వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా: సీఎం జగన్ కీలక సందేశం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో గురువారం మరో ఇద్దరు మరణించడంతో కొవిడ్-19 మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది. అలాగే, కొత్తగా 15మందికి వైరస్ సోకడంతో పాజిటివ్ కేసులు సంఖ్య 363కు చేరింది. ఇప్పటిదాకా కృష్ణా(2), అనంతపురం(2), విశాఖపట్నం(1) జిల్లాలవారే చనిపోగా, తొలిసారి గుంటూరులోనూ ఓ మరణం నమోదైంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం లాక్ డౌన్ ఆదేశాలపై ప్రజల్ని మరోసారి అప్రమత్తం చేసింది. పైగా,

శుక్రవారం క్రైస్తవులకు పవిత్రదినమైన 'గుడ్ ఫ్రైడే' కావడం, ఆ వెంటనే ఈస్టర్ పండుగ ఉన్న నేపథ్యంలో క్రైస్తవులంతా ఇళ్లలోనే ప్రార్థనలు, వేడుకలు జరుపుకోవాలని సీఎం జగన్ సూచించారు. కరోనా మహమ్మారి నుంచి మానవాళిని కాపాడాలంటూ కరుణామయుడైన ఏసును ప్రార్థించాలని కోరారు. ఈ సందర్భంగా..''మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవే మానవాళికి జీసస్ సందేశాలు''అని జగన్ గుర్తు చేశారు.

 coronavirus: ap cm jagan good friday and easter wishes, urged people to stay at homes

అంతకుముందు, కేసుల వివరాలను వెల్లడించిన వైద్య ఆరోగ్య శాఖ.. ఏపీలో కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ఆస్పత్రుల్లో సౌకర్యాల కొరత లేదని, కరోనా టెస్టుల విషయంలోనూ రాష్ట్రమే ముందంజలో ఉందని తెలిపింది. గురువారం కొత్తగా నమోదైన 15 పాజిటివ్ కేసుల్లో 11 మంది ప్రకాశం జిల్లాకు చెందినవాళ్లేనని, పేర్కొంది. మొత్తం కేసుల సంఖ్య 363కాగా, మొత్తం 75 కేసులతో కర్నూలు మోస్ట్ ఎఫెక్టెడ్ జిల్లాగా ఉంది. గుంటూరు (51), నెల్లూరు (48), ప్రకాశం (38), క్రిష్ణా (35) కేసులు నమోదయ్యాయి.

English summary
on the eve of good friday and easter sunday, andhrapradesh chief minister ys jagan convey wishes through twitter. he told people to stay at homes and pray on coronavirus effect
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X