వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఒక్కడి ద్వారా 82 మందికి కరోనా .. ఒకే ఊరిలో ఏకంగా 54 మంది బాధితులు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్..ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించే అంటువ్యాధి. సామాజిక దూరం అవసరమని ప్రభుత్వాలు, ప్రచార మాధ్యమాలు ఎంతగా చెబుతున్నా ప్రజలకు అవి అర్థం కావడం లేదు. చెవిటి వాడి చెవిలో శంఖం ఊదినట్లుగానే ఉంది ధోరణి. ఇక ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి ఏకంగా 82 మందికి కరోనా వైరస్ వ్యాపించడానికి కారణమయ్యారు అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నామో అర్థం చేసుకోవచ్చు.

corona update : ప్రపంచంలో 9వ స్థానానికి భారత్ .. ఇండియాలో తాజా పరిస్థితి ఇది !!corona update : ప్రపంచంలో 9వ స్థానానికి భారత్ .. ఇండియాలో తాజా పరిస్థితి ఇది !!

 కరోనా సూపర్ స్ప్రెడర్.. ఏకంగా 82 మంది కరోనా పాజిటివ్

కరోనా సూపర్ స్ప్రెడర్.. ఏకంగా 82 మంది కరోనా పాజిటివ్

ఇక విషయానికి వస్తే తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామంలో కరోనా పాజిటివ్ ఉన్న ఒక సూపర్ స్ప్రెడర్ ద్వారా ఏకంగా 82 మంది కరోనా పాజిటివ్ బాధితులుగా మారారు. ఒక వ్యక్తి ద్వారా ఇంతమందికి కరోనా సోకటం రాష్ట్రంలో ఇదే ప్రథమం. వారం క్రితం వరకు తక్కువగా ఉన్న కేసులు కొన్ని రోజులుగా ఏపీలో పెరుగుతూ పోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

21వ తేదీన తొలి కరోనా పాజిటివ్ కేసు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

21వ తేదీన తొలి కరోనా పాజిటివ్ కేసు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

ఇక తాజాగా తూర్పుగోదావరి జిల్లా జి.మామిడాడ లో నమోదైన ఓ కేసు ద్వారా 82 మంది బాధితులు గా మారిన వార్త ప్రస్తుతం ఏపీ ప్రజలను షాక్ కు గురి చేస్తుంది. జి మామిడాడ లో మే 21వ తేదీన తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇక అదే రోజున ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆ తర్వాత జీ మామిడాడలో కేసులు పెరగడం మొదలైంది. మృతి చెందిన కరోనా బాధితుడి ద్వారాజి.మామిడాడ గ్రామంలో 54 మంది కరోనా బాధితులుగా మారారు.

గ్రామంలో 54 మందితో కలిపి చుట్టుపక్కల గ్రామాలలో 82మందికి కరోనా

గ్రామంలో 54 మందితో కలిపి చుట్టుపక్కల గ్రామాలలో 82మందికి కరోనా

ఇక అంతే కాదు చుట్టుపక్కల ఐదు మండలాలకు కూడా జి.మామిడాడ పాజిటివ్ కేసు నుండి కరోనా వ్యాప్తి చెందింది. మొత్తంగా చూస్తే ఈ ఒక్క కాంటాక్ట్ నుండి 82 మంది కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. పెదపూడి, బిక్కవోలు రామచంద్రపురం, అనపర్తి, మండలాల్లోని 82 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా వైద్య అధికారులు చెబుతున్నారు. ప్రైమరీ కాంటాక్ట్ మాత్రం మొట్టమొదటి కరోనా కేసు నమోదైన వ్యక్తిగానే భావిస్తున్నారు.

Recommended Video

Pawan Kalyan Slams AP Govt Over Sand Mafia In West Godavari
 సామాజిక దూరం పాటించాలని అధికారుల విజ్ఞప్తి

సామాజిక దూరం పాటించాలని అధికారుల విజ్ఞప్తి

కరోనా బారిన పడిన ఆ వ్యక్తి చనిపోయినా ఇంతమందిని బాధితులుగా మార్చాడు .సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు నెత్తీనోరు కొట్టుకుని చెప్తున్నా,మారని ప్రజల తీరు వారిని కరోనా బాధితులుగా మారుస్తుంది. ఇక ఈ ఘటన ద్వారానైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా వ్యాప్తిని గురించి అర్థం చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

English summary
In a recent case in the East Godavari district, G. mamidada, 82 people have become victims of corona. The first corona positive case was reported on May 21 in G Mamidada. The man died on the same day while undergoing treatment at the hospital. Subsequently, 54 people in G. Mamidada and 82 neighboring villagers became victims of corona.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X