వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా లాక్ డౌన్ వేళ.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఏం చేస్తున్నారో తెలుసా !!

|
Google Oneindia TeluguNews

కరోనాను కట్టడి చెయ్యటానికి ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా సరే ఏపీలో కేసులు ఊహించని విధంగా పెరిగిపోయాయి. ఏపీలో ఇప్పటి వరకు 722 కేసులు నమోదు కాగా 20 మంది మృతి చెందారు . ఇక ఏపీలో రోజు రోజుకీ పెరుగుతున్న కేసులు ఏపీ సర్కార్ ను టెన్షన్ పెడుతున్నాయి. ఇక కరోనా మహమ్మారిని కంట్రోల్ చెయ్యటానికి ఏపీ ప్రభుత్వం శత విధాలా ప్రయత్నం చేస్తుంది. లాక్ డౌన్ విధించి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తుంది. నిత్యావసరాలకోసం తప్ప ఎవరూ బయటకి రాని పరిస్థితి ఉంది .

ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా : వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆవేదనఆ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా : వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆవేదన

రాజకీయ రంగంలో ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులు లాక్ డౌన్ సందర్భంగా ఏం చేస్తున్నామో సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసేలా చేస్తున్నారు. ఇక దెందులూరు మాజీ ఎమ్మెల్యే , టీడీపీ నాయకుడు రాజకీయాల్లో ఎప్పుడూ వివాదాస్పదుడు అయిన చింతమనేని ప్రభాకర్ లాక్ డౌన్ సమయంలో తాను ఏం చేస్తున్నదీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తాజాగా తన ఫామ్ లో గుర్రపు స్వారీ చేస్తున్న వీడియో షేర్ చేసిన ఆయన కరోనా లాక్ డౌన్ ప్రభావంతో పనుల్లేక , తినటానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న వారికి తన వంతు సాయంగా భోజనం కూడా అందిస్తున్నారు.

 Corona lock down time.... Former TDP MLA Chintamaneni horse riding

Recommended Video

Coronavirus : COVID-19 Cases Jump To 17615 Mark In India

ఇటీవల లాక్ డౌన్ కారణంగా ఏలూరు హైవేపై‌ వెళ్లే పాదచారులకు నిత్యావసర వస్తువులను తరలిస్తోన్న వాహనదారులకు టిఫిన్ అందించారు చింతమనేని ప్రభాకర్ . ఎన్టీఆర్,చింతమనేని జనతా క్యాంటీన్ ఆధ్వర్యంలో తన కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం పంపిణీ చేసి బాటసారుల ఆకలి తీర్చారు. చింతమనేని దంపతులు స్వయంగా టిఫిన్ అందరికి వడ్డించారు. ఇక తాజాగా తన ఫామ్ లో సరదాగా గుర్రపు స్వారీ చేస్తున్న చింతమనేని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

English summary
Chintamaneni Prabhakar, a former MLA of Dendaluru and a TDP leader who is always controversial in politics, is sharing what he is doing during the lockdown. He recently shared a video of his horse riding on his farm, and not just under the influence of Corona Lockdown, he also serves lunch for those who are struggling .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X