వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మ‌ధ్నాహ్నానికి తొలి ఫ‌లితం: 25వేల మంది సిబ్బంది..25వేల మందితో భ‌ద్ర‌త‌: సీఈవో ద్వివేదీ..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు..25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి పోలింగ్..భ‌ద్ర‌తా సిబ్బంది ఇప్ప‌టికే కౌంటింగ్ సెంట‌ర్ల‌కు చేరుకున్నారు. ప్ర‌తీ కౌంటింగ్ కేంద్రంలో రెండేసి హాళ్లు చొప్పున 14 టేబుళ్ల‌ను ఏర్పాటు చేసారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌తో ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. మ‌ధ్నాహ్నానికి తొలి ఫ‌లితం వెల్ల‌డి కానుంది.

 8గంట‌ల‌కు కౌంటింగ్ ప్రారంభం...

8గంట‌ల‌కు కౌంటింగ్ ప్రారంభం...

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం అయింది. గురువారం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల కు ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది. 13 జిల్లాల్లో 34 ప్రాంతాల్లో 55 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసారు. పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో 55 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ద్వివేదీ ప్ర‌క‌టించారు. ఒక్కో కేంద్రంలో రెండేసి హాళ్లు చొప్పున..14 టేబుళ్లు ఏర్పాటు చేసారు. అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గా ల కోసం 14 టేబుళ్లు కేటాయింపు కేటాయించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, సర్వీసు ఓటర్ల బ్యాలెట్ల లెక్కింపు చేప‌డ‌తారు. ఇక‌, చివర్లో ఐదు వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పుల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు.

ప్ర‌త్యేక నిఘా..50 వేల మంది సిబ్బంది..

ప్ర‌త్యేక నిఘా..50 వేల మంది సిబ్బంది..

ఏపీలో కౌంటింగ్ ప్ర‌క్రియ ప‌ర్య‌వేక్ష‌ణ కోసం ఈసీ తరపున ఇద్దరు ప్రత్యేక పరిశీలకులను నియ‌మించారు. కౌంటింగ్ హాల్స్ వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేసారు. టింగ్ హాల్ వద్ద 100మీటర్ల దూరం నుంచి ఎవరైనా నడిచి వెళ్ళాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసారు. రాష్ట్రంలో కౌంటింగ్ కొసం 25వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు..
45కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు రాష్ట్రంలో సిద్దంగా ఉంచారు. కౌంటింగ్ వద్ద ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని అధికారులు స్ప‌ష్టం చేసారు. కౌంటింగ్ సిబ్బంది మొత్తానికి పక్కా ట్రైనింగ్ ఇచ్చారు. ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద ఇద్దరు బెల్ ఇంజినీర్లు అందుబాటులో ఉంచారు. 2.11లక్షల పోస్టల్ బ్యాలెట్, 28వేల సర్వీస్ ఓట్లు వచ్చాయి. 3.05లక్షల పోస్టల్ బ్యాలెట్ లు జారీ చేశారు. 8గంటలకు పోస్టల్, సర్వీస్ ఓట్లను తొలుత లెక్కిస్తారు. ప్రతి అసీంబ్లీకి ఒక పరిశీలకుడు, పార్లమెంట్ కి ఒక పరిశీలకుడు అందుబాటులో ఉన్నారు

రౌండ్ వారీగా ఫ‌లితాలు..

రౌండ్ వారీగా ఫ‌లితాలు..

హాల్ సామర్ధ్యం ఆధారంగా కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్ వారీగా ఫలితాలు వెల్లడిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా సెంటర్ ఏర్పాటు చేసారు. ఓట్ల లెక్కింపు కోసం 25వేల మంది కౌంటింగ్ సిబ్బంది, 25 వేల మంది సాయుధ బలగాలు కౌంటింగ్ విధుల్లో ఉంటారు. మ‌ధ్నాహ్నం 2గంటలకల్లా ఫలితాలు రానున్నాయి. వీవీ ప్యాట్ ల లెక్కింపుకు కొంత ఆలశ్యం అవుతుందని అంచ‌నా వేస్తున్నారు.

English summary
Election commission completed counting arrangements in AP for 25 loksabha and 175 assembly segments. In counting process first postal and service votes will be count. Total 25000 staff and 2500 security persons in counting duty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X