వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ కేసుల ప్ర‌క్రియ మ‌ళ్లీ ప్రారంభించాల్సిందేనా , కోర్టు విభ‌జ‌న‌తో జ‌రిగేది ఇదేనా : జ‌రిగేదేంటి!

|
Google Oneindia TeluguNews

హైకోర్టు విభ‌జ‌న తో నాంప‌ల్లి సిబిఐ కోర్టు జ‌డ్జి కూడా బ‌దిలీ అవుతారు. మ‌రి..ఇప్పుడు జ‌గ‌న్ కేసుల ప్ర‌క్రియ మ‌ళ్లీ ప్రారంభం కావాల్సిందేనా. ఇప్పుడు ఈ చ‌ర్చ‌కు తెర మీద‌కు ఎవ‌రు తెచ్చారు. ఎందుకు తెచ్చారు. కోర్టు విభ‌జ‌న జ‌రిగితే ప్ర‌క్రియ మ‌ళ్లీ ప్రారంభించ‌టం ఏంటి... జ‌రిగేందేంటి..జ‌రుగుతుందేంటి..

హైకోర్టు విభజనపై కేంద్రం

హైకోర్టు విభజనపై కేంద్రం

ఉమ్మ‌డి హైకోర్టును విభ‌జిస్తూ రాష్ట్రప‌తి గ‌జెట్ జారా చేసారు. దీని పై హైకోర్టులో రెండు ప్రాంతాల‌కు చెందిన లాయ‌ర్లు భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేసిన కామెంట్లు కొత్త చ‌ర్చ‌కు కార ణ మవుతున్నాయి. హైకోర్టు విభజనపై కేంద్రం తీరును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. సంప్రదింపు లు జరపకుండానే విభజన చేసిందని విమర్శించారు. సమయం ఇవ్వకుండా జనవరి 1నే వెళ్లిపోవాలనడం సరి కాద న్నారు. జగన్ కేసులను దృష్టిలో పెట్టుకునే విభజన చేసినట్టుగా అనిపిస్తోందన్నారు.

జగన్‌ కేసులో

జగన్‌ కేసులో

హైకోర్టు విభజనతో నాంపల్లి సీబీఐ కోర్టు విభజన కూడా జరుగుతుందని తెలిపారు. జగన్‌ కేసులో వాదనలు జరగకపోయినా న్యాయ ప్రక్రియ ముగిసిందని.. హైకోర్టు విభజనతో నాంపల్లి కోర్టు జడ్జి కూడా బదిలీ అవుతారన్నారు. కాబట్టి ఇప్పుడా ప్రక్రియ మళ్లీ ప్రారంభించాల్సిందేనన్నారు. ఇప్పుడు ముఖ్య‌మంత్రి చేసిన కామెంట్ల పై అటు టిడిపి తో పాటుగా వైసిపి లోనూ చ‌ర్చ మొద‌లైంది.

జ‌గ‌న్ కేసులు ఎదుర్కొంటున్నార‌ని

జ‌గ‌న్ కేసులు ఎదుర్కొంటున్నార‌ని

జ‌గ‌న్ కేసులు రాజ‌కీయ కుట్ర‌తోనే దాఖ‌లు చేసార‌ని జ‌గ‌న్ తో పాటుగా వైసిపి నేత‌లు ప‌లుమార్లు ఆరోపించారు. ప‌రో క్షంగా ముఖ్య‌మంత్రి సైతం సోనియా ను ఎదిరించినందుకే జ‌గ‌న్ కేసులు ఎదుర్కొంటున్నార‌ని వ్యాఖ్యానించారు. జ‌గ న్ త‌న పై సిబిఐ న‌మోదు చేసిన కేసుల కార‌ణంగా 16 నెల‌ల పాటు జైలు జీవితం కూడా గ‌డిపారు. ఇప్ప‌టికీ హైద‌రాబా ద్ లోని సిబిఐ కోర్టుల లో జ‌గ‌న్ కేసుల విచార‌ణ జ‌రుగుతోంది. ప్ర‌తీ శుక్ర‌వారం జ‌గ‌న్ కోర్టుకు హాజ‌ర‌వుతున్నారు. ఈ కేసు ల‌పై విచార‌ణ కొన‌సాగుతోంద‌ని..జ‌గ‌న్ నిర్దోషిగా బ‌య‌ట‌కు వ‌స్తార‌ని జ‌గ‌న్ త‌ర‌పు న్యాయ‌వాదులు చెబుతున్నారు.

న్యాయ ప‌రంగా సాధ్యం కాద‌నేది

న్యాయ ప‌రంగా సాధ్యం కాద‌నేది

ఈ స‌మ‌యంలో..ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కేసుల ప్ర‌క్రియ మ‌ళ్లీ ప్రారంభించాల్సిందేనంటూ చెప్ప‌టం వెనుక రాజ‌కీయ దురుద్దేశం మిన‌హా.. న్యాయ ప‌రంగా సాధ్యం కాద‌నేది వారి అభిప్రాయం. కోర్టు విభ‌జ‌న జ‌రిగినా..అప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన ప్రొసీడింగ్స్ రికార్డు అయి ఉంటాయ‌ని..త‌దుప‌రి విచార‌ణ‌..తీర్పులు య‌ధావిధిగా అమ‌ల‌వుతాయ‌ని న్యాయ నిపుణులు చెబుతున్నారు. జ‌గ‌న్ కేసుల్లో వాదనలు జరగకపోయినా న్యాయ ప్రక్రియ ముగిసిందని ముఖ్య‌మంత్రి వ్యాఖ్యానించ‌టం పై వైసిపి శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. జగన్ కేసులను దృష్టిలో పెట్టుకునే విభజన చేసినట్టుగా అనిపిస్తోందనటం స‌రి కాద‌ని చెబుతున్నారు.

English summary
C.M Chandra Babu suspected courts bifurecation for jagan only... Jagan cases coming to close with our arguments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X