India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్క రూపాయితో కరోనామందు.. అల్లావుద్దీన్ అద్భుతదీపం చిట్కా ..సోషల్ మీడియాలో వైరల్ .. నిజమెంత ?

|
Google Oneindia TeluguNews

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు షాక్ అంటూ ఒక రూపాయితో కరోనాకు మందు కనుగొన్నారు ,ఇది అల్లావుద్దీన్ అద్భుతదీపం చిట్కా అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ముక్కులో ఒక చుక్క నిమ్మరసం వేసుకుంటే, కరోనా వైరస్ కనిపించకుండా పోతుందని ఈ పోస్ట్ లో తెగ ప్రచారం అవుతోంది. ఒకవేళ కరోనా నుంచి రిలీఫ్ రాలేదని ఎవరైనా భావిస్తే 50 వేల రూపాయల రివార్డు ఇస్తామంటూ ఛాలెంజ్ చేయటం కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ముక్కులో ఒకచుక్క నిమ్మరసం వేసుకొంటే కరోనా మాయం అని ప్రచారం

ముక్కులో ఒకచుక్క నిమ్మరసం వేసుకొంటే కరోనా మాయం అని ప్రచారం

నాసికా రంధ్రాల్లో అంటే ముక్కులో ఒకచుక్క నిమ్మరసం వేసుకొంటే ముక్కులో, గొంతులో,శ్వాస కోశాల్లో దాగి ఉన్న కరోనా వైరస్ అంతా శ్లేష్మం రూపంలో నోట్లోకి వచ్చేస్తుందని దాన్ని కాండ్రించి ఉమ్మివేసి నోటిని శుభ్రంగా కడుక్కుంటే కరోనా వైరస్ నుంచి రిలీఫ్ వస్తుందని వాట్సాప్ గ్రూపులలో ఒక పోస్టు తెగ చక్కెర్లు కొడుతుంది. ఒక చుక్క నిమ్మరసం వేసుకుని తర్వాత ముక్కులో , గొంతులో, శ్వాసకోశాలలో ఉన్నదంతా నోటిలోకి వస్తుందని, దానిని ఊసిన తరువాత గోరువెచ్చని నీటిలో ఉప్పు, నిమ్మరసం కలిపి పుక్కిలించి ఉమ్మాలని అలా చేసినట్లయితే వెంటనే మనకు రిలీఫ్ గా ఉంటుంది అంటూ ఆ పోస్ట్ లో ప్రచారం జరుగుతుంది .

రిలీఫ్ రాలేదంటే రూ. 50,000/-బహుమానం ఇస్తామని ఛాలెంజ్

రిలీఫ్ రాలేదంటే రూ. 50,000/-బహుమానం ఇస్తామని ఛాలెంజ్

ఆ తర్వాత శుభ్రమైన కొబ్బరి నూనెలో వేలు ముంచి నాసికా రంధ్రాల్లో రాయాలని అలా చేస్తే చాలా రిలీఫ్ గా ఉంటుందని జరుగుతున్న ప్రచారంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అంతేకాదు ఈ విధంగా చేసిన తర్వాత మాకు రిలీఫ్ రాలేదని ఎవరైనా రుజువు చేస్తే వారికి ఈ చిట్కా చెప్పిన రంగా వెంకటేశ్వరరావు గారిచే రూ. 50,000/-బహుమానం ఇవ్వబడుతుంది అని ఒక సవాల్ కూడా ఈ పోస్టు ద్వారా ప్రచారమవుతోంది.

వాస్తవం పక్కన పెట్టి ముక్కులో నిమ్మరసంతో ప్రయోగాలు

వాస్తవం పక్కన పెట్టి ముక్కులో నిమ్మరసంతో ప్రయోగాలు

అయితే ఈ పోస్టులో వాస్తవమెంత అనేది పక్కన పెడితే ముక్కులో ఒక చుక్క నిమ్మరసమే కదా ? వేసుకుంటే పోతుందిగా ? కరోనా తగ్గడానికి అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి చిట్కా అని చెప్తుంటే పాటిస్తే పోదా అని చాలామంది ముక్కులో నిమ్మరసం వేస్తూ ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది కరోనాకు ఇది చెయ్యండి అది చెయ్యండి అంటూ మా మందులు వాడితే పోతుంది. మా మైసూర్పాక్ తింటే తగ్గుతుంది అంటూ రకరకాలుగా ప్రచారాలు చేస్తుంటే, తాజాగా నిమ్మరసంతో కరోనా మాయమవుతుంది అన్న ప్రచారం మొదలైంది .

 నిడదవోలుకు చెందిన వ్యక్తి కరోనా నివారణ మందు కనుగొన్నాడని ప్రచారం

నిడదవోలుకు చెందిన వ్యక్తి కరోనా నివారణ మందు కనుగొన్నాడని ప్రచారం

ప్రపంచ దేశాలన్నీ కరోనా వ్యాక్సిన్ తయారు చేయడం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ నానా తిప్పలు పడుతుంటే, అసలు అలాంటివి అవసరం లేదు కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విలన్ అయితే, తేలికగా నివారణ మందు కనుగొన్న ప్రపంచ హీరో మన సోదరుడు రంగా వెంకటేశ్వర రావు ఆయన నిడదవోలుకు చెందిన వ్యక్తి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నిమ్మరసం శానిటైజర్ కన్నా గొప్పగా పని చేస్తుందని నిమ్మరసాన్ని మనం ఎక్కడ ఉపయోగించినా ఫలితం ఖచ్చితంగా ఉంటుందని, చేతులకు, శరీరానికి, తలకు గదులలో, బట్టలపై నిమ్మరసాన్ని వాడడం వల్ల కరోనా దరిచేరదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

సైనైడ్ చుక్క ప్రాణం తీస్తే, ఒక్క నిమ్మరసం చుక్క ప్రాణం పోస్తుందని పోస్ట్

సైనైడ్ చుక్క ప్రాణం తీస్తే, ఒక్క నిమ్మరసం చుక్క ప్రాణం పోస్తుందని పోస్ట్

నిమ్మరసంతో తాను ముందుగా ప్రయోగం చేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత పలువురు కరోనా బాధితులైన రాజకీయ నాయకులకు ఇతరులకు సూచించి వారికి ఉపశమనం కలిగించారు అని,వారి అభినందనలు కూడా పొందారని చెప్తున్నారు. ఒక సైనైడ్ చుక్క ప్రాణం తీస్తే, ఒక్క నిమ్మరసం చుక్క ఒక ప్రాణాన్ని కాపాడుతుంది అంటూ వైరల్ అవుతున్న ఈ పోస్టులో దీనికి సంబంధించి ఆయనఎక్కడి వారు ఏం చేస్తుంటారు అనే పూర్తి డీటెయిల్స్ ఇచ్చారు .

India Global Week 2020: PM Modi Speech కరోనా తరువాత భారత్ అగ్రగామిగా మారుతుంది..!! | Oneindia Telugu
 నిమ్మరసంతో కరోనా తగ్గుతుందా ? నిజమెంత

నిమ్మరసంతో కరోనా తగ్గుతుందా ? నిజమెంత


ఏది ఏమైనా శాస్త్రీయంగా నిర్ధారణ కాకుండా దేనినీ వాడరాదని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ , వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకొని, కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. కానీ కరోనాకు మెడిసిన్ కనిపెట్టలేక పోతున్న తరుణంలో ఎవరు ఏం చెప్తే అది నమ్మి, దానిని పాటించే పనిలో ప్రజలు ఉన్నారు. నిమ్మరసంతో కరోనా తగ్గుతుందా లేదా అనే నిజానిజాల నిగ్గు తేలుతుందా? తెలియాల్సి ఉంది.

English summary
A post is going viral on social media saying that Corona has found a drug with only a rupee. In this post, there is propaganda that if you put a drop of lemon juice in your nose, the coronavirus will disappear. and challenged if anybody didn't get relief with lemon juice they will gift them 50,000 rupees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X