వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: ఏపీలో రెండో కరోనా మరణం..?, అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి మృతి, ధృవీకరించని అధికారులు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ సోకి ఆంధ్రప్రదేశ్‌లో మరొకరు చనిపోయినట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లా హిందుపురానికి చెందిన ఒకరు మృతిచెందారని ప్రచారం జరుగుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒకరు.. శనివారం ఉదయం చనిపోయాడని స్థానికులు అంటున్నారు. కానీ దీనిని ఏపీ ప్రభుత్వ అధికారులు ధృవీకరించాల్సి ఉంది. ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 164కి చేరుకున్నాయి. ఆరోగ్యం బాగావడంతో నలుగురిని వైద్యులు డిశ్చార్జి చేశారు.

విజయవాడకు చెందిన వ్యక్తి ఇటీవల కరోనా పాజిటివ్‌ సోకి సోమవారం చనిపోయారు. అతను కరోనాతోనే చనిపోయారని శుక్రవారం ఏపీ ప్రభుత్వం ధృవీకరించింది. మార్చి 30వ తేదీన ఉదయం 11.30 గంటలకు పరీక్ష కోసం ఆస్పత్రికి వచ్చాడని.. గంటలోనే చనిపోయాడని వైద్యులు తెలిపారు. అతనికి హైపర్ టెన్షన్, షుగర్ కూడా ఉంది అని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

Coronavirus: second death in andhra pradesh

Recommended Video

PM Modi Step Behind Video Conferencing With Sports Persons

అతని కుమారుడు ఇటీవల ఢిల్లీలో జరిగిన మత సభలకు హాజరయ్యారని అధికారులు పేర్కొన్నారు. మార్చి 17వ తేదీన ఇంటికి వచ్చాడని.. మార్చి 30వ తేదీన అతనికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. అదేరోజు తన తండ్రిని ఆస్పత్రికి తీసుకురాగా.. గంట వ్యవధిలో మృతిచెందారు. అయితే అతని తండ్రి చనిపోయిన తర్వాత కరోనా వైరస్ సోకిందని గుర్తించారు. అతనికి ఇతర సమస్యలు ఉండటంతో.. వైరస్ సోకిందని నిర్ధారించేందుకు సమయం పట్టిందని అధికారులు తెలిపారు. వీరిద్దరూ 29 మందిని కాంటాక్ట్ అయ్యారని.. వారిని క్వారంటైన్‌కు పంపించామని చెప్పారు. విజయవాడలో తొలి కరోనా మృతి నమోదైన సంగతి తెలిసిందే.

English summary
second Coronavirus death in andhra pradesh anantapur district..?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X