ఏపీలో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులో 1,831 మందికి పాజిటివ్.. ఈనెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రెట్టింపు అవుతోంది. గడిచిన 24 గంటల్లో 1,831 మందికి పాటిజివ్‌గా నిర్థారణ అయింది. 242 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్యరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,195 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. అత్యధిక కేసులు చిత్తూరు జిల్లలో నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి పెరడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఒక్కరోజులోనే రెట్టింపు కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య సొమవారంతో పోలిస్తే ఈ రోజు ( మంగళవారం ) రెట్టింపు అయ్యాయి. నిన్న 984 కేసులు రాగా ఇవాళ 1831 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో 36,452 శాంపిల్స్‌ని పరీక్షించించారు. కరోనా బారి నుంచి 242 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 7,195 మంది కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 3, 16,66, 683 మంది శాంపిల్స్ పరీక్షించగా 20,84,674 మందికి కరోనా సోకింది. వారిలో 20, 62, 974 మంది కోలుకున్నారు. 14,505 మంది కరోనా బారిన పడి మరణించారు.

చిత్తూరులో కరోన విలయతాండవం
రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 467 కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 295, కృష్ణా 190, గుంటూరు 164, అనంతపురం 161, నెల్లూరు 129, శ్రీకాకుళం జిల్లా 122, తూర్పు గోదావరి 84, పశ్చిమగోదావరి 57, కర్నూలు జిల్లా 56 , ప్రకాశం జిల్లా 46, విజయనగరం 40 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కడప జిల్లాలో అత్యల్పంగా 20 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో జనం గుంపులు గుంపులు ఉండవద్దని సూచిస్తున్నారు.

ఈనెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ
ఏపీలో
కర్ఫ్యూ
ఆంక్షలను
ప్రభుత్వం
సడలించింది.
సంక్రాంతి
తర్వాత
నుంచి
రాత్రి
పూట
కర్ఫ్యూ
అమలు
చేయాలని
నిర్ణయించింది.
సంక్రాంతి
పండగ
నేపథ్యంలో
పట్టణాల
నుంచి
పెద్ద
సంఖ్యలో
పల్లెలకు
ప్రజలు
తరలివస్తున్నారు.
దీంతో
కర్ఫ్యూను
ఈనెల
18వ
తేది
నుంచి
నైట్
కర్ఫ్యూ
అమలులోకి
వస్తుందని
ఉత్తర్వులు
జారీ
చేసింది.
కరోనా
మహమ్మారి
కట్టడికి
ప్రతి
ఒక్కరూ
మాస్క్
ధరించాలని
సూచించింది.
మాస్క
ధరించకుండా
ప్రయాణం
చేస్తే
జరిమానా
విధించాలని
అధికారలుకు
ఆదేశాలు
ఇచ్చింది.
ఇప్పటికే
ఆర్టీసీలో
మాస్క్
ధరించకుండా
ప్రయాణం
చేసేవారికి
రూ
50
జరిమానా
విధించింది.
వైరస్
కట్టడికి
ప్రజలు
సహకరించాలని
విజ్ఞప్తి
చేసింది.