వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు రాజధానులకు బ్రేక్: సెలెక్ట్ కమిటీకి వికేంద్రీకరణ బిల్లులు: మండలి ఛైర్మన్ సంచలన నిర్ణయం..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులు..సీఆర్డీఏ చట్టం రద్దు నిర్ణయాలకు బ్రేక్ పడింది. మండలిలో ఈ బిల్లులు ప్రతిపాదించే సమయం నుండి ఉత్కంఠ చోటు చేసుకుంది. అనేక కీలక పరిణామాలు..అధికార ప్రతిపక్షాల ఎత్తులు పై ఎత్తులతో మొత్తంగా చివరకు టీడీపీ డిమాండ్ మేరకు శాసన సభ ఆమోదించిన మూడు రాధానులు..సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ సభలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య కీలక నిర్ణయం ప్రకటించారు. నిబంధఏనల ప్రకారం ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకోకూడదని చెబుతూనే..తన విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ఛైర్మన్ ప్రకటించారు. దీంతో..టీడీపీ సంతోషం వ్యక్తం చేయగా..ప్రభుత్వంలోని మంత్రులు బ్లాక్ డే నిర్ణయంగా నిరసనగా వ్యక్తం చేసారు.

సెలెక్ట్ కమిటీకి రెండు బిల్లులు..

సెలెక్ట్ కమిటీకి రెండు బిల్లులు..

పీ రాజధాని వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని శానసమండలి నిర్ణయిచింది. అత్యంత ఉత్కంఠ మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ తొలి నుండి రాజధాని మార్పును వ్యతిరేకి స్తోంది. ఇదే సమంయలో మండలిలో తమకున్ మెజార్టీని..సభలోని నిబంధనలతో వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ బిల్లు సెలెక్ట్ కమిటీ బాట పట్టేలా మార్గం సుగమం చేశారు. బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లకుండా అడ్డుకునేందుకు వైసీపీ మంత్రులు, సభ్యులు అన్ని ప్రయత్నాలు చేశారు. ఒక దశలో రెండు పార్టీల సభ్యుల మధ్య తోపులాట వరకు వెళ్లింది. శాసనమండలి ఛైర్మన్ పోడియంను చుట్టి ముట్టారు. ఎట్టకేలకు ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లు విషయంలో టీడీపీ పైచేయి సాధించింది.

గ్యాలరీలోనే సాయిరెడ్డి..చంద్రబాబు..

గ్యాలరీలోనే సాయిరెడ్డి..చంద్రబాబు..

రాజధాని వికేంద్రీకరణ బిల్లు విషయంలో వైసీపీ వ్యూహాలను అడ్డుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గంటన్నర పాటు శాసనమండలి గ్యాలరీలోనే ఉన్నారు. శాసనమండలి ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయడంతో చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు. ఛాంబర్‌కు వెళ్దామని టీడీపీ ఎమ్మెల్యేలు సూచించినా చంద్రబాబు అక్కడికి వెళ్లేది లేదంటూ చివరివరకూ మండలిలోనే ఉంటానని అక్కడే కూర్చున్నారు. మండలికి బిల్లు చేరిన సమయం నుండి చివరి నిమిషం వరకు పర్యవసానాలను గమనించేందుకు వైసీపీ ఎంపీ సాయిరెడ్డి..టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి సైతం గ్యాలరీలోనే కూర్చుకున్నారు. సభ లో ఛైర్మన్ తుది నిర్ణయం ప్రకటించే వరకూ వారు అక్కడే ఉన్నారు.

మూడు నెలల పాటు బ్రేక్...

మూడు నెలల పాటు బ్రేక్...


ఇప్పుడు మూడు రాజధానులు..సీఆర్డీఏ రద్దు బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపటం ద్వారా ప్రభుత్వ రాజధానుల నిర్ణయం మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. దాదాపు మూడు నెలల పాటుగా నిర్ణయం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో రైతులు..రాజకీయ పార్టీలు న్యాయ పోరాటానికి సైతం సిద్దం అవుతున్నాయి. శాసనసభలో సులువుగా బిల్లులు నెగ్గించుకున్న వైసీపీ ప్రభుత్వానికి మండలిలో మాత్రం షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. అయితే, దీని కారణంగా రాజధాని నిర్ణయం అమలు ఆలస్యం అవుతుంది కానీ..ఆపలేరని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు మండలి తీసుకున్న నిర్ణయం రాజకీయంగా సంచలనంగా మారింది.

English summary
AP Legislatvie Council Chairman sesnatational decision on Three capitals bills. Chairman decided to sent both bills to Selecte committee as per TDP demand. Govt protest Chairman decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X