హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: ఆంధ్రాలో 40 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ పరీక్షలు, తెలంగాణలో, తబ్లీగి జమాత్ !

|
Google Oneindia TeluguNews

అమరావతి/ తిరుపతి/ గుంటూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. భారతదేశంలో కరోనా కట్టడికి రెండో విడత లాక్ డౌన్ అమలు చేశారు. కరోనా వైరస్ కట్టడికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన తబ్లీగి జమాత్ సమావేశానికి హాజరైన వారి నుంచి వారి కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకిందని వెలుగు చూసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో 40 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ పరీక్షలు నిర్వహించామని అధికారులు అంటున్నారు. అదే విధంగా తెలంగాణలో 25 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ పరీక్షలు నిర్వహించి అనుమానితులకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు.

Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!

3 ఏళ్ల నుంచి 17 ఏళ్ల సంవత్సరాలు

3 ఏళ్ల నుంచి 17 ఏళ్ల సంవత్సరాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కట్టడి చెయ్యడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేక కఠిన చర్యలు అమలు చేస్తోంది. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘిస్తున్న వారి మీద కేసులు నమోదు చేసింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వందల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 3 ఏళ్ల నుంచి 17 ఏళ్ల వయసు ఉన్న 40 మందికి కరోనా పాజిటివ్ పరీక్షలు నిర్వహించామని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

కరోనాకు ఢిల్లీ తబ్లీగి జమాత్ లింక్

కరోనాకు ఢిల్లీ తబ్లీగి జమాత్ లింక్

గత నెల మార్చి నెలలో ఢిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన తబ్లీగి జమాత్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన అనేక మంది హాజరైనారు. తబ్లీగి జమాత్ సమావేశానికి హాజరైన వారు తిరిగి వారివారి ఇళ్లకు చేరుకున్నారు. తబ్లీగి జమాత్ సమావేశానికి హాజరైన వారికి తెలీకుండానే వారు స్వేచ్చగా తిరగడంతో వారి కుటుంబ సభ్యులకు, పిల్లలకు కరోనా వైరస్ సోకిందని ఓ సీనియర్ అధికారి ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ వార్తా సంస్థకు చెప్పారు.

భార్యలు, పిల్లలు, అమ్మలు, అక్కా చెల్లెళ్లు

భార్యలు, పిల్లలు, అమ్మలు, అక్కా చెల్లెళ్లు

ఢిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైన వారు నేరుగా వాళ్ల ఇళ్లకు వెళ్లిపోవడంతో కరోనా వైరస్ వారి కుటుంబ సభ్యులకు సోకిందని ఆరోగ్య శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు. తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైన వారి నుంచి అనుకోకుండా కరోనా వ్యాధి సోకిన వారిలో వారి భార్యలు, అమ్మలు, అక్క చెల్లెళ్లు, నానమ్మలు, పిల్లలు ఉన్నారని ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. వీరిలో 124 మంది మహిళలు, మిగిలిన 36 మంది 60 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారని అధికారులు అంటున్నారు.

రోజుకు 4 వేల మందికి పరీక్షలు !

రోజుకు 4 వేల మందికి పరీక్షలు !

ఆంధ్రప్రదేశ్ లో బుధవారం నుంచి ట్రూనాట్ టీబీ (TrueNat TB) వైద్య పరికరాలు ఉపయోగించి ప్రతి రోజు 4, 000 మందికి వైద్య పరీక్షలు చెయ్యాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దిగ్భంధ కేంద్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వస్తున్న పేద ప్రజలకు రూ. 2 వేల చొప్పున ఆర్థిక సహాయం చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందని ఓ అధికారి ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ వార్తా సంస్థకు చెప్పారు.

తెలంగాణలో 25 మంది పిల్లలు !

తెలంగాణలో 25 మంది పిల్లలు !

హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో 25 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్. పి. శ్రావన్ కుమార్ ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ వార్తా సంస్థకు చెప్పారు. కొందరు హైదరాబాద్ నుంచి, మరి కొందరు వివిద జిల్లాల నుంచి వచ్చి చికిత్స పొందుతున్నారని డాక్టర్ పి. శ్రావన్ కుమార్ తెలిపారు. పిల్లలు అందరూ కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకుంటారని, చికిత్సకు వారు పూర్తిగా సహరిస్తున్నారని, పిల్లలకు ఇంకా కరోనా వైరస్ వ్యాధి ముదరలేదని, త్వరలో వారిని డిశ్చార్జ్ చేసి ఇళ్లకు పంపిస్తామని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైద్య శాఖ అధికారులు తెలిపారు.

English summary
Coronavirus: At least 40 children in the age group of 3 to 17 years have tested positive for COVID-19 in Andhra Pradesh. Meanwhile, in Hyderabad, 25 children have tested positive for the virus and are recovering at the Telangana capital’s Gandhi Hospital. Officials of the Andhra and Telangana governments have said none of the children are serious, have only mild symptoms, are responding to treatment well and will be discharged soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X