కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

24 గంట‌ల్లో 43 కేసులు..!ఏపీని వదల బొమ్మాళీ అంటున్న కరోనా..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఏపీ లో పరిస్తితులు పగబట్టాయా అనే విధంగా తయారయ్యాయి. సాధారణ ఎన్నిలక తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపి ప్రభుత్వం కుదురుకోక ముందే రాజధాని రైతుల ధర్నా తారాస్తాయికి వెళ్లింది. ఆతర్వాత వెంటనే ఎన్నికల అధికారి బదిలీ సమస్య. ఆతర్వాత కరోనా వైరస్ విజృంభనతో రాష్ట్రం అతలాకుతలంగా మారిపోయింది. కరోనా కట్టడిలో భాగంగా విధిన లాక్ డౌన్ ఆంక్షలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నా భిన్నమయిపోయింది. దీంతో కొన్ని సడలింపులు ప్రకటించి రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని గట్టెక్కిద్దామనుకున్న జగన్ సర్కార్ కు విశాఖ విషవాయువు ఉదంతం కోలుకోని దెబ్బ కొట్టినట్టు తెలుస్తోంది. యంత్రాంగం అంతా ఉత్తరాంధ్రలో ఉండగా కరోనా వైరస్ మరోసారి మెరనుపుదాడి చేసినట్టు తెలుస్తోంది.

Recommended Video

Coronavirus : Positive Cases Rising In AP,43 Positive Cases In 24 Hours

కరోనా మరోసారి కన్నెర్ర చేయనుందా..?ఎయిమ్స్ వైద్యులు చెప్తోందే నిజమా..?వర్షా కాలం వైరస్ విజృంభిస్తుందాకరోనా మరోసారి కన్నెర్ర చేయనుందా..?ఎయిమ్స్ వైద్యులు చెప్తోందే నిజమా..?వర్షా కాలం వైరస్ విజృంభిస్తుందా

ఏపిలో పెరుగుతున్న కరోనా కేసులు.. నేడే కేంద్ర బృందం పర్యటన..

ఏపిలో పెరుగుతున్న కరోనా కేసులు.. నేడే కేంద్ర బృందం పర్యటన..

రాజదాని తరలింపు, కరోనా వైరస్ కట్టడి, విశాఖ విషవాయువు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, రాష్ట్ర వ్యవహారాలపై నమోదైన కేసులు తదితర అంశాలతో ఏపి ప్రభుత్వం అతలా కుతలం అవుతున్నట్టు తెలుస్తోంది. ఒకదాని తర్వాత ఒకటి తరుముకొస్తున్న విపత్తులను అధిగమించేదుకు ప్రయత్నాలుచేస్తున్న తరుణంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి పంజా విసిరినట్టు తెలుస్తోంది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నలభైమూడు పాజిటీవ్ కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకంగా మారినట్టు చర్చ జరుగుతోంది. ఏపిలో మద్యం దుకాణాలతో పాటు మరికొన్ని వ్యాపారలకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతోనే కేసులు పెరుగుతునన్నాయనే చర్చ జరుగుతోంది.

గణనీయంగా పెరుగుతున్న కేసులు.. కట్టడి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు..

గణనీయంగా పెరుగుతున్న కేసులు.. కట్టడి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు..

ఎన్ని ముందు జాగ్రత్త చైర్యలు తీసుకున్నా, ఎంత కఠిన నిభంధనలు అమలు చేస్తున్నా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఏమాత్రం త‌గ్గ‌టం లేదు. రాష్ట్రంలో క‌రోనా కేసులు రోజురోజుకూ పెద్ద సంఖ్య‌లోనే న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన ఇరవై నాలుగు గంట‌ల్లో నలభై మూడు క‌రోనా కేసులు న‌మోద‌వ్వడం పట్ల ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేర‌కు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. కొత్త‌గా న‌మోదైన నలభై మూడుకేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పైకి చేరింది. వీరిలో తొమ్మిది వందల తొమ్మిది మంది వివిధ ఆస్ప‌త్రుల‌లో చికిత్స పొందుతుండ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు ఎనిమిది వందల ఎనభై ఏడు మంది మంది డిశ్చార్జ్ అయ్యారు.

సమస్యల వలయంలో ఏపి.. విపత్కర పరిణామాలతో అతలాకుతలం..

సమస్యల వలయంలో ఏపి.. విపత్కర పరిణామాలతో అతలాకుతలం..

అంతే కాకుండా గ‌త ఇరవై నాలుగు గంట‌ల్లో ముగ్గురు మ‌ర‌ణించ‌డంతో క‌రోనా మ‌ర‌ణాలు నలభై నాలుగుకి చేరాయి. తాజా కేసుల్లో అనంత‌పురం జిల్లాలో మూడు, విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ఐదు, గుంటూరు జిల్లాలో రెండు, చిత్తూరులో పదకొండు, క‌ర్నూలులో ఆరు, కృష్ణా జిల్లాలో ఏకంగా పదహారు కేసులు న‌మోద‌య్యాయి. ఇదిలా ఉంటే, మొద‌టి నుంచి క‌రోనా కేసులు అధికంగా గ‌ల క‌ర్నూలు జిల్లాలో కేంద్ర బృందం ప‌ర్య‌టించ‌నుంది. ఈ రోజు శ‌నివారం సాయంత్రం కేంద్ర వైద్య బృందం క‌ర్నూలుకు చేరుకుంటుంది. ఆదివారం నుంచి ఆరు రోజుల పాటు ఈ బృందం సభ్యులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

మినహాయింపులతోనే ఇబ్బందులు.. కట్టడిచేసే దిశగా ప్రభుత్వం..

మినహాయింపులతోనే ఇబ్బందులు.. కట్టడిచేసే దిశగా ప్రభుత్వం..

కర్నూలు, నంద్యాల తో పాటు ఇతర ప్రాంతాలను కేంద్ర బృందం సంద‌ర్శించ‌నుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కోవిడ్‌ ఆసుపత్రి అయిన కర్నూలు ప్రభుత్వసర్వజన వైద్యశాలను, కేఎంసీలోని వైరాలజీ ల్యాబ్‌ను, అక్కడి వైద్యసౌకర్యాలు, పరికరాలను, రోగుల వివరాలను వారు తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే విశ్వభారతి కోవిడ్‌ హాస్పిటల్, శాంతిరామ్‌ హాస్పిటల్‌లను వారు సందర్శించనున్నారు. అంతే కాకుండా కరోనా సోకిన రోగులకు ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు, వారి లక్షణాలు, పర్యవేక్షణ, తదితర అంశాలను కూడా కేంద్ర బృందం తనిఖీ చేయనుంది. అంతే కాకుండా వైద్య అధికారులు నిర్వహిస్తున్న టెస్టులు, ప్రభుత్వం చెప్తున్న లెక్కలపైన ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు కేంద్ర బృందం సభ్యులు.

English summary
The coronavirus epidemic seems to have thrown a claw once again in AP. There is talk that forty-three positive coronal cases have become alarming in the past twenty-four hours. There is debate that the cases are on the rise as the government facilitates some businesses, including liquor stores in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X