వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ శాసనమండలి రద్దుకు కౌంట్ డౌన్ .. సోమవారం చర్చ ఆంతర్యం అదేనా !!

|
Google Oneindia TeluguNews

ఏపీ శాసనసభలో శాసన మండలి రద్దు గురించి జరుగుతున్న చర్చతో మండలి రద్దుకు కౌంట్‌డౌన్ మొదలయినట్లే కనిపిస్తుంది . నిన్న ఏపీ శాసనమండలిలో జరిగిన పరిణామాలతో సీఎం జగన్ మస్తాపానికి గురయ్యానని చెప్పారు. ఇక వైసీపీ మంత్రులు శాసనమండలి రద్దు చెయ్యాలని ప్రతిపాదనలు చేస్తున్నారు. నిన్న మండలిలో టీడీపీ అధికార వికేంద్రీకరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపటంలో సక్సెస్ కావటంతో వైసీపీ నిప్పులు చెరుగుతుంది.

సీఎం జగన్ వ్యాఖ్యలు మండలి రద్దుకు సంకేతాలు

సీఎం జగన్ వ్యాఖ్యలు మండలి రద్దుకు సంకేతాలు

ఇక తాజా పరిణామాల నేపధ్యంలో పెద్దల సభను రద్దు చేసేందుకే సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు .నేడు శాసనసభలో జరిగిన చర్చలో మండలి రద్దు చెయ్యాలన్న ధోరణిలో ఆయన మాట్లాడారు. చట్టం, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ మండలి మనకు అవసరమా? అని అసెంబ్లీలో అభిప్రాయపడ్డారు జగన్. ప్రజలకు మేలు చేసే విషయంలో ప్రభుత్వానికి సలహలు సూచనలు ఇవ్వాల్సిన మండలి అందుకు విరుద్ధంగా , చట్టాలకు నిరోధంగా మారిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు .

పేదరాష్ట్రానికి మండలి అవసరం లేదంటున్న సీఎం జగన్

పేదరాష్ట్రానికి మండలి అవసరం లేదంటున్న సీఎం జగన్


బుధవారం మండలిలో జరిగిన పరిణామాలను జగన్ తీవ్రంగా పరిగణిస్తున్న జగన్ దేశంలో కేవలం 6 రాష్ట్రాల్లోనే మండళ్లు ఉన్నాయని రోజుకు కోటి రూపాయలు ఖర్చయ్యే మండలి మనలాంటి పేద రాష్ట్రానికి అవసరమా? అని పేర్కొనటం మండలి రద్దుకు ముహూర్తం పెట్టినట్టే అన్న భావన కలుగుతుంది . చాలా మంది విద్యావేత్తలు శాసనసభలో ఉండగా ఇంకా మండలి అవసరం ఏముందని ప్రశ్నించిన జగన్ దీనిపై అందరం తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు .

సోమవారం మండలి పై చర్చ .. రద్దుకు ఓటింగ్

సోమవారం మండలి పై చర్చ .. రద్దుకు ఓటింగ్


ఈ క్రమంలో సోమవారం పూర్తిస్థాయిలో మండలి అంశంపై చర్చ జరపాలని నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మండలి రద్దుపై ఓటింగ్ నిర్వహించే అవకాశముందని తెలుస్తుంది .ఇక ఒకపక్క టీడీపీ నేతలు, ఎమ్మెల్సీలు మడలి రద్దు సాధ్యం కాదని చెప్తున్న నేపధ్యంలో మండలి రద్దు దిశగా నిర్ణయం తీసుకుని అడుగులు వేస్తున్న సీఎం జగన్ మండలి రద్దు చేస్తారా ? లేకా మరోమారు ఈ విషయంలో కూడా దెబ్బ తింటారా ? అన్నది వేచి చూడాలి .

English summary
The debate over the repeal of the Legislative Council in the AP Legislature appears to be a countdown to the dissolution of the Council. The CM Jagan said that it was really hurting him yesterday's council decision. So, YCP Ministers are proposing to abolish the Legislative Council. After that, it is likely that the council will vote on dissolution on monday after discussion on council .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X