• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా దెబ్బకు మామిడి రైతు విలవిల .. లాక్ డౌన్ తో కొనసాగని మామిడి ఎగుమతులు

|

మామిడి రైతన్నకు కరోనా కష్టకాలం తెచ్చింది . అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను ఎదుర్కొని పండిన పంటను మార్కెట్ కు తెచ్చి అమ్ముకుందామని భావిస్తే కరోనా మామిడి రైతులపై తన ప్రభావాన్ని చూపిస్తుంది . ఈ సారి అసలే చాలా తక్కువ కాసిన మామిడిని అమ్ముకోవటానికి కూడా వీలు లేని పరిస్థితి లాక్ డౌన్ కారణంగా మామిడి రైతుకు ఏర్పడింది. ఏటా వేల టన్నుల మామిడి ఒడిసా, పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గడ్‌ వంటి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. కానీ ఇప్పుడు ఎగుమతికి ఏ మాత్రం అవకాశం లేదు . ఈ ఏడాది మామిడి ఎగుమతుల ప్రారంభ సీజన్‌ నుంచి లాక్‌డౌన్‌ ప్రారంభం కావడంతో ఎగుమతులు లేక రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.

మామిడి రైతులకు లాక్ డౌన్ కష్టాలు

మామిడి రైతులకు లాక్ డౌన్ కష్టాలు

లాక్‌డౌన్‌ దెబ్బకు ఇప్పటివరకు మార్కెట్లు తెరచుకోలేదు. ఎగుమతులకు వాహనదారులు ముందుకు రావడం లేదు. స్థానికంగా అమ్ముకుందామన్నా లాక్‌డౌన్‌ నిబంధనలతో కొనేవారూ కనిపించడం లేదు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో పక్వానికి వచ్చిన మామిడి కాయలు చెట్టుపైనే ఉండిపోతున్నాయి. దీంతో మామిడి రైతన్న దిగాలు చెందుతున్నారు . ఇక మామిడికి ప్రసిద్ధి చెందిన నూజివీడు మామిడి రైతన్నలు తాజా పరిస్థితుల నేపధ్యంలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. నూజివీడు మామిడికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. నూజివీడు డివిజన్‌లో లక్షా 20వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తున్నారు .

ఇతర రాష్ట్రాలకు నూజివీడు మామిడి ఎగుమతులు

ఇతర రాష్ట్రాలకు నూజివీడు మామిడి ఎగుమతులు

నూజివీడు డివిజన్ లోని ముసునూరు, చాట్రాయి, తిరువూరు, ఆగిరిపల్లి, రెడ్డిగూడెం మండలాల్లో విస్తారంగా సాగవుతోంది. ఏటా మూడు లక్షల మెట్రిక్‌ టన్నులు దిగుబడి వస్తుంది. ప్రధానంగా బంగినపల్లి, తోతాపూరి రకాలలో దాదాపు 80 శాతం పంట ఎగుమతులపై ఆధారపడి ఉంది. ఏటా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌ గడ్డిఅన్నారం మార్కెట్ కు , మహారాష్ట్రలోని ముంబై, నాగ్‌పూర్‌, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, న్యూఢిల్లీ, కోల్‌కతా, చెన్నై ప్రాంతాలకు నూజివీడు నుంచి అధికంగా ఎగుమతులు అవుతాయి.

 చాలా చోట్ల చెట్టు దిగని మామిడి

చాలా చోట్ల చెట్టు దిగని మామిడి

ఇప్పటి వరకు కరోనా కేసులు తగ్గకపోవటం , లాక్ డౌన్ ఎత్తివేసే పరిస్థితి లేకపోవటం , ప్రజలు ఇళ్లకే పరిమితం కావటం వెరసి మామిడి విక్రయాలు ఈ సారి పెద్దగా ఉండకపోవచ్చు అన్న భావన కలుగుతుంది. ఇప్పుడిప్పుడే వ్యాపారులు, రైతులు ఉద్యాన శాఖ అధికారుల నుంచి అనుమతి తీసుకొని ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాల కూడా మార్కెట్లు మూసి ఉండడంతో డిమాండ్‌, ధర తగ్గింది. లాక్‌డౌన్‌ కారణంగా ఎగుమతులు లేక అసలు చెట్టు నుండి మామిడి కొయ్యాలో, వద్దో అర్ధం కాక రైతులు డైలమా లో ఉన్నారు .

  Lockdown: Kanpur Police Perform 'Aarti' Of People who Are Roaming Out During Lockdown
  మామిడి రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలని వేడుకోలు

  మామిడి రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలని వేడుకోలు

  మామిడి ఎగుమతులు పూర్తిగా తగ్గిన నేపథ్యంలో ఇప్పటికే చెట్ల మీదే కాయలు ఉన్న పరిస్థితులలో ఈదురుగాలులు, భారీ వర్షాలు వస్తే మొత్తం పంట నేల రాలి తీవ్ర నష్టాలు చవి చూసే పరిస్థితి వస్తుందని రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తమను ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతున్నారు . మామిడి ఎగుమతులకు , విక్రయాలకు రైతన్నలను ఆదుకోవటానికి ప్రభుత్వ చొరవ అవసరం అని రైతులు అంటున్నారు .

  English summary
  The corona virus that is now trembling the world . corona virus effected the mango crop . the farmers are facing problems with the lack of MSP and also the problem in exportation of mangoes to other states due to the present lock down . due to the corona virus effect india has stopped the exportation and blocked the all states borders . most of the mangoes from nuziveedu exported to other states including telangana .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X