అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కౌంట్‌డౌన్ స్టార్ : అమ‌రావ‌తిలో అగ్రనేత‌లు : జ‌గ‌న్‌తో పాటు పీకే.. వారి పైనే స్పెష‌ల్ ఫోక‌స్‌..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ap Election Result 2019 : కౌంట్‌డౌన్ స్టాట్... అమ‌రావ‌తిలోనే ముగ్గురు అగ్రనేత‌లు...!! || Oneindia

ఏపీలో టీడీపీ ప్ర‌భుత్వ‌మే మ‌రో సారి కొన‌సాగుతుందా. వైసీపీ అధికారంలోకి వ‌స్తుందా. ప‌వ‌న్ క‌ళ్యాన్ ఆశ‌లు నెర‌వేరుతాయా. ఏం జ‌రగ‌బోతోంది. కౌంట్‌డౌన్ మొద‌లైంది. అభ్య‌ర్దుల్లో టెన్ష‌న్ పెరిగిపోతోంది. మ‌రి కొద్ది గంట‌ల్లో ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ప్రారంభం అవుతున్న వేల‌..ఏపీలోని మూడు ప్ర‌ధాన పార్టీల అధినేత‌లు అమ‌రావ‌తికి త‌ర‌లి వ‌స్తున్నారు. అయితే, ఎగ్జిట్ పోల్స్ త‌రువాత జ‌గ‌న్ సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్‌గా మారారు. పోలింగ్ నాటి రాత్రి త‌మ‌కు లాండ్ స్లైడ్ విక్ట‌రీ ఖాయ‌మ‌ని చెప్పిన జ‌గ‌న్..ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌లా స్పందించ‌లేదు. అమ‌రావ‌తితో ఏం జ‌రుగుతోంది..

కౌంటింగ్ త‌ర్వాతా రీపోలింగ్ :ఫ‌లితం తేల‌క‌పోతే ఈసీదే విచ‌క్ష‌ణాధికారం: 27 అర్ద‌రాత్రి వ‌ర‌కు కోడ్‌..కౌంటింగ్ త‌ర్వాతా రీపోలింగ్ :ఫ‌లితం తేల‌క‌పోతే ఈసీదే విచ‌క్ష‌ణాధికారం: 27 అర్ద‌రాత్రి వ‌ర‌కు కోడ్‌..

జ‌గ‌న్ పైనే స్పెష‌ల్ ఫోక‌స్..

జ‌గ‌న్ పైనే స్పెష‌ల్ ఫోక‌స్..

ఏపీలో లాండ్ స్లైడ్ విక్ట‌రీ సాధిస్తామ‌ని పోలింగ్ నాటి రాత్రి చెప్పిన జ‌గ‌న్ చాలా ప్ర‌శాంతంగా ఉన్నారు. జాతీయ స్థాయిలో..ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తున్నారు. టీడీపీ నేత‌ల విమ‌ర్శ‌ల మీద ఎక్క‌డా స్పందించ‌టం లేదు. జాతీయ స్థాయిలో మ‌ద్ద‌తు కోసం సంప్ర‌దింపులు జ‌రుగుతున్నా..ఆచితూచి స్పందించాల‌ని అందు కోసం ఫ‌లితాలు పూర్తిగా వెల్ల‌డ‌య్యే వ‌ర‌కూ వేచి చూడాల‌ని డిసైడ్ అయ్యారు. హైద‌రాబాద్‌లోని లోట‌స్‌పాండ్ నుండి పూర్తిగా వైసీపీ కార్యాల‌యం అమ‌రావ‌తికి మారింది. ఈ సాయంత్రానికి జ‌గ‌న్ అమ‌రావ‌తికి చేరుకుంటున్నారు. ఆయ‌న‌తో పాటుగా వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ సైతం వ‌స్తున్నారు. వీరు ఫ‌లితాల స‌మ‌యంలో పూర్తిగా పార్టీ కార్యాల‌యంలో అందుబాటులో ఉంటారు. ఎగ్జిట్ పోల్స్ త‌రువాత వైసీపీలో మ‌రింత ధీమా పెరిగింది. ఫ‌లితాలు త‌మ‌కు అనుకూలంగా ఉంటాయ‌ని బ‌ల‌మైన న‌మ్మ‌కంతో ఉన్న జ‌గ‌న్‌..ఫ‌లితాలు వెల్ల‌డైన వెంట‌నే అనుస‌రించాల్సిన కార్యాచ‌ర‌ణ‌..వ్యూహాల‌ను ఇప్ప‌టికే సిద్దం చేసుకున్నారు.

మ‌ధ్నాహ్నానికి చంద్ర‌బాబు..

మ‌ధ్నాహ్నానికి చంద్ర‌బాబు..

ఏపీలో ఎన్నిక‌ల కంటే జాతీయ స్థాయి రాజ‌కీయాలు..వీవీప్యాట్స్ లెక్కింపు పైనే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎక్కువ‌గా దృష్టి సారించారు. ఢిల్లీ నుండి బెంగుళూరు వెళ్లిన చంద్ర‌బాబు అక్క‌డి నుండి కుప్పం వెళ్లారు. అక్క‌డ స్థానికంగా గంగాన‌మ్మ జాత‌ర‌లో పాల్గొని మ‌ధ్నాహ్నానికి అమ‌రావ‌తి చేరుకుంటారు. ఆ వెంట‌నే పార్టీ నేత‌ల‌తో టెలి కాన్ఫిరెన్స్ ఏర్పాటు చేసారు. కౌంటింగ్ స‌మ‌యంలో వ్య‌వ‌హరించాల్సిన తీరు పైన సూచ‌న‌లు చేయ‌నున్నారు. ఇక‌, ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యే స‌మ‌యంలో పూర్తిగా క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి అందుబాటులో ఉండ‌నున్నారు. వంద‌కు వెయ్యి శాతం తాము అధికారంలోకి రావ‌టం ఖాయ‌మ‌ని విశ్వాసంతో ఉన్న చంద్ర‌బాబు ఏపీ ఫ‌లితాల అంశాన్ని ప‌క్క‌న పెట్టేసి పూర్తిగా జాతీయ రాజ‌కీయాల్లో మునిగిపోయారు. ఇక‌, ఇప్పుడు ఏపీలో ఫ‌లితాలు..వాటికి అనుగుణంగా వ్య‌వ‌హ‌రించాల్సిన తీరు పైన ఈ రోజు మొత్తం సీఎం దృష్టి పెట్ట‌నున్నారు.

జ‌న‌సేనాని సైతం ఇక్క‌డే..

జ‌న‌సేనాని సైతం ఇక్క‌డే..

ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత పార్టీ నేత‌ల‌తో సమీక్షించిన ప‌వ‌న్.. త‌మ‌కు ఎన్ని సీట్లు..ఓట్లు వ‌చ్చాయ‌నే దాని కంటే.. మార్పుకు శ్రీకారం చుట్టామ‌ని చెప్పుకొచ్చారు. తమ బ‌లం ఏంటో ఎన్నిక‌ల్లో చాటుతామంటూ చెప్పుకొచ్చిన ప‌వ‌న్ ఏ మేర ప్ర‌భావం చూపార‌నేది స‌ర్వ‌త్రా ఆస‌క్తి క‌రంగా మారింది. ఎన్నిక‌ల ఫ‌లితాల వేళ ప‌వ‌న్ పార్టీ నేత‌ల‌తో క‌లిసి పార్టీ కార్యాల‌యంలో అందుబాటులో ఉంటున్నారు. ఈ ఫ‌లితాల్లో జ‌న‌సేనాని..ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్ట‌నున్నారని ల‌గ‌డ‌పాటి అంచ‌నా వేసారు. అభిమానులు సైతం త‌మ ప‌వ‌ర్ స్టార్ అసెంబ్లీలో కీల‌కం అవుతార‌ని ఆశిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఈ నేత‌ల‌కు భ‌ద్ర‌తా ప‌రంగానూ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసారు. మ‌రి..ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యే కొద్దీ ఏ కార్యాల‌యంలో సంద‌డి ఉంటుందో..ఎక్క‌డ నైరాశ్యం ఉంటుందో చూడాల్సిందే..

English summary
Count down start. AP elections results in hours. All party heads arriving Amaravati to watch results. But, special focus on Jagan, On 23rd politically important for three parties. People also waiting for this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X