీద ఆధారపడిన లక్షలాది కార్మికులు


రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో నిర్మాణ రంగ కార్మికులు నిర్మాణ రంగం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తాపీ పని చేసే కార్మికులు , ప్లంబర్ పని చేసేవాళ్ళు , వడ్రంగి పని చేసేవాళ్ళు , ఎలక్ట్రీషియన్ వర్క్ చేసే వాళ్ళు , సీలింగ్ , పుట్టీ పనులు, పెయింటింగ్ పనులు చేసే కార్మిక లోకం తాజా పరిస్థితులతో నరక అనుభవిస్తుంది . రెక్కాడితేనే డొక్కాడే వాళ్ళ బ్రతుకులు కరోనా దెబ్బకు దీనావస్థకు చేరుకున్నాయి. ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోవటంతో పనుల్లేక , పైసలు లేక , కుటుంబాలు పస్తులు ఉండలేక ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

మహారాష్ట్ర సర్కార్ నిర్మాణ రంగ కార్మికులకు 2వేల ఆర్ధిక సాయం

మహారాష్ట్ర సర్కార్ నిర్మాణ రంగ కార్మికులకు 2వేల ఆర్ధిక సాయం

మహారాష్ట్రలో నిర్మాణ రంగ కార్మికులకు ఆర్దిక సాయం అందిస్తూ అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న చందంగా వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే రెండు సార్లు దెబ్బ తిన్న నిర్మాణ రంగ కార్మికులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఇక తాజాగా భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో నమోదు చేసుకున్న కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 2వేలు ఇవ్వనున్నట్లు మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రభావితమైన సుమారు 12 లక్షల మంది కార్మికులకు ఈ సహాయం అందించనున్నట్లు కార్మిక శాఖ మంత్రి దిలీప్‌ వాల్సే పాటిల్‌ తెలిపారు. భవన నిర్మాణకార్మికులకు అండగా మహారాష్ట్ర వికాస్‌ అఘాడీ ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు.

Recommended Video

Hungry Bear Roams California Streets
ఏపీ కార్మికులను ఆర్ధిక సాయం అందించి ఆదుకోవాలని వేడుకోలు

ఏపీ కార్మికులను ఆర్ధిక సాయం అందించి ఆదుకోవాలని వేడుకోలు

ఇక ఇదే తరహాలో నిర్మాణ రంగ కార్మిక లోకానికి రెండు వేలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు కార్మికులు . కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న తమ బతుకులు బాగు చెయ్యాలని, కనీసం తినటానికి తిండి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేదంటే ఇసుక కొరత సమయంలో ఆత్మహత్యలకు పాల్పడినట్టు ఇప్పుడు కూడా ఆత్మహత్యలే శరణ్యం అని అంటున్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో చేస్తున్నామని చెప్తున్న సర్కార్ నిర్మాణ రంగ కార్మికుల డిమాండ్ పై సానుకూలంగా స్పందిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

English summary
In previous days unavailability of sand was created a lot of trouble in Andhra Pradesh construction sector workers. Now, with coronavirus impact also facing troubles by the construction labour . Since the YCP came to power in AP, the construction sector has become a deadlock. construction workers suffered a lot with sand scarcity. now corona virus lock down effect they are suffering form hungry .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X