వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

no corona virus: గుంటూరులో లేని జాడ, సోషల్ మీడియాలో ప్రచారంపై ‘టీఎన్ఎం’ ఫ్యాక్ట్ చెక్..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ (కోవిడ్-19) చైనాలో మరణ మృదంగం మోగిస్తోంది. వైరస్‌తో ఇప్పటికే అక్కడ 2700కు పైగా మంది మృతిచెందారు. ఇతర దేశాల్లో కూడా వైరస్ క్రమంగా వ్యాపిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో వైరస్ వ్యాపించిందనే ప్రచారం జరుగుతోంది. 10 మందికి వైరస్ సోకిందని సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై 'ద న్యూస్ మినిట్' నిజా నిర్ధారణ చేసింది. ఏపీలో వైరస్ లేదని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని తేల్చింది.

అంతా ఫేక్..

అంతా ఫేక్..

ఏపీలోని గుంటూరులో కరోనా వైరస్ వ్యాపిస్తోందని సోషల్ మీడియాలో జోరుగా పోస్ట్ వైరలవుతోంది. దీంతో టీఎన్ఎం ప్రతినిధులు రంగంలోకి దిగారు. ఏం జరిగిందో తెలుసుకొనే ప్రయత్నం చేశారు. గుంటూరులో వైరస్ జాడ ఉందని.. 10 మందికి సోకిందని వీడియో పోస్ట్ అవుతోంది. ఇందులో నలుగురు చనిపోయారని కూడా ఉంది. కానీ దీనిని ఏపీ ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి. ఇప్పటివరకు కరోనా వైరస్‌కు సంబంధించి అనుమానిత ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఏపీ ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రజలు ఆందోళన చెందొద్దని భరోసానిచ్చింది.

మాస్క్ ధరించాలని..

మాస్క్ ధరించాలని..

కరోనా వైరస్ కాదు గుంటూరు జిల్లాలో వైరస్ ప్రబలినందున మాస్క్ ధరించాలని కోరుతున్నారు. దీంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని వీడియోలో కొందరు చెబుతున్నారు. అంతేకాదు మాంసాహారం కూడా తినొద్దని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఏపీలో చికెన్ రేట్లు దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే. దీనిని ఏపీ ప్రభుత్వంతోపాటు.. తెలంగాణ ప్రభుత్వం కూడా ఖండించింది. జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా నోట్ కూడా విడుదల చేసింది.

సేఫ్.. డొంట్ వరీ..

సేఫ్.. డొంట్ వరీ..

భారతదేశంలో వంట గరిష్ట ఉష్ణోగ్రతలో చేస్తామని జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ అధికారి డాకర్ట్ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. మాంసాహారాన్ని 100 డిగ్రీల టెంపరేచర్‌లో వండుతారని చెప్పారు. ఒకవేళ వైరస్ ఉన్న అది చనిపోతుందని చెప్పారు. అలాగే వంటలో వాడు పసుపు యాంటి బయోటిక్‌గా పనిచేస్తుందని స్పష్టంచేశారు. కారం, మసాలా వేయడంతో ఆ మాంసాహారానికి ఎలాంటి వైరస్ ఉండదని తేల్చిచెప్పారు. భారతీయులు చికెన్, కోడిగుడ్ల అత్యంత శుభత్రతో వండుతారని.. సోషల్ మీడియాలో వస్తోన్న అసత్య ప్రచారాన్ని విశ్వసించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Recommended Video

Coronavirus : COVID-2019 Outbreak | Situation Reports, Myth Busters | Oneindia Telugu
 ఏ మందు లేదు..

ఏ మందు లేదు..

మరోవైపు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆర్సెనికమ్ ఆల్బమ్ 30 అనే మందును కనుక్కొందని ప్రచారం జరుగుతోంది. కానీ దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొట్టిపారేసింది. కరోనా వైరస్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి మందు కనుగొనలేదని స్పస్టంచేసింది.

English summary
no corona virus: With the coronavirus resulting in over 2,600 deaths in China, several messages in Telugu have been doing the rounds on WhatsApp in telugu states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X