వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా రాజకీయం .. ఎన్నికల కమీషనర్ కు చంద్రబాబు లేఖ

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఒకపక్క కరోనా వైరస్ బాధితులకు వైద్య సేవలు అందిస్తూనే అధికార ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మాత్రం ఆపటం లేదు.ఏపీలో కరోనా వైరస్ కేసులు నమోదు కాక ముందు ఎన్నికలు నిర్వహించాలని భావించి నోటిఫికేషన్ ఇచ్చిన ఎన్నికల కమీషన్ కరోనా కేసులు దేశంలో పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్న నేపధ్యంలో ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అనూహ్యంగా పెరగటం వంటి కారణాలతో కంట్రోల్ చెయ్యటం కోసం లాక్ డౌన్ విధించింది కేంద్ర సర్కార్ .

ఏపీలో కరోనా స్టేజ్-3 లోకి ప్రవేశించిందా ? ఇంకా దాక్కుంటున్న వారితోనే సమస్యలు ?ఏపీలో కరోనా స్టేజ్-3 లోకి ప్రవేశించిందా ? ఇంకా దాక్కుంటున్న వారితోనే సమస్యలు ?

ఇక ఈ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ విధింపు నిరుపేదలకు ఇబ్బంది కలిగించకుండా ఏపీ సర్కార్ వెయ్యి రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తుంది. అయితే ఈ సహాయం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందిస్తున్న నేపధ్యంలో టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇక ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కరోనా సమయంలో కూడా రాజకీయాలు చేస్తున్న వైసీపీ నేతలపై లేఖ ద్వారా బాబు ఫిర్యాదు చేశారు.

 Corona Politics in AP .. Chandrababus letter to Election Commissioner

లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వం అందించాల్సిన వెయ్యి రూపాయల నగదు, నిత్యావసరాలను వాలంటీర్లతో పంపిణీ చేయించకుండా వైసీపీ అభ్యర్థులతో పంపిణీ చేయిస్తున్నారని ఎన్నికల అధికారి దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. ఇక ఈ విషయంపై ప్రభుత్వం స్పందించటం లేదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన ఆధారాలను ఫోటోలను, వీడియోలను ఫిర్యాదుతో జత చేశారు. వైసీపీ నేతల ఆగడాలపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చంద్రబాబు ఈ సందర్భంగా ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు.

English summary
Chandrababu was taken to the attention of the election official, who said that the 1000 cash and essential necessities that the government has to offer during the lockdown are not being distributed with the volunteers but with the YCP candidates. In his letter, he said the government was no longer responding to the issue. The evidence photos and videos were added to the complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X