చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముందస్తు బెయిల్ కొట్టివేత: 'మల్లాది విష్ణును అరెస్ట్ చేయం', చింటూ రిమాండ్ పొడిగింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ/చిత్తూరు: కల్తీ మద్యం కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లాది విష్ణు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మెట్రోపాలిటన్ న్యాయస్థానం సోమవారం నాడు కొట్టి వేసింది. ఎల్లుండి లోపు (బుధవారం) విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని విష్ణును న్యాయస్థానం ఆదేశించింది.

మల్లాది విష్ణు ముందస్తు బెయిల్ పైన కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) తరఫు లాయర్ మాట్లాడుతూ.. తాము విష్ణును అరెస్టు చేయమని, విచారణకు హాజరు కావాలని చెప్పారు. దీనిపై కోర్టు స్పందిస్తూ దర్యాఫ్తు అధికారికి సహకరించాలని సూచించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.

court dismissed Malladi Vishnu anticipatory bail petition

మేయర్ అనురాధ హత్య కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు

చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో నిందితుల రిమాండును న్యాయస్థానం పొడిగించింది. ప్రధాన నిందితుడు చింటూతో పాటు మిగతా నిందితులకు ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది.

చిత్తూరు నగర మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్‌లను హత్య చేసిన కేసులో వారి మేనల్లుడు చింటూ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతనితో పాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరికి కోర్టు రిమాండ్ విధించింది.

English summary
court dismissed Malladi Vishnu anticipatory bail petition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X