• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా నేర్పిన సృజన : కొత్త‌గా ఫ్లోర‌ల్, డిజైనర్ మాస్క్‌లు ; తెలుగురాష్ట్రాల్లో శ్రావణ మాస పెళ్లిళ్ల శోభ !!

|

కరోనా కష్టకాలం ప్రజల ఎన్నో వినూత్న ఆలోచనలకు కారణమవుతోంది. కొత్త కొత్త ఆవిష్కరణలకు కరోనా ఊతమిచ్చింది. కరోనా మహమ్మారి కాలంలో మాస్కులు లేకుండా బయట తిరగలేని పరిస్థితి రకరకాల అందమైన మాస్కుల తయారీకి కారణమయ్యింది. ఇక పెళ్లిళ్లు చేసుకునే వధూవరులకు అయితే పూలతో చక్కగా తయారుచేసిన ఫ్లోరల్ మాస్కులు, రకరకాల స్టోన్ లు, చమ్కీ వర్క్ తో వధూవరుల వస్త్రాలకు అనుగుణంగా తయారు చేస్తున్న డిజైనర్ మాస్కులు ఇప్పుడు మార్కెట్లో సందడి చేస్తున్నాయి.

ప్రేమ ఎంత పని చేసింది .. డమ్మీ పిస్టల్ తో చోరీ చేసి దొంగని చేసింది, ఆపై అడ్డంగా బుక్ చేసిందిప్రేమ ఎంత పని చేసింది .. డమ్మీ పిస్టల్ తో చోరీ చేసి దొంగని చేసింది, ఆపై అడ్డంగా బుక్ చేసింది

వివాహాలు చేసుకునే వధూవరులకు సైతం మాస్కులు తప్పనిసరి

వివాహాలు చేసుకునే వధూవరులకు సైతం మాస్కులు తప్పనిసరి

గత సంవత్సరం జనవరి నెల నుండి కరోనా మహమ్మారి భారత దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఒకరి నుండి ఒకరికి వ్యాపించే ఈ మహమ్మారి గాలి ద్వారా, నోటి తుంపరల ద్వారా, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వ్యాప్తి చెందుతుందని మాస్కులు తప్పనిసరిగా ధరించాలని నిపుణులు సూచించడంతో అప్పటి నుండి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తున్నారు. ఎవరైనా బయటకు వెళ్లాలంటే మాస్కులు ధరించడం తప్పనిసరి చేయడంతో కచ్చితంగా మాస్క్ లను పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక వివాహాది శుభకార్యాలలో అయినా సరే మాస్కులు తప్పనిసరి. పెళ్లి చేసుకునే వధూవరులు సైతం తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిన పరిస్థితి. దీంతో వధూవరుల కోసం అందమైన మాస్కులు మార్కెట్లో సందడి చేస్తున్నాయి.

కళ్యాణ మండపాలలోనూ తప్పనిసరిగా కరోనా ప్రోటోకాల్స్

కళ్యాణ మండపాలలోనూ తప్పనిసరిగా కరోనా ప్రోటోకాల్స్

గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా తెలుగు రాష్ట్రాలలో చాలా కళ్యాణ మండపాలు వెలవెలబోయాయి. చాలామంది పెళ్ళిళ్ళను వాయిదా వేసుకోగా, కొందరు కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో తూతూమంత్రంగా వివాహాది శుభకార్యాలను నిర్వహించారు. ఇక ఈ ఏడాది కరోనా కాస్త ఉపశమనం కలిగించడంతో అన్లాక్ ప్రక్రియలో భాగంగా శుభకార్యాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్. ఫంక్షన్ హాల్స్ నిర్వహించుకోవచ్చని, కాకుంటే వంద మంది కంటే ఎక్కువ మందికి అనుమతి లేదని, ఇక పెళ్లిళ్లకు వచ్చిన వారందరూ మాస్కులు తప్పని సరిగా ధరించాలని ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. అంతే కాదు కల్యాణ మండపాలలోనూ కరోనా ప్రోటోకాల్ ను పాటించాలని కూడా పేర్కొన్నారు.

 శ్రావణమాస పెళ్ళిళ్ళ శోభ .. ఈసారి ఫ్లోరల్, డిజైనర్ మాస్కులే ప్రత్యేకం

శ్రావణమాస పెళ్ళిళ్ళ శోభ .. ఈసారి ఫ్లోరల్, డిజైనర్ మాస్కులే ప్రత్యేకం

ఈ క్రమంలో ఇప్పుడు శ్రావణ మాసంలో పెళ్లిళ్లు కొనసాగుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో కొత్తకొత్త ఫ్లోరల్ మాస్కులు కనువిందు చేస్తున్నాయి. మామూలు క్లాత్ తో తయారు చేసిన మాస్కులపై అందంగా పూలతో అలంకరించి, వాటిని ఊడకుండా కుట్టి ఫ్లోరల్ మాస్క్ లను తయారు చేస్తున్నారు. అంతేకాదు వధూవరుల పెళ్లి వస్త్రాలకు తగ్గట్టుగా కూడా చక్కగా ఎంబ్రాయిడరీ చేసిన, మగ్గం వర్క్ చేసిన, స్టోన్స్, చమ్కీలతో అందంగా అలంకరించిన మాస్కులు ఇప్పుడు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఇక ఈ తరహా మాస్కులకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది.

 వివాహాల సాక్షిగా బయటపడుతున్న ప్రజల్లో ఉన్న సృజనాత్మకత

వివాహాల సాక్షిగా బయటపడుతున్న ప్రజల్లో ఉన్న సృజనాత్మకత

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో పెళ్లి హడావిడి కొనసాగుతున్న వేళ పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె చక్కని పూల మాస్కులతో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. చక్కగా రెడీ అయ్యి, అందంగా కనిపించకుండా ఈ మాస్కులు గోల ఏమిటి అని బాధపడే వధూవరులకు, పువ్వుల మాస్కులు మంచి సువాసనతో ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా, అందాన్ని కూడా చేకూరుస్తున్నాయి. ఏది ఏమైనా కరోనా సమయంలో పెళ్లిళ్లు చేసుకునేవారు కరోనా ప్రోటోకాల్ పాటించడానికి పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు అనేది అర్థం అవుతున్నప్పటికీ, ప్రజల్లో ఉన్న సృజనాత్మకత వివాహాల సాక్షిగా బయట పడుతుంది.

English summary
The inability to go outside without masks during the corona epidemic led to the making of a variety of beautiful masks. For the newlyweds, however, floral masks, various stones,chumky work designer masks made to suit the bridal attire are now making a splash in the market.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X