వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: త్రిముఖ వ్యుహాంతో వైరస్‌ను ఎదుర్కొంటాం, నివారణపై క్యాబినెట్ సబ్ కమిటీ డిస్కషన్..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు త్రిముఖ వ్యుహాంతో ముందుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు శనివారం క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమై.. పరిస్థితిని సమీక్షించింది. వైరస్ నివారణ కోసం పలు కీలక సూచనలు సమావేశంలో చర్చకొచ్చింది. త్రిముఖ వ్యుహానికి సంబంధించి మంత్రివర్గ ఉప సంఘం చర్చించి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. క్యాబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలకు సీఎం జగన్ ఆమోదం తెలుపడంతో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. శనివారం జరిగిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశానికి మంత్రులు కన్నాబాబు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మిగతా సభ్యులు హాజరయ్యారు.

త్రిముఖ వ్యుహం..

త్రిముఖ వ్యుహం..


కరోనా వైరస్ నివారణ కోసం అవలంభించే త్రిముఖ వ్యుహాన్ని మంత్రి కన్నబాబు మీడియాకు వివరించారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జనం గుంపు గుంపులుగా కాకుండా సోషల్ డిస్టన్స్ పాటించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే పంట చేతికి వచ్చినందున.. దానికి కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వైరస్ ప్రబలడంతో ఏపీలో చిక్కుకొన్న వారికి వసతి, భోజనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించిన అంశాలను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళతామని చెప్పారు. సీఎం జగన్ ఆమోదంతో త్రిముఖ వ్యుహాన్ని అమలు చేసి.. వైరస్‌ని పారదోలతామని చెప్పారు.

సోషల్ డిస్టన్స్..

సోషల్ డిస్టన్స్..


వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో జనం భారీగా రోడ్లపైకి వస్తున్నారని కన్నబాబు తెలిపారు. గుంపులు గుంపులుగా రావడంతో వైరస్ వేగంగా వ్యాపించే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా మార్కెట్లలో జనం రద్దీ ఎక్కువగా ఉంది అని.. దీనిని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు వివరించారు. ఇందుకోసం మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అర్బన్ ఏరియాకు..

అర్బన్ ఏరియాకు..


ఆక్వా రంగాన్ని కాపాడుతామని, ఇందుకోసం చర్యలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు వివరించారు. గోదావరి, కృష్ణా డెల్టాలో పంట చేతికొచ్చిందని తెలిపారు. పంట కొనుగోలు కోసం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. శనివారం నాటి త్రిముఖ వ్యుహాం రూరల్ ఏరియాకు మాత్రమే వర్తిస్తోందని.. అర్బన్ కోసం ప్రత్యేక విధానాల అవలంభిస్తామని తెలిపారు.

English summary
cabinet sub committee discuss on virus Prevention andhra pradesh minister kanna babu said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X