• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా టైమ్.. అయినా సరే .. 12 లక్షల మందికి లబ్ది చేసే ఏపీ సర్కార్ మరో కొత్త పథకం

|

ఏపీలో తాజా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. అయినా సరే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం సంక్షేమ పథకాలను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు . మొన్నటికి మొన్న పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని అందించిన జగన్ ఇప్పుడు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టటానికి సిద్ధం అవుతున్నారు . ఇప్పటికే జగనన్న అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన వంటి పథకాలతో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఆర్ధిక సాయం అందించి అండగా ఉన్న సీఎం జగన్ ఇవాళ జగనన్న విద్యాదీవెన పేరుతో మరో పథకాన్ని ప్రారంభించనున్నారు.

జగనన్న విద్యాదీవెన పథకం ప్రారంభం నేడే

జగనన్న విద్యాదీవెన పథకం ప్రారంభం నేడే

పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.ఇక ఈ పథకాన్ని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఒకేసారి అందజేయనున్నట్టు తెలుస్తుంది . రీయింబర్స్‌మెంట్‌ను నగదును విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్ లో జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 12 లక్షల మంది తల్లులు, వారి పిల్లలు లబ్ధి పొందుతారని ఏపీ ప్రభుత్వం చెప్తుంది .

11 నెలల కాలంలోనే దాదాపు రూ.12 వేల కోట్లు

11 నెలల కాలంలోనే దాదాపు రూ.12 వేల కోట్లు

ఒక పక్క ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతున్నా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఫీజులు బకాయిలు లేకుండా అన్ని త్రైమాసికాలకు సంబంధించి చెల్లించవలిసిన బకాయిలను ఒకే ఆర్థిక సంవత్సరంలో చెల్లించనున్నారు. ఇక ఒక పక్క కరోనా లాక్ డౌన్ ప్రభావంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నా, కరోనా వ్యాప్తి అరికట్టటానికి , అలాగే కరోనా రోగులకు చికిత్స చేయటం కోసం ఖర్చు తడిసి మోపెడు అవుతున్నా సరే సంక్షేమ పథకాలు మాత్రం ఆపేదే లేదని చెప్తుంది సర్కార్ . ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద మొత్తం రూ. 4వేల కోట్లకు పైగా విడుదల చేయనుంది. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా తల్లులకు, వారి పిల్లల చదువుల కోసం కేవలం 11 నెలల కాలంలోనే దాదాపు రూ.12 వేల కోట్లు ప్రభుత్వం అందిస్తుంది.

  Lockdown In AP will Be Eased in Green Zones Across The State
  మొత్తంమూడు నెలలకు ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్

  మొత్తంమూడు నెలలకు ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్

  గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 1,880 కోట్ల బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లించనుంది. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా తల్లులకు వారి పిల్లల చదువుల కోసం 11 నెలల కాలంలోనే ఏపీ ప్రభుత్వం 12 వేల వేల రూపాయలు అందిస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా మొత్తంమూడు నెలలకు ఒకసారి నాలుగు త్రైమాసికాలలో విద్యార్థుల తల్లులకు ఖాతాలలో జమ చేయబడుతుందని చెబుతుంది. ఈ విధంగా కళాశాలల్లో జవాబుదారీతనం పెరుగుతుందని, కాలేజీలో స్థితిగతులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.మొత్తానికి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం జరిగినా సరే సీఎం జగన్ మాత్రం పాలనలో తన పంధా ఇదే అని సంక్షేమం కోసమే పని చేస్తున్నారు .

  English summary
  Jagan, who has offered a zero interest scheme to women in dwakra societies, is now preparing to roll out another scheme. CM Jagan going to launch Jagannanna Vidyadeevena scheme today , ap government already implementing the jagannanna amma odi and Jagannanna vasathi deevena , is providing financial assistance for the students' golden future.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more