వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వైరస్ వైసీపీ నేతలకు ఏటీఎంగా .. వారి వల్లే కరోనా ఇంతగా .. చంద్రబాబు ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తాజా కరోనా లాక్ డౌన్ పరిస్థితులపై, అలాగే కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడే ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. ఇక కరోనా వైరస్ వైసీపీ నాయకులకు ఏటీఎంలా మారిందని, కరోనా పేరుతో అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నారని మండిపడ్డారు . వైసీపీ నేతలు ఇష్టా రాజ్యంగా తిరగటం వల్లే కరోనా ఇంతగా ప్రబలిందని ఆయన ఆరోపించారు.

 ప్రజలకు బహిరంగ లేఖ రాసిన చంద్రబాబు .. ఏ విషయంలో అంటే ప్రజలకు బహిరంగ లేఖ రాసిన చంద్రబాబు .. ఏ విషయంలో అంటే

 ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మండలస్థాయిలో 12 గంటల దీక్షలు

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మండలస్థాయిలో 12 గంటల దీక్షలు

కరోనా వ్యాప్తిని అరికట్టటానికి, నిరుపేద ప్రజలను , రైతులను ఆదుకోవటానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మండలస్థాయిలో 12 గంటల దీక్షలు చేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక అన్నదాతల పరిస్థితి లాక్ డౌన్ నేపధ్యంలో అగమ్య గోచరంగా మారిందని అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఇక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన మాజీ సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా బాధ్యతగా పనిచేశామని, ఇప్పుడు కూడా అలాగే ఉందామని చెప్పుకొచ్చారు.

 వైసీపీ నేతల వల్లే కరోనా వ్యాప్తి ..కరోనా పేరుతో వసూళ్ళ దందా

వైసీపీ నేతల వల్లే కరోనా వ్యాప్తి ..కరోనా పేరుతో వసూళ్ళ దందా

స్థానిక ఎన్నికల్లో ఓట్ల కక్కుర్తితో వైసీపీ నేతలు గుంపులుగా తిరిగారని, ఇక కరోనా వ్యాప్తి బాగా జరుగుతుంది అని తెలిసినా సరే ఇప్పటికీ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నేతల వల్లే రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతమయిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో చందాలు వసూలు చేస్తున్నారని , ట్రస్ట్ ముసుగులో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇక నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ ముసుగులో వైసీపీ ఎమ్మెల్యేల వసూళ్ల దందాఅంతా ఇంతా కాదని చంద్రబాబు ఆరోపించారు.

తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనాలని చంద్రబాబు డిమాండ్

తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనాలని చంద్రబాబు డిమాండ్

ఇక వైసీపీ సర్కార్ అకాల వర్షాలతో నష్టపోతున్న రైతులకు బాసటగా నిలవాలని అన్నారు. తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రైతు భరోసా పథకం నుంచి విశాఖలోనే 32వేల మంది పేర్లను తీసేశారని, రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల పేర్లు తొలగించారని చంద్రబాబు ఆరోపించారు. తక్షణమే వారి పేర్లను రైతు భరోసా లో చేర్చాలని డిమాండ్ చేశారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం పని చెయ్యాలని కోరారు. ఇక ఈ విషయాలు అన్నీ ప్రభుత్వానికి తెలిసేలా , ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేలా 12 గంటల దీక్షలకు దిగాలని ఆయన టీడీపీ నేతలకు పిలుపునిచ్చారు.

English summary
Former CM Chandrababu Naidu spoke on the latest corona lockdown situation, as well as measures that should be taken in light of the growing corona cases. Addressing the video conference with the leaders of the TDP, Chandrababu suggested that the party leaders should now support public. The coronavirus has become an ATM for the YCP leaders, who are furious that the corona is involved in illegal charges. He alleged that Corona was so prevalent that YCP leaders were moving into a favored state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X