వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైవ్: వెలిగిన 'చంద్రులు': జగన్ కొంతే, చిరు, కిరణ్ జీరో

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన శాసనసభ, లోకసభ ఎన్నికల్లో ఇద్దరు చంద్రులు ప్రకాశించారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సాధించింది. ఆధిక్యత స్వల్పంగానే ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎటువంటి ఆటంకం ఉండదు. తెలంగాణలో తెరాసను నువ్వా నేనా అన్నట్లు ఢీకొడుతుందని భావించిన కాంగ్రెసు పార్టీ పెద్దగా ఫలితాలు సాధించలేకపోయింది. చివరి ఫలితాలు వచ్చేసరికి 20 లేదా 21 అసెంబ్లీ స్థానాలు సాధించే అవకాశం ఉంది. లోకసభ స్తానాల్లో మాత్రం తిరుగులేని ఆధిక్యత సాధించింది. తుడిచిపెట్టుకుపోతుందని భావించిన తెలుగుదేశం పార్టీ సత్తా చాటుకుంది. బిజెపి, టిడిపి కూటమి కాంగ్రెసుకు ధీటుగా ఫలితాలు సాధించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏ మాత్రం ఉనికిని చాటుకోలేకపోయింది. మూడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నట్లు సమాచారం అందుతోంది.

తెలంగాణలో తెరాస 63 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. 119 స్థానాలు తెలంగాణలో ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కనీస మెజారిటీ 60 స్థానాలు. తెరాస అదనంగా మూడు స్థానాలు గెలుచుకుంది. టిడిపి 15 స్థానాలను, దాని మిత్రపక్షం బిజెపి ఐదు స్థానాలను గెలుచుకున్నాయి. మజ్లీస్ ఏడు స్థానాలను గెలుచుకుంది. ఈ వార్త రాసే సమయానికి కాంగ్రెసు 20 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని, ఒక్క స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. పార్లమెంటు స్థానాల్లో పదింటిని తెరాస గెలుచుకుని, ఒక్కదాంట్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెసుకు రెండు స్థానాలు, బిజెపికి ఒక్క స్థానం, మజ్లీస్‌కు ఒక్క స్థానం లభించాయి. మల్కాజిగిరి లోకసభ స్థానంలో టిడిపి ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఇదిలావుంటే, సీమాంధ్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన తిరుగులేని మెజారిటీని తెలుగుదేశం పార్టీ సాధించింది. వందకు పైగా స్థానాలను గెలుచుకుంది. లోకసభ స్థానాల్లోనూ టిడిపి ఆధిక్యతను ప్రదర్శించింది. మోడీ హవా టిడిపికి కలిసి వచ్చినట్లే ఉంది. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ టిడిపి - బిజెపి కూటమికి తగిన పోటీ ఇవ్వలేకపోయింది. ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధపడింది. ఈ విషయాన్ని వైయస్ జగన్ చెప్పారు. కాంగ్రెసు పార్టీ ఉనికిని కూడా చాటులేకపోయింది. మెగాస్టార్ చిరంజీవి ప్రచార బాధ్యతలు భుజాన వేసుకున్నా ఫలితం కనిపించలేదు. పిసిిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సహా పలువురు మాజీ మంత్రులు ఓటమి పాలయ్యారు. జై సమైక్యాంధ్ర పార్టీ నేత కిరణ్ కుమార్ రెడ్డికి కంఠశోషే మిగిలింది. పీలేరు శాసనసభ నియోజకవర్గంలో ఆయన సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి కూడా విజయం సాధించలేకపోయారు.

ఈ వార్త రాసే సమయానికి సీమాంధ్రలోని అసెంబ్లీ స్థానాల్లో టిడిపి 101 స్థానాలను గెలుచుకుని ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉంది. సీమాంధ్రలో 175 స్థానాలు ఉంగా ప్రభుత్వ ఏర్పాటుకు 88 స్థానాలు కనీస మెజారిటీ. ప్రభుత్వ ఏర్పాటులో టిడిపికి మిత్ర పక్షం బిజెపి సహకారం కూడా అవసరం లేకుండా పోయింది. బిజెపికి నాలుగు స్థానాలు వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెసు 67 స్థానాలు గెలుచుకుంది. ఇతరులు ఒక్క స్థానం గెలుపొందారు. కాంగ్రెసు, జైసమైక్యాంధ్ర ఖాతా తెరవలేదు. ఇతరులు రెండు స్థానాలు గెలుచుకున్నారు. సీమాంధ్రలోని మొత్తం 25 పార్లమెంటు స్థానాల ఫలితాలు వచ్చాయి. టిడిపి 15 స్థానాలు గెలుచుకుంది. వైయస్సార్ కాంగ్రెసు 8 స్థానాలు గెలుచుకుంది. బిజెపి రెండు స్థానాలు గెలుచుకుంది.

శ్రీకాకుళం పార్లమెంటు స్థానంలో కేంద్ర మంత్రి, కాంగ్రెసు అభ్యర్థి కిల్లి కృపారాణి ఓడిపోయారు.

హైదరాబాద్ లోకసభ స్థానంలో అసదుద్దీన్ ఓవైసీ విజయం సాధించారు. సికింద్రాబాద్ లోకసభ స్థానంలో బండారు దత్తాత్రేయ విజయం సాధించారు.

రాజంపేట లోకసభ స్థానంలో బిజెపి అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి ఓడిపోయారు. రాజంపేట అసెంబ్లీ స్థానం మాత్రం టిడిపికి దక్కింది. కాకినాడ లోకసభ సీటులో కాంగ్రెసు అభ్యర్థి, కేంద్ర మంత్రి పళ్లంరాజు కూడా ఓటమి పాలయ్యారు.

తెలంగాణలోని కొడంగల్ నుంచి టిడిపి అభ్యర్థి రేవంత్ రెడ్డి విజయం సాధించగా, సీమాంధ్రలోని ఉరవకొండలో టిడిపి అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఓడిపోయారు.

తిరుపతి శాసనసభ స్థానంలో వైసిపి అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి పరాజయం పాలయ్యారు.

గుడివాడ అసెంబ్లీ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొడాలిన నానీ విజయం సాధించారు. జూనియర్ ఎన్టీఆర్‌కు సన్నిహితుడైన ఆయన టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరారు. అది అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్‌కు, చంద్రబాబుకు మధ్య విభేదాలకు దారి తీసింది. గన్నవరం నుంచి టిడిపి అభ్యర్థి వల్లభనేని వంశీ విజయం సాధించారు.

ఏలూరు లోకసభ స్థానంలో టిడిపి అభ్యర్థి మాగంటి బాబు 90 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

తెలంగాణ టిడిపి ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్. కృష్ణయ్య ఎల్బీనగర్ శాసనసభా స్థానంలో విజయం సాధించారు.

మల్కాజిగిరి శాసనసభా స్థానంలో తెరాస అభ్యర్థి కనకా రెడ్డి విజయం సాధించారు.

మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో బిజెపి అభ్యర్థి యెన్నం శ్రీనివాస రెడ్డి ఓడిపోయారు. తెరాస అభ్యర్థి, తెలంగాణ ఉద్యోగుల నాయకుడు శ్రీనివాస గౌడ్ విజయం సాధించారు.

బాపట్ల లోకసభ స్థానంలో కేంద్ర మంత్రి, కాంగ్రెసు అభ్యర్థి పనబాక లక్ష్మి ఓటమి పాలయ్యారు. టిడిపి అభ్యర్థి శ్రీరాం మల్యాద్రి విజయం సాధించారు.

చాంద్రాయణగుట్ట అసెంబ్లీ స్థానంలో మజ్లీస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ విజయం సాధించారు.

గుంటూరు లోకసభ స్థానంలో మహేష్ బాబు బావ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గల్లా జయదేవ్ విజయం సాధించారు.

గద్వాలలో మాజీ మంత్రి డికె అరుణ విజయం సాధించారు.

గుంటూరు పశ్చిమం అసెంబ్లీ స్థానంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ ఓటమి పాలయ్యారు.

పెద్దపల్లి లోకసభ స్థానంలో కాంగ్రెసు అభ్యర్థి జి. వివేక్ ఓడిపోయారు. విద్యార్థి నాయకుడైన తెరాస అభ్యర్థి బాల్క సుమన్ విజయం సాధించారు.

నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తామని, తీర్పును శిరసా వహిస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైయస్ జగన్ అన్నారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని ఆయన స్పష్టం చేశారు.

నరేంద్ర మోడీకి, చంద్రబాబు నాయుడికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అభినందనలు తెలిపారు.

bjp- celebrations

చిత్తూరు జిల్లా పీలేరు అసెంబ్లీ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి షాక్ తగిలింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గంలో ఆయన సోదరుడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పరాజయం పాలయ్యారు.

శ్రీకాకుళం లోకసభ స్థానంలో ఎర్రంనాయుడు కుమారుడు, టిడిపి అభ్యర్థి రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు.

అనంతపురం లోకసభ స్థానంలో టిడిపి అభ్యర్థి జెసి దివాకర్ రెడ్డి గెలిచారు. హిందూపురం లోకసభ స్థానంలో టిడిపి అభ్యర్థి నిమ్మల కిష్టప్ప విజయం సాధించారు.

అరకులో వైకాపా అభ్యర్థి కొత్తపల్లి గీత విజయం సాధించారు. కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ ఓటమి పాలయ్యారు.

నంద్యాలలో వైసిపి అభ్యర్థి ఎస్పీవై రెడ్డి విజయం సాధించారు.

తిరుపతిలో లోకసభ స్థానంలో టిడిపి అభ్యర్థి వరప్రసాద్ విజయం సాధించారు. కాంగ్రెసు అభ్యర్థి చింతా మోహన్ ఓడిపోయారు.

నిజామాబాద్ లోకసభ స్థానంలో మధుయాష్కీపై తెరాస అభ్యర్థి, కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత విజయం సాధించారు.

వరంగల్ జిల్లా జనగాం శాసనసభా స్థానం నుంచి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఓడిపోయారు.

రాజంపేటలో పురంధేశ్వరి వెనకంజలో ఉన్నారు. నర్సాపురంలో బిజెపి అభ్యర్థి గోకరాజు విజయం సాధించారు.

విశాఖ లోకసభ స్థానంలో వైయస్ విజయమ్మ ఓడిపోయారు. బిజెపి అభ్యర్థి హరిబాబు ఘన విజయం సాధించారు.

హైదరాబాద్‌లోని కార్వాన్‌లో బిజెపి అభ్యర్థి బద్దం బాల్ రెడ్డి ఓడిపోయారు. తొలుత ఆయన గెలిచినట్లు వార్తలు వచ్చాయి. ఆయన మజ్లీస్ చేతిలో ఓటమి పాలయ్యారు.

పులివెందుల శాసనసభా నియోజకవర్గంలో వైయస్ జగన్‌కు 75 వేల పైచిలుకు మెజారిటీ లభించింది.

భువనగిరి లోకసభ స్థానంలో తెరాస అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ విజయం సాధించారు.

కాకినాడ లోకసభ స్థానంలో తోట నర్సింహం (టిడిపి) విజయం సాధించారు.

సీమాంధ్రలో 9 మంది మాజీ రాష్ట్ర మంత్రులు ఓడిపోయారు. తెలంగాణలో కూడా 8 మంది తాజా మాజీ మంత్రులు ఓటమి పాలయ్యారు.

కరీంనగర్ లోకసభ స్థానంలో తెరాస అభ్యర్థి వినోద్ కుమార్ విజయం సాధించారు.

TDP celebrations

రాప్తాడు శాసనసభా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పరిటాల సునీత విజయం సాధించారు.

తాడిపత్రి శాసనసభా నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి జెసి ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.

నర్సారావుపేట లోకసభ స్థానంంలో టిడిపి అభ్యర్థి రాయపాటి సాంబశివ రావు విజయం సాధించారు.

నాగార్జున సాగర్ శాసనసభా స్థానంలో కె. జానారెడ్డి విజయం సాధించారు. గోషామహల్ అసెంబ్లీ స్థానంలో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ పరాజయం పాలయ్యారు. బిజెపి ఈ స్థానాన్ని దక్కించుకుంది.

మెదక్ లోకసభ స్థానంలో కెసిఆర్ 4 లక్షల 75 వేల పైచిలుకు ఆధిక్యతతో విజయం సాధించారు.

సీమాంధ్రలో తెలుగుదేశం సైకిల్ స్పీడ్ కనిపించగా, తెలంగాణలో కారు జోరు ప్రదర్శించింది. తెలంగాణలో తెరాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీని సాధించే దిశగా సాగుతోంది. సీమాంధ్రలో తెలుగదుేశం పార్టీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ వైపుగా దూసుకుపోతోంది.

నిజామాబాద్ లోకసభ స్థానంలో కల్వకుంట్ల కవిత లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నల్లగొండ లోకసభ సీటు నుంచి కాంగ్రెసు అభ్యర్థి గుత్తా సుఖేందర్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెసుకు తెలంగాణలో దక్కిన లోకసభ స్థానం ఇదొక్కటే.

సంగారెడ్డిలో కాంగ్రెసు అభ్యర్థి జగ్గారెడ్డి ఓటమి పాలయ్యారు.

చిత్తూరు లోకసభ అభ్యర్థి శివప్రసాద్ విజయం సాధించారు.

సీమాంధ్ర పిసిిస అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి ఓటమి పాలయ్యారు.

కార్వాన్ శాసనసభా స్థానంలో బిజెపి అభ్యర్థి బద్దం బాల్ రెడ్డి విజంయ సాధించారు. సూర్యాపేట శాసనసభా స్థానంలో తెరాస అభ్యర్థి జగదీశ్వర్ రెడ్డి విజయం సాధించారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అసెంబ్లీ స్థానంలో మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ఓటమి పాలయ్యారు.

జూబ్లీహిల్స్‌ శానససభా స్థానంలో టిడిపి అభ్యర్థి మాగంటి గోపినాథ్ విష్ణువర్ధన్ రెడ్డిపై విజయం సాధించారు.

మలక్‌పేట శాసనసభా స్థానంలో మజ్లీస్ విజయం సాధించింది.

ఆళ్లగడ్డ శాసనసభా నియోజకవర్గంలో ఇటీవల మృతి చెందిన శోభా నాగిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

హైదరాబాదులోని శాసనసభా స్థానంలో బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి విజయం సాధించారు.

కాంగ్రెసు అభ్యర్థి షబ్బీర్ అలీ కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు.

మాజీ మంత్రి గీతా రెడ్డి జహీరాబాద్ శాసనసభా స్థానంలో విజయం సాధించారు.

ఖమ్మం జిల్లాలో తెరాస బోణీ కొట్టింది. కొత్త గూడెం శాసనసభా స్థానం నంచి జలగం వెంకట్రావు విజయం సాధించారు.

హైదరాబాద్ లోకసభ స్థానంలో మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ 38 వేల ఆధిక్యంలోకి వచ్చారు. మహబూబ్‌నగర్ లోకసభ స్థానంలో తెరాస అభ్యర్థి జితేందర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

ఖైరతాబాద్ శాసనసభా స్థానంలో మాజీ మంత్రి, కాంగ్రెసు అభ్యర్థి దానం నాగేందర్ పరాజయం పాలయ్యారు.

సద్ధిపేట శాసనసభా స్థానంలో తెరాస అభ్యర్థి హరీష్ రావు 93,350 ఓట్ల ఆధిక్యంతో గెలుపోందారు.

TRS celebrations

మల్కాజిగిరి లోకసభ స్థానంలో టిడిపి ఆధిక్యంలో ఉంది.

పాలకుర్తి శాసనసభా స్థానంలో టిడిపి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు విజయం సాధించారు.

సికింద్రాబాద్ శాసనసభా స్థానంలో కాంగ్రెసు అభ్యర్థి జయసుధ ఓటమి పాలయ్యారు.

మెదక్ లోకసభ స్థానంలో కెసిఆర్ దాదాపు 3 లక్షల మెజారిటీతో విజయం సాధించారు.

గజ్వెల్ శానససభ స్థానంలో 17 వేల వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో కెసిఆర్ విజయం సాధించారు.

చీపురుపల్లి శాసనసభా స్థానంలో బొత్స సత్యనారాయణ ఓటమి పాలయ్యారు.

నర్సాపురం లోకసభ స్థానంలో బిజెపి అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

హైదరాబాద్ లోకసభ స్థానం మూడో రౌండ్‌లో కూడా బిజెపి ఆధిక్యంలో ఉంది.

రాజాం శాసనసభ స్థానంలో మాజీ మంత్రి కొండ్రు మురళి ఓటమి పాలయ్యారు. తెనాలిలో కాంగ్రెసు అభ్యర్థి, శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఓడిపోయారు

చంద్రగిరి శాసనసభా స్థానంలో మాజీ మంత్రి, టిడిపి అభ్యర్థి గల్లా అరుణకుమారి ఓటమి పాలయ్యారు.

నర్సారాపుపేట లోకసభ స్థానంలో రాయపాటి సాంబశివరావు ఆధిక్యంలోకి వచ్చారు.

విశాఖ లోకసభ స్థానంలో వైయస్ విజయమ్మ బిజెపి అభ్యర్థి హరిబాబుపై 20వేలకుపైగా ఓట్లతో వెనకబడి ఉన్నారు.

హైదరాబాదులోని ముషీరాబాద్ శాసనసభా స్థానం నుంచి బిజెపి అభ్యర్థి లక్ష్మణ్ విజయం సాధించారు.

శాసనసభకు కోదాడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి, హుజుర్‌నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. నల్లగొండ శాసనసభా స్థానంలో కోమటిరెడ్డి వెంకట రెడ్డి విజయం సాధించారు.

సికింద్రాబాదులో బిజెపి అభ్యర్థి బండారు దత్తాత్రేయ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హైదరాబాద్ బిజెపి అభ్యర్థి భవంతరావు ఆధిక్యంలో ఉన్నారు.

మంథని నియోజకవర్గంలో మాజీ మంత్రి, కాంగ్రెసు అభ్యర్థి శ్రీధర్ బాబు ఓటమి పాలయ్యారు.

హుజారాబాద్‌లో తెరాస అభ్యర్థి ఈటెల రాజేందర్, కోరుట్లలో తెరాస అభ్యర్థి విద్యాసాగర రావు

బోధన్‌లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పరాజయం చవి చూశారు.

మల్కాజిగిరి అసెంబ్లీ స్థానంలో బిజెపి రెండు వేల ఓట్ల ఆధిక్యంలో ఉంది.

జూబ్లీహిల్స్‌లో టిడిపి ఆధిక్యంలో కొనసాగుతోంది.

పాలకుర్తిలో టిడిపి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు 2 వేల ఓట్ల మెజారిటీతో ఉన్నారు

మెదక్ శాసనసభ స్థానంలో విజయశాంతి పరాజయం పాలయ్యారు.

ఒంగోలు లోకసభ స్థానంలో వైకాపా అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి విజయం సాధించారు.

కుప్పం శానససభా స్థానంలో చంద్రబాబు నాయుడు విజయం సాధించారు.

NTR trust bhavan

హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుంచి బాలకృష్ణ విజయం సాధించారు. నగరి శాసనసభా స్థానం నుంచి వైకాపా అభ్యర్థి రోజా విజయం సాధించారు.

వరంగల్ లోకసభ స్థానం నుంచి తెరాస అభ్యర్థి కడియం శ్రీహరి విజయం సాధించారు.

మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆందోల్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి బాబూ మోహన్‌పై ఓటమి పాలయ్యారు.

మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి హైదరాబాద్ లోకసభ స్థానంలో బిజెపి అభ్యర్థి భగవంతరావు చెమటలు పట్టిస్తున్నారు.

ఖమ్మం లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

నర్పాపూర్ శాసనసభా నియోజకవర్గంలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఓడిపోయారు. జహీరాబద్ నుంచి మాజీ మంత్రి గీతా రెడ్డి కూడా ఓటమి పాలయ్యారు.

నిజామాాబాద్ రూరల్ శాసనసభా స్థానం నుంచి ప్రముఖ కాంగ్రెసు నేత డి శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు. తెరాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ 20వేల మెజారిటీతో డిఎస్‌పై విజయం సాధించారు.

తెలంగాణలో టిఆర్ఎస్, సీమాంధ్రలో తెలుగుదేశం ఇతర పార్టీల సహకారం లేకుండా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మంథనిలో మాజీ మంత్రి శ్రీధర్ బాబు వెనకంజలో ఉన్నారు.

మహబూబాబాద్ లోకసభ స్థానంలో కేంద్ర మంత్రి బలరాం నాయక్ ముందంజలోకి వచ్చారు.

ఆలేరు, భువనగిరి శాసనసభా స్థానాల్లో తెరాస విజయం సాధించింది. ఆలేరులో గొంగడి సునీత, భువనగిరిలో పైలా శేఖర్ రెడ్డి విజయం సాధించారు.

సీమాంధ్రలోని ఉరవకొండ అసెంబ్లీ స్థానంలో పయ్యావుల కేశవ్ వెనకబడ్డారు.

ముషీరాబాద్, ఉప్పల్ శాసనసభా స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో ఉంది. నాంపల్లి, జూబ్లీహిల్స్ స్థానాల్లో మజ్లీస్ ఆధిక్యంలో ఉంది.

ఆందోల్ నియోజకవర్గంలో దామోదర రాజనర్సింహపై తెరాస అభ్యర్థి బాబూ మోహన్ ఆధిక్యంలోకి వచ్చారు.

మైలవరం శాసనసభా స్థానంలో టిడిపి అభ్యర్థి దేవినేని ఉమమహేశ్వర రావు ముందంజలోకి వచ్చారు.

తెలంగాణలోని సిరిసిల్ల శాసనసభ స్థానం నుంచి తెరాస అభ్యర్థి కెటి రామరాావు విజయం సాధించారు.

ఒంగోలు శాసనసభా స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థి బాలినేని శ్రీనివాస రెడ్డిపై టిడిపి అభ్యర్థి దామచర్ల జనార్దన్ 18వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. తొలి ఫలితం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చింది.

కడప లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థి అవినాష్ రెడ్డి ముందంజలో ఉన్నారు.

ఒంగోలులో వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థి బాలినేని శ్రీనివాస రెడ్డి ఓడిపోయారు.

సీమాంధ్రలో టిడిపి - బిజెపి కూటమి శాసనసభ, లోకసభ స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది.

తెలంగాణలో శాసనసభ స్థానాల్లోనే కాకుండా లోకసభ స్థానాల్లో కూడా తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తోంది.

హైదరాబాద్ లోకసభ స్థానంలో అసదుద్దీన్ ఓవైసీ ముందుకు వచ్చారు.

భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణా రెడ్డి వెనకంజలో ఉన్నారు.

నల్లగొండ శాసనసభా స్థానంలో కోమటిరెడ్డి వెంకటర రెడ్డి వెనకబడ్డారు.

హైదరాబాద్ లోకసభ స్థానంలో అసదుద్దీన్ వెనకబడ్డారు. ఆధిక్యం ఆయనతో దోబూచులాడుతోంది.

సికింద్రాబాద్, మిర్యాలగుడా శాసనసభా స్థానాల్లో తెరాస ఆధిక్యంలో ఉంది. సికింద్రాబాదులో కాంగ్రెసు అభ్యర్థి జయసుధ వెనకబడ్డారు.

సీమాంధ్ర లోకసభ స్థానాల్లోనూ ట్రెండ్ మారుతోంది. టిడిపి 14 స్థానాల్లో ఆధిక్యంలోకి రాగా, వైకాపా 9 స్థానాల్లో మూత్రమే ఆధిక్యంలో ఉఁది.

మహబూబ్ నగర్ లోకసభ స్థానంలో తెరాస అభ్యర్థి జితేందర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, బిజెపి అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి వెనకంజలో ఉన్నారు.

నాగర్ కర్నూలు లోకసభ స్థానంలో తెరాస అభ్యర్థి మందా జగన్నాథం ఆధిక్యంలో ఉన్నారు.

హైదరాబాద్ లోకసభ స్థానంలో అసదుద్దీన్ ఓవైసీ ఆధిక్యంలోకి వచ్చింది.

నర్సారావుపేట లోకసభ స్థానంలో టిడిపి అభ్యర్థి వెనకబడి ఉన్నారు.

మల్కాజిగిరి లోకసభ స్థానంలో టిడిపి ఆభ్యర్థి మల్లారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

తెనాలి అసెంబ్లీ స్థానంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్, గుంటూరు వెస్ట్ అసెంబ్లీ స్లానంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ వెనకంజలో ఉన్నారు. బాపట్ల లోకసభ స్థానంలో కాంగ్రెసు అభ్యర్థి, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి వెనకంజలో ఉన్నారు.

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో తెరాస అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు.

చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ వెనకంజలో ఉన్నారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు వెనకంజలో ఉన్నారు.

నిజామాబాద్ లోకసభ స్థానంలో కవిత 14 వేల ఆధిక్యంలో ఉన్నారు. నంద్యాల లోకసభ స్థానంలో టిడిపి ఆధిక్యంలో ఉఁది.

సీమాంధ్ర అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలోకి వెళ్తూ, వైకాపా స్థానాల ఆధిక్యత క్రమంగా తగ్గుతోంది.

మెదక్ శాసనసభ స్థానంలో విజయశాంతి వెనకబడ్డారు.

తెలంగాణ లోకసభ స్థానాల్లో తెరాస జోరు సాగిస్తోంది. తెలంగాణలోని 17 స్థానాల్లో 12 సీట్లలో తెరాస ఆధిక్యంలో ఉంది. కాంగ్రెసు ఒక్క స్థానంలో అధిక్యంలో ఉంది. టిడిపి రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

సీమాంధ్ర అసెంబ్లీ స్థానాల్లో టిడిపి ఆధిక్యం సాధించింది. టిడిపి 87 స్థానాల్లో, బిజెపి మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, వైకాపా ఆధిక్యం 76 స్థానాలకు తగ్గింది.

కరీంనగర్ లోకసభ స్థానంలో తెరాస అభ్యర్థి వినోద్ కుమార్ 12 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెసు సిట్టింగ్ ఎంపి పొన్నం ప్రభాకర్ వెనకంజలో ఉన్నారు.

అమలాపురం లోకసభ, అసెంబ్లీ స్థానాల్లో టిడిపి ఆధిక్యంలో ఉంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస 60 స్థానాల్లో ఆధిక్యంలోకి వచ్చింది. కాంగ్రెసు 22 స్థాినాల్లో ఆధిక్యంలో ఉంది. టిడిపి 14, బిజెపి 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

భువనగిరి లోకసభ స్థానంలో కాంగ్రెసు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెనకంజలో ున్నారు.

మెదక్ జిల్లా నర్సాపూర్‌ అసెంబ్లీ స్థానంలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి వెనకంజలో ఉన్నారు.

ముషీరాబాద్ అసెంబ్లీ స్థానంలో బిజెపి ఆధిక్యంలో ఉన్నారు.

నాగార్జునసాగర్‌లో మాజీ మంత్రి జానా రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

మహబూబ్ నగర్ లోకసభ స్థానంలో కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి వెనకంజలో ఉన్నారు.

విశాఖపట్నం లోకసభ స్థానంలో వైయస్ విజయమ్మ వెనకంజలో ఉన్నారు.

అనంతపురం లోకసభ స్థానంలో జెసి దివాకర్ రెడ్డి, రాప్తాడు అసెంబ్లీ స్థానంలో పరిటాల సునీత ముందంజలో ఉన్నారు.

నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ స్థానంలో డి. శ్రీనివాస్, ఖైరతాబాద్ అసెంబ్లీ సీటులో మాజీ మంత్రి దానం నాగేందర్ వెనకంజలో ఉన్నారు.

ఆత్మకూరులో కాంగ్రెసుకు చెందిన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెనకంజలో ఉన్నారు.

సీమాంధ్రలో లోకసభ స్థానాల్లో వైసిపి ఆధిక్యంలో కొనసాగుతుండగా, అసెంబ్లీ స్థానాల్లో టిడిపిపై వెనకంజలో ఉంది.

గజ్వెల్‌ అసెంబ్లీ స్థానంలో కెసిఆర్, సిరిసిల్లలో కెటిఆర్, సిద్ధిపేటలో హరీశ్ రావు ఆధిక్యంలో ఉన్నారు.

నిజామాబాద్ లోకసభ స్థానంలో కవిత ముందంజలో ఉన్నారు.

టిడిపి అభ్యర్థి దేవనేని ఉమామహేశ్వర రావు వెనకంజలో ఉన్నారు.

చిత్తూరు జిల్లాలో వైకాపా, టిడిపి ఆరేసి స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

సీమాంధ్రలో టిడిపి - బిజెపి కూటమి అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానంలో టిడిపి అభ్యర్థి ఆర్. కృష్ణయ్య ఆధిక్యంలో ఉన్నారు.

సీమాంధ్రలో టిడిపి వైకాపాపై ఆధిక్యం సాధిస్తోంది. టిడిపి 80, వైకాపా 66 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. బిజెపి మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

గుంటూరు లోకసభ స్థానంలో గల్లా జయదేవ్ కేవలం 600 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

కర్నూలు జిల్లాలో వైకాపా ఆరు, టిడిపి ఐదు స్థానాల్లో అసెంబ్లీకి ఆధిక్యంలో ఉన్నాయి. ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.

విశాఖ జిల్లాలో ఐదు టిడిపి, రెండు వైకాపా ఆధిక్యంలో ఉన్నాయి.

హైదరాబాదు లోకసభ స్థానంలో అసదుద్దీన్ ఓవైసీ వెనకంజలో ఉన్నారు. పెద్దపల్లి లోకసభ స్థానంలో వివేక్ వెనకంజలో ఉన్నారు. తెరాస అభ్యర్థి బాల్క సుమన్ ఆధిక్యంలో ఉన్నారు.

సీమాంధ్ర అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యం వైకాపా, టిడిపి మధ్య దోబూచులాడుతోంది. తాజాగా, టిడిపి 64 స్థానాల్లో, వైకాపా 63 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

తెలంగాణలో తెరాస దూసుకుపోతోంది. తెరాస 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెసు 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. టిడిపి 11, బిజెపి 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

నిజామాబాద్ లోకసభ స్థానంలో కవిత తిరిగి యాష్కీపై ఆధిక్యంలోకి వచ్చారు.

కుప్పం అసెంబ్లీ స్థానంలో చంద్రబాబు, పులివెందుల అసెంబ్లీ అసెంబ్లీ స్థానంలో వైయస్ జగన్ ముందంజలో ఉన్నారు.

మానకొండూరు అసెంబ్లీ స్థానంలో తెరాస అభ్యర్థి రసమయి బాలకిషన్ ఆధిక్యంలో ఉన్నారు. మహబూబాబాద్ లోకసభ స్థానంలో తెరాస ఆధిక్యంలో ఉంది.

చేవెళ్ల అసెంబ్లీ, లోకసభ స్థానాల్లో తెరాస ఆధిక్యంలో ఉంది.

కర్నూలులో వైకాపా అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

జహీరాబాద్‌ అసెంబ్లీ స్థానంలో మాజీ మంత్రి గీతారెడ్డి ముందంజలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా పరిగి అసెంబ్లీ స్థానంలో తెరాస ఆధిక్యంలో ఉంది.

నిజామాబాద్ లోకసభ స్థానంలో కవితపై యాష్కి ఆధిక్యంలోకి వచ్చారు. జనగాం అసెంబ్లీ స్థానంలో టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వెనకంజలో ఉన్నారు. చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ఓవైసీ ఆధిక్యంలో ఉన్నారు.

పీలేరులో కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి ముందంజలో ఉన్నారు. పరిగిలో తెరాస అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

సీమాంధ్ర అసెంబ్లీ స్థానాల్లో టిడిపి ఆధిక్యంలోకి వచ్చింది. వైకాాపా, టిడపి మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగుతోంది.

సీమాంధ్ర అసెంబ్లీ స్థానాల్లో 38లో వైకాపా, టిడిపి 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. తెలంగాణలో కారు దూసుకుపోతోంది. తెరాస 35 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 8 లోకసభ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

సీమాంధ్ర లోకసభ స్థానాల్లోనూ వైకాపా ముందంజలో ఉంది. వైకాపా 8 స్థానాల్లో 9, టిడిపి 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

వరంగల్ తూర్పు అసెంబ్లీ స్థానంలో కొండా సురేఖ ముందంజలో ఉన్నారు .

మెదక్ లోకసభ స్థానంలో కెసిఆర్ ఆధిక్యఁలో ఉన్నారు.

బాపట్ల, శ్రీకాకుళం లోకసభ స్థానాల్లో వైకాపా ముందంజలో ఉంది.

విజయవాడ తూర్పులో టిడిపి ఆధిక్యంలో ఉంది.

ప్రకాశం జిల్లాలోని అసెంబ్లీ స్థానాల్లో ఐదింట వైకాపా, రెండింట టిడిపి ఆధిక్యంలో ఉన్నాయి.

నిజామాబాద్ లోకసభ స్థానంలో కల్వకుంట్ల కవిత మధు యాష్కీపై ముందంజలో ఉన్నారు.

కర్నూలు లోకసభ స్థానంలో కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వెనకంజలో ఉన్నారు. టిడిపి ఆధిక్యంలో ఉంది.

సీమాంధ్రలో వైకాపా టిడిపిని దాటేసింది.

టెక్కలిలో అసెంబ్లీ స్థానంలో వైకాపా ఆధిక్యంలో ఉంది.

ఆర్మూర్, బాల్కొండ ఆసెంబ్లీ స్థానంలో తెరాస ఆధిక్యంలో ఉంది.

రంగారెడ్డి జిల్లా వికారాబాద్ అసెంబ్లీ స్థానంలో తెరాస ఆధిక్యంలో ఉంది.

కావలిలో వైకాపా ముంందంజలో ఉంది. రాజంపేట లోకసభ స్థానంలో పురంధేశ్వరి ఆధిక్యంలో ఉంది.

గోషా మహిల్ అసెంబ్లీ స్థానంలో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ వెనకంజలో ఉన్నారు. బిజెపి ఆధిక్యంలో ఉన్నారు.

హిందూపురం శాసనసభ స్థానంలో బాలకృష్ణ ఆధిక్యంలో ఉన్నారు. కార్వాన్‌ అసెంబ్లీ స్థానంలో బద్దం బాల్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

సీమాంధ్ర అసెంబ్లీ స్థానాల్లో టిడిపి ఆధిక్యంలో కొనసాగుతోంది.

చిత్తూరు లోకసభ స్థానంలో టిడిపి ఆధిక్యంలో కొనసాగుతోంది

హైదరాబాదులోని సనత్‌నగర్, కార్వాన్ అసెంబ్లీ స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో కొనసాగుతోంది.

కోదాడలో కాంగ్రెసు ఆధిక్యంలో కొనసాగుతోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆందోల్‌లో ముందంజలో ఉన్నారు.

కరీంనగర్ లోకసభ స్థానంలో తెరాస ముందంజలో ఉంది.

నల్లగొండ జిల్లా మిర్యాలగుడా, హుజుర్‌నగర్ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెసు ముందంజలో ఉంది.

విజయవాడ తూర్పు అసెంబ్లీ స్థానంలో టిడిపి ముందంజలో ఉంది.

తెరాస పది అసెంబ్లీ స్థానాల్లో, కాంగ్రెసు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

సీమాంధ్రలో వైసిపి ఐదు స్థానాల్లో, టిడిపి మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి రోజా ముందంజలో ఉన్నారు.

తెలంగాణలో తెరాస, సీమాంధ్రలో టిడిపి అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో కెటి రామారావు ముందంజలో ఉన్నారు. వేములవాడ, చొప్పదండి అసెంబ్లీ స్థానాల్లో తెరాస ముందంజలో ఉంది.

సీమాంధ్రలోని గుంటూరు లోకసభ స్థానంలో టిడిపి అభ్యర్థి గల్లా జయదేవ్ ఆధిక్యంలో ఉన్నారు.

వరంగల్ లోకసభ స్థానంలో తెరాస అభ్యర్థి కడియం శ్రీహరి ఆధిక్యంలో ఉన్నారు. మల్కాజిగిరి లోకసభ స్థానంలో తెరాస ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

హైదరాబాద్‌లోని అంబర్‌పేట స్థానంలో బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

గుంటూరు జిల్లా రేపల్లే అసెంబ్లీ స్థానంలో టిడిపి ఆధిక్యంలో కొనసాగుతోంది.

మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ స్థానంలో కూడా తెరాస ఆధిక్యంలోకి కొనసాగుతోంది.

సీమాంధ్రలోని రెండు అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలోకి వచ్చింది.

తెరాస నల్లగొండ జిల్లా ఆలేరు అసెంబ్లీ స్థానంలో లీడ్‌లో ఉంది.

Counting

శుక్రవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

ఉదయం గం.8.30 నిమిషాలకు ఇవియం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

English summary
Counting votes for 294 assembly seat seats and 42 Lok Sabha seats are underway in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X