ఏపీ కరోనా విస్ఫోటనం.. ఒక్కరోజులో 3,205 కొత్త కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఒక్కరోజులోనే దాదాపు రెట్టింపు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3,205 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 281 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 10,119 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధిక కేసులు 695 విశాఖపట్నం జిల్లాలో నమోదయ్యాయి.
ఏపీలో ఒక్క రోజులో 3,205 కొత్త కరోనా కేసులు
ఏపీలో
కరోనా
వైరస్
విజృంభిస్తోంది.
రోజు
రోజుకు
కరోనా
బారిన
పడుతున్న
వారి
సంఖ్య
రెట్టింపు
అవుతోంది.
గడిచిన
24
గంటల్లో
41,954
శాంపిల్స్
పరీక్షించగా
3,205
మందికి
కరోనా
పాజిటివ్
గా
నిర్థారణ
అయింది.
ఈ
సంఖ్య
నిన్నటితో
(
మంగళవారం
)
పోలిస్తే
దాదాపు
రెట్టింపు
కేసులు
వెలుగులోకి
వచ్చాయి.
మంగళవారం
1831
కేసులు
నమోదయ్యాయి.
ప్రస్తుతం
ఏపీ
వ్యాప్తంగా
10,119
యాక్టివ్
కేసులు
ఉన్నాయని
రాష్ట్ర
వైద్యారోగ్య
శాఖ
వెల్లడించింది.
రాష్ట్రంలో
ఇప్పటి
వరకు
నమోదైన
మొత్తం
20,84,984
కేసులకు
గాను
20,60,360
మంది
కోలుకున్నారు.
14,
505
కరోనా
బారిన
పడి
మృతి
చెందారు.
విశాఖలో వైరస్ విజృంభణ
కరోనా వ్యాప్తి పెరగడంతో రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 695 కొత్త కేసులు నమోదయ్యాయి. తర్వాత చిత్తూరు 607, తూర్పుగోదావరి 274, శ్రీకాకుళం 268, గుంటూరు 224, కృష్ణా 217, విజయగరం 212, నెల్లూరు 203 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అటు అనంతపురం 160, కర్నూలు 123, పశ్చిమ గోదావరి 90, ప్రకాశం 90, కడప 42 కొత్త కేసులు వచ్చాయి. మంగళవారంతో పోల్చితే దాదాపు అన్ని జిల్లాల్లో కేసులు రెట్టింపు అయ్యాయి. మరణాల సంఖ్య మాత్రం తగ్గింది.

కరోనా నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా
పండగ సీజన్ కావడంతో ఇతర ప్రాంతాలనుంచి పెద్ద సంఖ్యలో ప్రజల తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. నేపథ్యంలో కరోనా కేసులు మరింత పరిగే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నారు. రాష్ట్రంలో థర్డ్ వేవ్ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టంచేశారు. ప్రజలు కరోనా నిబంధలు పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని కోరారు. ధరించకపోతే రూ. 100 ఫైన్ విధించాలని ఆదికారులకు ఆదేశించారు. ఈనెల 18నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.