వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి కొత్త చిక్కులు ... ఆ విషయంలో కోర్టు నోటీసులు

|
Google Oneindia TeluguNews

ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదనే కుల వివాదం ఆమె ఎన్నికల్లో విజయం సాధించిన నాటి నుండి కొనసాగుతూనే ఉంది . విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన పుష్పశ్రీ వాణి జగన్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఏకంగా మహిళా డిప్యూటీ సీఎంగా ఆమెకు అవకాశం కలిపించారు సీఎం జగన్. గిరిజన సంక్షేమశాఖ మంత్రిగానూ, డిప్యూటీ సీఎం గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమెకు ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది.

ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి ఇంగ్లీష్ రాదట ... చాలా ఇబ్బంది పడుతున్నారటఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి ఇంగ్లీష్ రాదట ... చాలా ఇబ్బంది పడుతున్నారట

కొత్త చిక్కుల్లో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

కొత్త చిక్కుల్లో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

జగన్ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్న పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్స గతంలోనే ఆరోపించిన విషయం తెలిసిందే.. ఆమె కులానికి సంబంధించినటువంటి కేసు కోర్టు విచారణలో ఉందని, అలాంటప్పుడు ఆమెను ఎస్టీగా పరిగణిస్తూ మంత్రివర్గంలోకి ఏవిధంగా తీసుకుంటారని ఆయన గందరగోళం చేశారు. చెల్లుబాటు కాని కుల ధ్రువీకరణ పత్రంతో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారని ఆమె ఎన్నిక రద్దు చేయాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు హైకోర్టుకెక్కారు. దీంతో హైకోర్టు తాజాగా ఏపీ డిప్యూటీ సీఎంకు నోటీసులు జారీ చేశారు.

 కుల ధృవీకరణకు సంబంధించి వివరణ ఇవ్వాలని కోర్టు నోటీసులు

కుల ధృవీకరణకు సంబంధించి వివరణ ఇవ్వాలని కోర్టు నోటీసులు

ఎస్టీ కోటాలో డిప్యూటీ సీఎం అయిన పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదని పుష్ఫ శ్రీవాణిపై ఆమెకు ప్రత్యర్థులుగా పోటీచేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఎన్. సింహాచలం బీజేపీ అభ్యర్థి ఎన్.జయరాజు గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు. పుష్ప శ్రీవాణి ‘కొండదొర'గా పేర్కొంటూ ఎస్టీ కులధ్రువీకరణ పత్రం పొందారని కానీ అది చెల్లుబాటు కాదని పిటీషన్ లో పేర్కొన్నారు. ఆమె ఎన్నికను రద్దు చేయాలని హైకోర్టును కోరారు.దీనిపై విచారించిన హైకోర్టు పుష్ఫ శ్రీవాణికి నోటీసులు జారీ చేసింది. ఆమె వివరణ చూశాక దీనిపై తదుపరి విచారణ చెయ్యనుంది.

 పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదనే ఆరోపణతో కోర్టును ఆశ్రయించిన ప్రత్యర్ధులు

పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదనే ఆరోపణతో కోర్టును ఆశ్రయించిన ప్రత్యర్ధులు

ఎస్టీ రిజర్వుడ్ స్థానమైన విజయనగరం జిల్లా కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన పుష్ప శ్రీ వాణి నామినేషన్ దాఖలు చేసేటప్పుడు ఇచ్చిన దృవీకరణ పత్రాల ఆధారంగా ఆమెపై కోర్టుకు వెళ్ళారు. అభ్యర్థులు తాజాగా తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సిన నిబంధన ఉన్నా పుష్ప శ్రీ వాణి 2013నాటి ధృవపత్రాన్ని నామినేషన్ సమయంలో సమర్పించారని ఆరోపించారు. ఇక దానిని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఇక ఈనేపథ్యంలో ఆమెకు నోటీసులు పంపి వివరణ కోరింది హైకోర్టు.

English summary
Pushpa Shrivani, who is the deputy CM in the ST quota, is not an ST. Congress candidate Sinhachalam and BJP candidate N. Jayaraju had approached the High Court in the past. In the petition, Pushpa Shrivani claimed that the ST had obtained a validity certificate but it was not valid. They also asked the High Court to cancel the election. High court taken up the petition for hearing and issued notice to deputy cm pushpa srivani .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X