వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రయాన్‌ 2కు సర్వం సిద్ధం.. సాయంత్రం ప్రారంభంకానున్న కౌంట్ డౌన్

|
Google Oneindia TeluguNews

సాంకేతిక కారణాలతో వాయిదాపడ్డ చంద్రయాన్ 2 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43గంటలకు చంద్రయాన్ 2 ప్రయోగం జరగనుంది.జీఎస్ఎల్వీ మార్క్ 2 ఎం 1 వాహక నౌకను ప్రయోగించేందుకు సైంటిస్టులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. క్రయోజనిక్ దశలో తలెత్తిన లోపం కారణంగా ఈ నెల 15న ప్రయోగానికి 56 నిమిషాలముందుకు చంద్రయాన్ 2ను వాయిదా వేశారు. ఈ లోపాన్ని సవరించి రాకెట్‌ను మళ్లీ సిద్ధం చేశారు.

సాయంత్రం ప్రారంభం కానున్న కౌంట్ డౌన్

సాయంత్రం ప్రారంభం కానున్న కౌంట్ డౌన్

లాంచ్ ఆథరైజేషన్ బోర్డ్ ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆదివారం కౌంట్ డౌన్ ప్రారంభంకానుంది. సాయంత్రం 6.43గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 20గంటల పాటు నిరంతరాయంగా కౌంట్ డౌన్ కొనసాగనుంది. అనంతరం జీఎస్ఎల్వీ మార్క్ 3 ఎం 1 రాకెట్ 3.8 టన్నుల బరుు గల చంద్రయాన్ 2ను నింగిలోకి తీసుకెళ్లనుంది.

ప్రయోగం వీక్షించేందుకు ఏర్పాట్లు

ప్రయోగం వీక్షించేందుకు ఏర్పాట్లు

ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు షార్‌లో ఏర్పాట్లు చేశారు. శబరి గిరిజన కాలనీలో గ్యాలరీఏర్పాటు చేశారు. దాదాపు 5వేలమంది కూర్చుని లాంఛింగ్‌ను చూసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతిఒక్కరికీ స్పష్టంగా కనిపించేలా షార్ గ్యాలరీని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

పాత వారికి మళ్లీ అవకాశం

పాత వారికి మళ్లీ అవకాశం

ఈనెల 15న ప్రయోగాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు. అర్థరాత్రి అని కూడా లెక్కచేయకుండా ఎదురుచూశారు. అయితే చివరి నిమిషంలో ప్రయోగం వాదాయిపడటంతో అందరూ నిరాశకు గురయ్యారు.వారిని సంతృప్తి పరిచేందుకు గతంలో ఆన్‌లైన్‌లో నమోదుచేసుకున్నప్పుడు ఇచ్చిన సీరియల్ నెంబర్‌ ఎంటర్ చేసి కొత్త పాస్ తీసుకునే అవకాశం కల్పించారు.

English summary
The 20-hour countdown for the July 22 lift-off of India's heavy rocket nicknamed 'Bahubali' carrying the Chandrayaan-2 spacecraft to begin today, Indian space agency officials said.The countdown will begin at 6.53 pm on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X