వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ మంత్రికి కరోనా పాజిటివ్?: టీడీపీ, జనసేనపై బాలినేని ఆగ్రహం, హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఓ వైపు కరోనావైరస్ వ్యాపిస్తూ భయాందోళనలకు గురిచేస్తుంటే.. మరో వైపు నకిలీ వార్తలు కూడా అదే స్థాయిలో ఆందోళనలు రేపుతున్నాయి. తనకు కరోనావైరస్ సోకిందంటూ జరుగుతున్న ప్రచారంపై స్వయంగా ఏపీ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.

మంత్రి బాలినేనికి కరోనా అంటూ..

మంత్రి బాలినేనికి కరోనా అంటూ..

తనకు కరోనా సోకిందంటూ ప్రతిపాక్ష పార్టీల నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి బాలినేని మండిపడ్డారు. ఒంగోలులో శుక్రవారం మంత్రి బాలినేని కరోనా నియంత్రణా చర్యలను పర్యవేక్షించారు. బాపూజీ మార్కెట్లో కరోనావైరస్ డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. లాక్ డౌన్ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఎవరు ఫోన్ చేసినా సాయం చేస్తానని తెలిపారు.

టీడీపీ, జనసేనకు మంత్రి బాలినేని హెచ్చరిక

టీడీపీ, జనసేనకు మంత్రి బాలినేని హెచ్చరిక

అయితే, తనకు కరోనావైరస్ సోకిందని టీడీపీ, జనసేన పార్టీలు కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా చౌకబారు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి హితవు పలికారు.
అంతేగాక, తనపై ఎవరు ఇలాంటి ప్రచారాలకు తెరతీస్తున్నారో తెలుసునని, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి బాలినేని హెచ్చరించారు.

Recommended Video

New Infection In 3 To 11 Years Of Age Kids In AP
ఇప్పుడూ రాజకీయాలేనా? సేవ చేసేదేమైనా ఉందా?

ఇప్పుడూ రాజకీయాలేనా? సేవ చేసేదేమైనా ఉందా?

రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తప్ప, టీడీపీకి ప్రజలను ఆదుకోవడం తెలియదని అన్నారు. లాక్ డౌన్ సమయంలో టీడీపీ చేసిన సేవా కార్యక్రమాలు ఏంటో చెప్పాలని మంత్రి బాలినేని ప్రశ్నించారు. డప్పు కొట్టుకోవడంలో చంద్రబాబుకు పోటీ లేరని ఎద్దేవా చేశారు. విపత్కర సమయంలో దీక్షలు చేపట్టి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా నివారణ చర్యల్లో వైసీపీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ చంద్రబాబు సహా టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఏపీలో శుక్రవారం మరో 28 కేసులు నమోదు కావడంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 572కు చేరింది. 35 మంది డిశ్చార్జ్ అయ్యారు.

English summary
coronavirus fake news: balineni srinivas reddy fires at TDP and Janasena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X