వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడ్‌న్యూస్: కరోనా టెస్ట్ ధర భారీగా తగ్గింపు.. ప్రభుత్వం పంపిన శాంపిల్ కూడా..

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రికవరీ రేటు కూడా బాగుండటంతో వైద్యారోగ్య శాఖ ఊపిరి పీల్చుకుంది. అయితే కరోనా వైరస్ టెస్ట్ ధరను ప్రభుత్వం మరోసారి తగ్గించింది. తొలుత రూ.2200 ఆపై ఉన్న ధరను తక్కువ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి తగ్గించడంతో.. అనుమానం ఉన్నవారు నేరుగా ల్యాబ్ వెళ్లి టెస్ట్ చేసే అవకాశం ఉంది.

Recommended Video

Coronavirus Test Rate Decreased In Andhra Pradesh | Oneindia Telugu
రూ.1900 నుంచి రూ.1000

రూ.1900 నుంచి రూ.1000

ఇప్పటివరకు కరోనా వైరస్ నిర్దారణ కోసం రూ.1900 తీసుకునేవారు. ఇప్పుడు దానిని రూ.900 తగ్గించారు. అంటే అనుమానం ఉన్నవారు ల్యాబ్ వెళ్లి రూ.1000 చెల్లిస్తే చాలు రిపోర్ట్‌ను చేతిలో పెడతారు. అలాగే ప్రభుత్వం పంపించిన శాంపిల్ ధర కూడా భారీగా తగ్గించారు. ఇప్పటివరకు రూ.1600 ఉండగా.. దానిని సగం తగ్గించేశారు. అంటే రూ.800 కడితే చాలు రిపోర్ట్ వస్తోంది.

రెండోసారి టెస్ట్ చేస్తే రూ.800

రెండోసారి టెస్ట్ చేస్తే రూ.800

పూల్ శాంపిల్ పరీక్ష చేసే సమయంలో పాజిటివ్ వస్తే పూల్‌లోని రెండోసారి పరీక్ష చేయాల్సి ఉంటుంది. అప్పుడు రూ.800 ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ధరలు ఐసీఎంఆర్ అనుమతిచ్చిన ల్యాబ్స్‌కే వర్తిస్తాయని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం ప్రైవేట్ ల్యాబ్స్ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

ధరల వివరాలు

ధరల వివరాలు

టెస్టులకు సంబంధించిన ధరలను ల్యాబ్‌లు బయట పెట్టాలని స్పష్టంచేసింది. దీని పర్యవేక్షణ బాధ్యతలను ఆరోగ్య శ్రీ సీఈవోకే ప్రభుత్వం అప్పగించింది. కరోనా వైరస్ పరీక్ష నిర్దారణ ధరను తగ్గించడం ఊరట కలిగించే అంశం. దీంతో మధ్యతరగతి వారు కూడా పక్కా రిపోర్ట్ కోసం ల్యాబ్‌కెళ్లి టెస్ట్ చేయించుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చేస్తోన్న స్వాబ్ టెస్ట్ ద్వారా కొన్ని సందర్భాల్లో కచ్చితంగా రిపోర్ట్ వచ్చే పరిస్థితి లేదు. దీంతో ల్యాబ్‌లలో చేయించుకోవడం కచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. దీంతోపాటు వైరస్ మరింత మందికి సోకే అవకాశం ఉండకపోవచ్చు.

English summary
coronavirus test rate are decrease in andhra pradesh health officials said in statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X