వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus:ఏపీలో 8వ పాజిటివ్ కరోనా కేసు నమోదు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రబలుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా లాక్ డౌన్ విధించింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతోంది. ఆస్పత్రి, మెడికల్ షాపులను మాత్రమే సాయంత్రం తర్వాత కూడా అనుమతి ఇస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులను కూడా మూసివేశారు. విమ్స్ ఆస్పత్రిలో 31 మంది క్వారంటైన్‌లో ఉన్నారని.. వారిని 14 రోజుల తర్వాత కరోనా నెగిటివ్ వస్తే ఇంటికి పంపిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.

Coronavirus Pandemic:Here are the daily live updates in Andhra Pradesh

Newest First Oldest First
4:07 PM, 25 Mar

రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా కందిపప్పు ఇస్తాం: మంత్రి కొడాలి నాని
2:28 PM, 25 Mar

ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలి: సీఎం జగన్
2:27 PM, 25 Mar

144 సెక్షన్ రోజంతా ఉంటుంది:నలుగురు కంటే ఎక్కువగా గుమికూడా ఉండరాదు
2:27 PM, 25 Mar

రైతు బజార్లను వికేంద్రీకరణ చేయాలని నిర్ణయం
2:26 PM, 25 Mar

సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్నీ, డీజీపీ గౌతం సవాంగ్, వైద్యాధికారులు ఇతర ఉన్నతాధికారులు
2:25 PM, 25 Mar

ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్షాసమావేశం
1:29 PM, 25 Mar

విదేశాల నుంచి వచ్చిన వారు 14రోజుల పాటు స్వీయనిర్బంధంలో ఉండాలని ప్రభుత్వం సూచన
1:12 PM, 25 Mar

హాస్పిటల్స్‌లో అడ్మిట్ అయినవారి సంఖ్య: 95
1:11 PM, 25 Mar

ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉన్నవారి సంఖ్య: 13290
1:10 PM, 25 Mar

28 రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచిన వారి సంఖ్య 2723: ప్రభుత్వం
1:09 PM, 25 Mar

విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య 14907: ఏపీ ప్రభుత్వం
12:56 PM, 25 Mar

కడప, విశాఖపట్నం, గుంటూరులో మూడు ల్యాబ్‌ల కోసం కావాల్సిన ఎక్విప్‌మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది: ప్రభుత్వం
12:20 PM, 25 Mar

హాస్పిటళ్లు, మెడికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్, ఔషధాల తయారీ యూనిట్లు పనిచేస్తాయి: ఏపీ ప్రభుత్వం
12:18 PM, 25 Mar

భారత ప్రభుత్వ కార్యాలయాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కారాయలయాలు, వాటి స్వయంప్రతిపత్తి సంస్థలు మూసివేస్తున్నాం: ఏపీ ప్రభుత్వం
12:16 PM, 25 Mar

కొతు COVID-19 పాజిటవ్ కేస్తలేమీ బయటపడలేదు: ఏపీ ప్రభుత్వం
11:12 AM, 25 Mar

కరోనా విపత్తు తొలగిపోయి, ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, ఇంటి నుంచి బయటకు రాకుండా ఈ పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను: ఏపీ సీఎం జగన్
11:09 AM, 25 Mar

కరోనా కంటికి చిక్కకుండా.. ఉగాది వేడుకలను ఎవరికి వారు, వారి గుమ్మం వరకే పరిమితం చేసి, సురక్షిత ఉగాదిని జరుపుకోండి: నారాలోకేష్ ట్వీట్
9:40 AM, 25 Mar

గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వ్యక్తి.. నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపిన వైద్య సిబ్బంది. నివేదిక కోసం ఎదురు చూపులు
9:39 AM, 25 Mar

గుంటూరులో కరోనావైరస్‌తో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి. అయితే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం
8:52 AM, 25 Mar

కరోనాపై వార్

సోషల్ డిస్టెన్సింగ్‌ను పాటిస్తోన్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఏర్పాటు చేసిన మార్కెట్‌లో దూరాన్ని పాటించేలా గిరిగీసిన అధికారులు.
8:15 AM, 25 Mar

కరోనాపై వార్

కరోనా వైరస్ నివారణ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించిన వైఎస్అర్సీపీ లోక్‌సభ సభ్యురాలు చింతా అనురాధ
8:07 AM, 25 Mar

కరోనాపై వార్

కరోనా వైరస్‌ నివారణ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలను విరాళం ఇచ్చిన నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు
7:26 AM, 25 Mar

కరోనాపై వార్

కరోనా నియంత్రణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజువారీ సమీక్షలు.క్యాంపు కార్యాలయానికే పరిమితం.
7:16 AM, 25 Mar

కరోనాపై వార్

ఇంజినీరింగ్ కళాశాలలు, గురుకుల పాఠశాలల్లో ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోన్న ఏపీ ప్రభుత్వం
6:52 AM, 25 Mar

కరోనాపై వార్

ప్రతి నియోజకవర్గంలో 100 పడకలు, ప్రతి జిల్లా కేంద్రంలో 200 పడకల ఐసొలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
6:38 AM, 25 Mar

కరోనాపై వార్

కరోనా వైరస్ నియంత్రణ చర్యల కోసం ప్రధానమంత్రి సహాయ నిధి, ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం వేర్వేరుగా రెండు నెలల వేతనాన్ని అందించనున్న వైఎస్ఆర్సీపీ ఎంపీలు
6:37 AM, 25 Mar

కరోనాపై వార్

ప్రాణాంతక కరోనా వైరస్‌ను నియంత్రించడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుల విరాళం
6:37 AM, 25 Mar

కరోనాపై వార్

ప్రాణాంతక కరోనా వైరస్‌ను నియంత్రించడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుల విరాళం
9:03 PM, 24 Mar

ఏపీలో 8వ కరోనావైరస్ పాజిటివ్ కేసు
8:56 PM, 24 Mar

కోవిడ్-19పై అధికారులతో సీఎం జగన్ సమీక్ష
READ MORE

English summary
31 members treatment going on vims, they are quarantine andhra pradesh minister avanthi srinivas said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X