వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క‌రోనా రిలీఫ్ ఫండ్‌.. వారి తరపున కోటి రూపాయల భారీ విరాళం ఇస్తామన్న ఏపీ మంత్రి

|
Google Oneindia TeluguNews

కరోనా ఇప్పుడు ప్రపంచాన్నే వణికిస్తుంది. కరోనా ప్రభావంతో ప్రపంచ దేశాల ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇక కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుంటే కరోనా తో పోరాటానికి ప్రభుత్వానికి, ఇళ్లకే పరిమితమైన సామాన్యులకు సాయమందించేందుకు ఆపన్న హస్తాలు ముందుకు వస్తున్నాయి.

సామాన్యులను కరోనా విషయంలో ఆదుకునేందుకు ముందుకు వస్తున్న ప్రముఖులు

సామాన్యులను కరోనా విషయంలో ఆదుకునేందుకు ముందుకు వస్తున్న ప్రముఖులు

రెక్కాడితే గానీ, డొక్కాడని వారు కరోనా ప్రభావంతో ఇళ్లకే పరిమితం అయితే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది . అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా విషయంలో లాక్ డౌన్ ప్రకటిస్తూ పేదలకు ఉచిత రేషన్ అందిస్తామని , ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించాయి.ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆ పనిలో ఉన్నాయి. ఇక తాజాగా ఏపీలో కూడా లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం నిరుపేదలకు సాయం అందిస్తామని చెప్పింది.

భారీ విరాళాన్ని ప్రకటించిన ఏపీ మంత్రి శ్రీరంగనాధరాజు

భారీ విరాళాన్ని ప్రకటించిన ఏపీ మంత్రి శ్రీరంగనాధరాజు

ఇక ఈ క్రమంలో దేశం , అటు రాష్ట్రాలు కరోనాపై యుద్ధం చేస్తున్నాయి. ఈ యుద్ధానికి తమ వంతు మద్దతుగా సాయం చెయ్యటానికి చాలా మంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు.

ప్ర‌భుత్వాల‌కు అండ‌గా ప‌లువురు త‌మ‌వంతు స‌హాయాన్ని అంద‌జేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీ మంత్రి శ్రీరంగనాథరాజు భారీ విరాళం ప్రకటించారు. కరోనా పై పోరాటంలో మేము సైతం అని ఆయన ప్రకటించారు . ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విస్త‌రిస్తోన్న క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌కు వైసీపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు .

రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ తరఫున ప్రభుత్వానికి కోటి విరాళం

రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ తరఫున ప్రభుత్వానికి కోటి విరాళం

రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు కరోనా నివారణ చర్యలకు రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ తరఫున ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళంగా అందజేస్తామని ప్ర‌క‌టించారు. కరోనా వైరస్ ను పూర్తి స్థాయిలో తరిమికొట్టేందుకే వైసీపీ ప్రభుత్వం లాక్‌ డౌన్‌ ప్రకటించిందని, ప్రజలంతా సహకరించాలని శ్రీరంగనాథరాజు తెలిపారు. ప్రజలందరూ కచ్చితంగా లాక్‌ డౌన్‌ పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Recommended Video

Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd
కరోనా సహాయ నిధికి సాయమందిస్తున్న ప్రముఖులు

కరోనా సహాయ నిధికి సాయమందిస్తున్న ప్రముఖులు

వ్యక్తిగత పరిశుభ్రతతో కరోనా వైరస్‌ను నియంత్రించవచ్చని, అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని, లేకపోతే ఇళ్లకే పరిమితం కావాలని మంత్రి సూచించారు. ఇప్పటికే పలు కార్పోరేట్ సంస్థలు , పలువురు ప్రముఖులు కరోనా సహాయ నిధికి తమ వంతు సాయం పంపిస్తున్నారు. అంతే కాదు అవసరం అనుకున్న చోట ప్రజలకు ఆహారాన్ని అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

English summary
State Housing Minister Sriranganatha Raju has promised to donate one crore rupees on behalf of rice millers association and said that the YCP government has announced a lockdown as the coronavirus has been fully eradicated. The public has urged strict lockdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X