హిందూపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా రిలీఫ్ ఫండ్ .. రెండు తెలుగు రాష్ట్రాలకు, సినీ కార్మికులకు బాలకృష్ణ భారీవిరాళం

|
Google Oneindia TeluguNews

కరోనాపై పోరాటంలో ఇప్పటికే సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు మేము సైతం అంటున్నారు.ప్రభుత్వాలకు బాసటగా నిలుస్తున్నారు . ప్రజలను కరోనా నుండి కాపాడుకోవటానికి ఇళ్లకే పరిమితం అవ్వాలని హితవు చెప్తున్నారు . ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్న సమయంలో ఈ రక్కసితో పోరాటం సాగించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. ఇప్పటికే దేశంలో ఈ మహమ్మారి వలన 79 మంది మరణించగా, 2400 మందికి పైగా వైరస్ బారిన పడ్డారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఒక రెండు మూడు రోజుల్లోనే ఊహించని విధంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి.ఇక ప్రభుత్వాలు చేస్తున్న ఈ ప్రయత్నానికి తాము సైతం చేదోడు వాదోడుగా ఉంటామని ఎవరికి సాధ్యమైన ఆర్ధిక సాయం వారు చేస్తున్నారు ప్రముఖులు . ఇప్పటికే సినిమా స్టార్స్ చాలామంది ముందుకు వచ్చి విరాళం అందించారు. సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ముందుకు వచ్చి తన వంతు సహాయం అందించారు.

Corona Relief Fund..Balakrishna huge donation to Telugu States and film industry workers

Recommended Video

PM Urges People To Light Diyas For 9 Minutes On April 5 At 9 PM

హిందూపురం ఎమ్మెల్యే , సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాలకు , అలాగే సినీ పరిశ్రమ కార్మిక వర్గాల కోసం రూ.1.25 కోట్ల విరాళం అందించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధులకు కోటి రూపాయలు, సినీ కార్మికుల కోసం రూ. 25 లక్షలు ఇస్తున్నట్టుగా బాలకృష్ణ పేర్కొన్నారు.ఇప్పటికే సినీ కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి, నాగార్జున కోటి రూపాయలను ప్రకటించారు . యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఇప్పటికే ప్రభాస్ కరోనా వైరస్ పై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో భాగంగా నాలుగు కోట్ల విరాళం ఇచ్చాడు .

English summary
Hindupuram MLA and film actor Nandamuri Balakrishna has donated Rs 1.25 crore to Telugu states as well as to the film industry working class. This includes the payment of crore to the chief ministerial aides of Telugu states and Balakrishna said he was giving Rs 25 lakh to the film industry workers. Chiranjeevi and Nagarjuna have already announced Rs 1 crore for the welfare of the film workers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X