వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఒక్క రోజులోనే భారీగా పెరిగిన కరోనా కేసులు, 893కు చేరిక, మరణాలు 27

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ రోజు రోజుకు వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం, వివిధ శాఖలు అహర్నిశలు పనిచేస్తున్నప్పటికీ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు కరోనా కట్టడి కోసం తమవంతు పాత్రను పోషిస్తున్నారు.

భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు


కాగా, గడిచిన 24 గంటల్లో 6, 552 నమూనాలను పరీక్షించగా 80 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 893కు చేరింది.

కరోనా మరణాలు కూడా పెరిగాయి..

కరోనా మరణాలు కూడా పెరిగాయి..

కాగా, కరోనా బారిన పడి గురువారం కర్నూలు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మృతి చెందినవారి సంఖ్య 27కు చేరింది. గత 24 గంటల్లో 21 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 141 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం 725 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఎమర్జెన్సీ కేసులకు ఆటంకాలొద్దు.. సీఎం ఆదేశం

ఎమర్జెన్సీ కేసులకు ఆటంకాలొద్దు.. సీఎం ఆదేశం

ఇది ఇలావుండగా, లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో క్యాన్సర్, డయాలసిస్ వంటి రోగులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. 104కి కాల్ చేస్తే వెంటనే స్పందించేలా అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. డెలివరీ కేసులతోపాటు ఎమర్జెన్సీ కేసులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. ఏ సమస్య ఉన్నా 1902కు కాల్ చేయాలని ప్రజలకు సీఎం సూచించారు. కాగా, ప్రతిపాదిత కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు వెంటనే స్థలాలు గుర్తించాలని ఆదేశించారు.

పరీక్షలు మరింత పెంచాలి..

పరీక్షలు మరింత పెంచాలి..

ఇక కరోనా నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కర్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం జగన్.. కరోనా పరీక్షల విషయంలో వెనకడుగు వేయొద్దని ఆదేశించారు. బుధవారం ఒక్కరోజే 6520 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశామని, ఇప్పటి వరకు మొత్తంగా 48,034 పరీక్షలు చేసినట్లు అధికారులు వివరించారు. కాగా, కరోనా పరీక్షల సంఖ్య బాగా పెరగడంపై అధికారులను సీఎం అభినందించారు. దక్షిణ కొరియా నుంచి తీసుకొచ్చిన ర్యాపిడ్ కిట్లకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిందని తెలిపారు. నిర్దేశించిన ప్రొటోకాల్ ప్రకారం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈ కిట్లతో ఇప్పటి వరకు 14,423 పరీక్షలు నిర్వహించామని, వాటిలో 11,543 టెస్టులు రెడ్ జోన్లలోనే చేసినట్లు తెలిపారు. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో చేసిన పరీక్షల్లో సుమారు 30కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వీటి నిర్ధారణకు పీసీఆర్ టెస్టులకు పంపినట్లు తెలిపారు.

Recommended Video

Coronavirus: COVID-19 Cases Reached 893 Mark In AP With 80 New Cases

English summary
corona positive cases toll to 893 in andhra pradesh, deaths 27.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X