వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా: అతి భారీ ఊరట -సున్నాకు పడిపోయిన మరణాలు -కొత్తగా 158 కేసులు -వ్యాక్సిన్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

కరోనా విలయకాలంలో దేశంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రాల జాబితాలో ఒకటిగా కొనసాగుతోన్న ఆంధ్రప్రదేశ్‌కు భారీ ఊరట లభించింది. కరోనా మరణాలు సున్నాకు పడిపోయాయి. టెస్టుల సంఖ్య తగ్గనప్పటికీ, కొత్త కేసులు తగ్గిపోతుండటం, రికవరీల సంఖ్య పెరుగుతుండటం శుభపరిణామాలుగా ఉన్నాయి. అయితే, వ్యాక్సిన్ వికటించి ఓ ఆరోగ్య కార్యకర్త చనిపోవడం విషాదంగా మారింది. వివరాల్లోకి వెళితే..

నిమ్మగడ్డ ఆశలన్నీ కలెక్టర్లపైనే -రేపు ఉ.10కి ఇలా జరిగితే జగన్‌పై పైచేయి -సుప్రీంలోనూ ఎస్ఈసీ పిటిషన్నిమ్మగడ్డ ఆశలన్నీ కలెక్టర్లపైనే -రేపు ఉ.10కి ఇలా జరిగితే జగన్‌పై పైచేయి -సుప్రీంలోనూ ఎస్ఈసీ పిటిషన్

కొత్తగా 158 కేసులు..

కొత్తగా 158 కేసులు..

ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 44,382 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 158 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,87,010కి చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల ఒక్క మరణం కూడా నమోదుకాలేదని బులిటెన్ లో పేర్కొన్నారు. తద్వారా మరణాల సంఖ్య 7,147గా కొనసాగుతోంది.

 కేవలం 1476 యాక్టివ్ కేసులు

కేవలం 1476 యాక్టివ్ కేసులు

కరోనా మహమ్మారి బారి నుంచి శనివారం 155 మంది పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో డిశ్చార్జిల సంఖ్య 8,78,387కు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,476కు పడిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,28,76,113 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. జిల్లాల వారీగా చూస్తే పశ్చిమగోదావరిలో కొత్తగా 24 కేసులు, విశాఖపట్నంలో 22, కృష్ణా జిల్లాలో 20 కొత్త కేసులు వచ్చాయి. ఇదిలా ఉంటే..

గుంటూరులో టీకా విషాదం....

గుంటూరులో టీకా విషాదం....

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురై, గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఆశా కార్యకర్త ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లాలోని తాడేపల్లి పీహెచ్‌సీ పరిధిలోని ఆరోగ్య కార్యకర్త (ఏఎన్‌ఎం)గా పనిచేస్తోనన గొట్టిముక్కల లక్ష్మి (38), ఆశ కార్యకర్త బొక్కా విజయలక్ష్మి (42)లు నెల 20న కోవిడ్‌ వ్యాక్సిన్ తీసుకున్నారు. తరువాత ఏఎన్‌ఎం లక్ష్మికి తలనొప్పి, ఫిట్స్‌ రాగా.. విజయలక్ష్మి తలనొప్పి, మగత, వాంతులు వంటి లక్షణాలతో స్పృహ కోల్పోయింది. దీంతో వారిద్దరినీ ఈ నెల 22న జీజీహెచ్‌లో చేర్చించారు. ఏఎన్ఎం లక్ష్మి కోలుకున్నప్పటికీ, విజయలక్ష్మి మాత్రం శనివారం రాత్రి బ్రెయిన్ డెడ్ కారణంగా చనిపోయారని, వ్యాక్సిన్ దుష్ప్రభావాలు కారణం కాదని అధికారులు ప్రకటించారు. మరోవైపు

Recommended Video

House site pattas programme extended till Jan 30 | Oneindia telugu
 టీకా పంపిణీ కేంద్రాల పెంపు

టీకా పంపిణీ కేంద్రాల పెంపు

ఏపీ వ్యాప్తంగా సోమవారం నుంచి వివిధ జిల్లాలో టీకా పంపిణీ కేంద్రాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి మండల కేంద్రంలో కనీసం ఒక టీకా కేంద్రం ఉండేవిధంగా చర్యలు తీసుకున్నారు. కొ-విన్‌ యాప్‌లో ఇప్పటికే తమ పేర్లను నమోదు చేసుకున్న ఆరోగ్య సిబ్బంది అందరికీ త్వరితగతిన టీకాలు వేసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో టీకా తీసుకున్న తర్వాత ఆరోగ్య కార్యకర్త మృతి చెందడంపై కేంద్రం సైతం ఆరా తీస్తోన్నట్లు సమాచారం.

నిమ్మగడ్డ ఎక్కడ? భయంతో రాత్రికి రాత్రే ప్రైవేటు వాహనంలో -సుప్రీం తీర్పును బట్టి మెరుపు సమ్మెనిమ్మగడ్డ ఎక్కడ? భయంతో రాత్రికి రాత్రే ప్రైవేటు వాహనంలో -సుప్రీం తీర్పును బట్టి మెరుపు సమ్మె

English summary
Andhra Pradesh''s COVID-19 count rose to 8.87 lakh as 158 fresh cases were reported in 24 hours ending 9 am on Sunday. No deaths were reported, but 155 coronavirus patients had recovered in the state in a day, the latest bulletin said. The active cases remained 1,476 after a total of 8,78,387 recoveries and 7,147 deaths, the bulletin said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X