వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ద్వివేదీ ఓటు వేసారు : చ‌ంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్‌: సాక్ష్యాధారాలు విడుద‌ల ..!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌కు ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్ట‌త ఇచ్చింది. రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధి కారి ఓటు వేయ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డితే మిగిలిన సామాన్యుల విష‌యం ఏంటని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. దీనికి ఎన్నిక‌ల సంఘం స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేసారు. దీనికి ప్ర‌తిగా ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి కార్యాలయం స్పందించింది. సీఈఓ ఓటు వేసారంటూ ఆధారాల‌ను విడుద‌ల చేసింది.

సీఈవోనే ఓటు వేయ‌లేక పోతే..
టిడిపి అధినేత చంద్రబాబు మీడియా స‌మావేశంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో ఎన్నిక‌ల సంఘం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు. ఇవియంలు ప‌ని చేయ‌క పోతే వాటిని స‌కాలంలో మార్చ‌టం లో విప‌లం అయ్యార‌ని..ఎంతో మంది ప్ర‌జ‌లు అర్ద‌రాత్రి దాకా క్యూ లో ఉండి ఓట్లు వేయాల్సి వ‌చ్చింద‌ని చెప్పుకొచ్చా రు. ఇదే స‌మ‌యంలో రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి పైనా విమ‌ర్శ‌లు చేసారు. సీఈవో ద్వివేదీ ఓటు వేయ టానికి వెళ్లి వెన‌క్కు వ‌చ్చార‌ని..ఆయ‌నే ఓటు వేయ‌లేక పోతే మిగిలిన సాధారణ ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏంట‌ని చంద్ర‌బాబు నిల‌దీసారు. అధికారుల బ‌దిలీ విష‌యంలోనూ ద్వివేదీ తీరును ఆయ‌న త‌ప్పు బ‌ట్టారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యాల‌ను తాను అమ‌లు చేస్తున్నాన‌ని ద్వివేదీ చెబుతున్నార‌ని..అంటే ఆయ‌న‌కు బాధ్య‌త‌..విలువ లేదా అని ప్ర‌శ్నించారు. అటువంటి ప‌రిస్థితుల్లో ఆ సీటు చేయ‌లేన‌ని చెప్పి ప‌క్క‌కు త‌ప్పుకోవ‌చ్చంటూ పేర్కొన్నారు.

counter to Babu comments..Dwivedi cast his vote..released evidence

సీఈవో కార్యాల‌య స‌మాధానం ఇదే..
ఇక‌, రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదీ ఓటు వేయ‌లేదంటూ టిడిపి అధినేత చంద్ర‌బా బు ఆరోపించ‌టం..దీని పై పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయ‌టం తో దీని పై ద్వివేదీ కార్యాల‌యం ఓ వివ‌ర‌ణ ఇచ్చింది. సీఈవో ఓటు వేయ‌లేదంటూ జరుగుతున్న ప్ర‌చారం లో వాస్త‌వం లేద‌ని..ద్వివేదీ ఓటు హ‌క్కు వినియోగించుకున్నార‌ని స్ప‌ష్టం చేసారు. 11వ తేదీ సాయంత్రి 4 గంట‌ల‌కు ఓటు వేసార‌ని తెలిపారు. దీని కి సంబంధించి ద్వివేదీ ఓటు వేసిన ఫొటోల‌తో పాటుగా వీడియోల‌ను విడుద‌ల చేసింది. ఇవియం ల స‌మ‌స్య కార‌ణంగా ఆయ‌న కూడా ఓటు వేయ‌లేదంటూ జ‌రిగిన ప్ర‌చారాన‌ని ఖండించారు. ఇప్పుడు ఈ ఖండ‌న‌..ఆధారాల పై టిడిపి నేత‌లు ఏ ర‌కంగా స్పందిస్తారో చూడాలి.

English summary
AP Eelction CEO office given clarity that Dwivedi cast his vote. Chandra Babu in media conference said that CEO did not cast his vote due to EVM's problem. For counter this CEO office released Video as evidence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X