వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: ఏపీలో మూడో కరోనా పాజిటివ్, మక్కా నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్, భక్తుడికి నెగిటివ్..

|
Google Oneindia TeluguNews

కరోనా.. కరోనా.. కరోనా.. వైరస్ విస్తరించడంతో పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మూడో కరోనా పాజిటివ్ కేసు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖపట్టణానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో రాష్ట్రంలో వైరస్ సోకిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది.

విశాఖ వృద్దుడికి..

విశాఖ వృద్దుడికి..

విశాఖపట్టణానికి చెందిన 65 ఏళ్ల వ్యక్తి ఇటీవల మక్కా వెళ్లి వచ్చినట్టు తెలుస్తోంది. అతనికి వైరస్ సోకిందని విశాఖ జిల్లా వైద్యాధికారి ధ్రువీకరించారు. ప్రస్తుతం అతనిని చెస్ట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏపీలో ఇదివరకు నెల్లూరులో ఒకటి, ప్రకాశం జిల్లాలో మరొ కరోనా పాజిటివ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 119 శాంపిళ్లు పరీక్షించగా ముగ్గురికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. 104 శాంపిళ్లు నెగటివ్‌గా తేలాయి. మరో 12 శాంపిళ్ల ఫలితాలు రావాల్సి ఉంది.

నెల్లూరులో ఫస్ట్ కేసు

నెల్లూరులో ఫస్ట్ కేసు

రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. నెల్లూరు జిల్లాక చెందిన యువకుడు ఇటీవల ఇటీల నుంచి వచ్చారు. కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో అతనికి పరీక్షలు నిర్వహించగా.. వైరస్ సోకిందని నిర్ధారణ అయ్యింది. ప్రకాశం జిల్లాలో రెండో కరోనా పాజిటివ్ కేసు రికార్డైందని అధికారులు తెలిపారు. ఈ నెల 15వ తేదీన లండన్ నుంచి ఒంగోలు చేరిన వ్యక్తి అస్వస్థతతో బాధపడ్డారు. కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. విశాఖ వృద్ధుడితో ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు మూడుకి చేరుకున్నారు.

Recommended Video

Karthik Aryan Spreading Awareness On Covid 19
తిరుమల భక్తుడికి నెగిటివ్..

తిరుమల భక్తుడికి నెగిటివ్..

తిరుమలలో అస్వస్థతకు గురైన భక్తుడు దామోదరం కరోనా నెగిటివ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తిరుమల సహా రాష్ట్రంలోని అన్ని ఆలయాలను మూసివేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. పొరుగురాష్ట్రం తెలంగాణలో 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో విమానాల నుంచి వచ్చిన వారు ఆరుగురు కాగా.. రైళ్లలో వచ్చినవారు 10 మందిని గుర్తించారు. కరీంనగర్‌కు ఇండోనేషియా నుంచి వచ్చిన వారు కూడా రామగుండం నుంచి కరీంనగర్‌కు కారులో వచ్చినట్టు అధికారులు గుర్తించారు.

English summary
Third coronavirus positive case find out in andhra pradesh vizag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X