వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్ డౌన్ ఎఫెక్ట్ ... ఏపీ-తమిళనాడు సరిహద్దుల్లో ఏకంగా గోడలే .. ఏం జరుగుతుంది ?

|
Google Oneindia TeluguNews

తమిళనాడులో కరోనా ప్రతాపం చూపుతుంది . ఇప్పటికే 1885 మంది కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. ఇక 24 మంది మృత్యు వాత పడ్డారు .ఇంకా కేసులు పెరిగే పరిస్థితి తమిళనాడులో స్పష్టంగా కనిపిస్తుంది . తమిళనాట నమోదైన కేసుల్లో 1450 కేసులు ఢిల్లీ మర్కజ్ లింకులే కావటం గుర్తించాల్సిన అంశం . ఇక ఇదే సమయంలో తమిళనాడు అధికారులు తీసుకున్న నిర్ణయం పలు వివాదాలకు కారణం అవుతుంది.

కరోనా మహమ్మారి మానవ హక్కుల సంక్షోభంగా మారవచ్చు : ఐక్యరాజ్య సమితి హెచ్చరికకరోనా మహమ్మారి మానవ హక్కుల సంక్షోభంగా మారవచ్చు : ఐక్యరాజ్య సమితి హెచ్చరిక

అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు తమిళనాడు అధికారుల వివాదాస్పద నిర్ణయం

అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు తమిళనాడు అధికారుల వివాదాస్పద నిర్ణయం

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తున్న సూచనలతో ఇటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా అన్ని రాష్ట్రాలకు సరిహద్దుల టెన్షన్ పట్టుకుంది . తమిళనాడులో కేసులు పెరుగుతున్న నేపధ్యంలో సరహద్దు ప్రాంతాల నుండి ప్రజలు దొంగ చాటుగా వస్తున్నారని భావిస్తున్న తమిళనాడు అధికారులు చేసిన పని ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది.

కలెక్టర్ ఆదేశాల మేరకు గోడల నిర్మాణం

కలెక్టర్ ఆదేశాల మేరకు గోడల నిర్మాణం

కరోనా కట్టడికి ఏపీ తమిళనాడు సరిహద్దుల దగ్గర ఏకంగా గోడలను నిర్మించారు అధికారులు. కరోనా కట్టడికి , అక్రమ చొరబాట్లను అడ్డుకోవటానికి ఇంతకు మించి మార్గం లేదని భావించిన తమిళనాడు అధికార యంత్రాంగం చేసిన చర్యఇప్పుడు అన్ని రాష్ట్రాలను షాక్ కు గురి చేసింది. ఇలా ప్రతి ఒక్క బోర్డర్ లో గోడలు నిర్మిస్తే దేశం పరిస్థితి ఏంటి అన్న అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. చిత్తూరు జిల్లాలోని మూడు సరిహద్దు ప్రాంతాల్లో వేళూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గోడలను నిర్మించారు. ఇక ఈ చర్యతో ఆయా గ్రామాల ప్రజలు షాక్ కు గురయ్యారు.

వేలూరు జిల్లాలో మూడు చోట్ల సరిహద్దుల్లో గోడలు

వేలూరు జిల్లాలో మూడు చోట్ల సరిహద్దుల్లో గోడలు

పలమనేరు సమీపంలోని గుడియత్తాం వెళ్లే రహదారి, తిరుత్తణి మార్గంలోని శెట్టింతంగాళ్ తో పాటు బొమ్మ సముద్రం నుంచి తమిళనాడు వెళ్లే మార్గాలకు అడ్డంగా గోడలను నిర్మించారు. అయితే, అధికారుల తీరుపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ గోడల నిర్మాణంపై చిత్తూరు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు. కలెక్టర్ ఆదేశాలతో రోడ్డకు అడ్డంగా 6 అడుగుల మేర రాత్రికి రాత్రే గోడలను కట్టివేశారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆయా రాష్ట్రాలు సరిహద్దులను మూసివేశాయి. అక్కడ పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు .

Recommended Video

Coronavirus Update : High Tension, 80% Asymptomatic Covid Cases In India
 గోడల నిర్మాణంపై వెల్లువెత్తుతున్న విమర్శలు.. ఏపీ అధికారులు ఏం చేస్తారో ?

గోడల నిర్మాణంపై వెల్లువెత్తుతున్న విమర్శలు.. ఏపీ అధికారులు ఏం చేస్తారో ?

కానీ, గోడలు కట్టడం ఏంటి? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక, దీంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉండే గ్రామాల ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. అదే విధంగా, అత్యవసర సేవలు, నిత్యవసర సరకుల రవాణా కూడా లేకుండా పోయింది. దీంతో గోడలు నిర్మించిన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ఈ నేపధ్యంలో తమిళనాడు అధికారుల తీరుకు ఏపీ అధికార యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుంది. ఆ గోడలను కూల్చి అక్రమ రవాణా అడ్డుకోవటానికి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారా ? ఈ వ్యవహారంలో ఏం చేస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

English summary
Officials have built walls along the borders of AP Tamil Nadu for corona control . The Tamil Nadu bureaucratic action, which felt there was no way out of the corona, has now shocked all the states. The construction of the walls in each of these borders gives rise to the suspicion of living conditions. The walls have been erected on the orders of the Vellore district collector at three border areas of Chittoor district. The people of the villages were shocked by the move..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X