వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా: ఒక్కరోజే 40 మంది బలి.. భారీగా కొత్త కేసులు.. తూర్పుగోదావరిలో డేంజర్ బెల్స్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో కరోనా టెస్టుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ కొత్త కేసులు భారీగా బయటపడుతున్నాయి. అదే సమయంలో మరణాల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతున్నది. ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా 2593 మంది వైరస్ బారిన పడ్డారు. కొత్త కేసులో ఇదొక రికార్డు. బుధ, గురువారాల్లో వరుసగా 2వేల పైచిలుకు కేసు నమోదు కావడం గమనార్హం. ప్రధానంగా తూర్పుగోదావరిలో కేసులు, మరణాలు ప్రమాదకరంగా ఉన్నాయి.

అనూహ్యం: జగన్ బాటలో మోదీ ఇలాకా.. ప్రధాని భార్యను తిట్టిన నోటితో ఇలా.. సాయిరెడ్డి శైలిలో.. అనూహ్యం: జగన్ బాటలో మోదీ ఇలాకా.. ప్రధాని భార్యను తిట్టిన నోటితో ఇలా.. సాయిరెడ్డి శైలిలో..

రాష్ట్రంలో కొత్తగా 2593 మందికి వైరస్ సోకగా.. అందులో ఇతర రాష్ట్రాలకు చెందినవాళ్లు కేవలం 9 మందే ఉన్నారు. లోకల్ వ్యక్తుల సంఖ్య 2,584. గురువారం నాటి కొత్త కేసులతో ఏపీ ట్యాలీ 38,044కు పెరిగింది. 50 శాతానికిపైగా రికవరీ రేటుతో 19,393మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. వారం రోజులుగా కొత్త కేసుల నమోదు భారీగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య 18,159కి పెరిగింది.

covid-19 in Andhra pradesh: 2584 new cases, 40 deaths registered, state tally crosses 38k

ఏపీలో కరోనా మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 40 మంది మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో8, ప్రకాశం 8, చిత్తూరు 5, కడప 4, అనంతపురం 3, గుంటూరు 3, నెల్లూరు 3, విశాఖపట్నం 3, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 492కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 22,304 శాంపిల్స్ సేకరించినట్లు ఏపీ ఆరోగ్య శాఖ తెలిపింది. టెస్టుల విషయంలో దేశంలోని టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న ఏపీలో ఇప్పటిదాకా 12.40లక్షల శాంపిల్స్ ను టెస్ట్ చేశారు.

అనూహ్యంగా కరోనా వ్యాప్తి: మళ్లీ రికార్డు.. కొత్తగా33వేల మందికి: 25వేలు బలి.. ఇంకా ఎన్నాళ్లీ గోస? అనూహ్యంగా కరోనా వ్యాప్తి: మళ్లీ రికార్డు.. కొత్తగా33వేల మందికి: 25వేలు బలి.. ఇంకా ఎన్నాళ్లీ గోస?

తాజా బులిటెన్ ప్రకారం తూర్పు గోదావరి జిల్లా గణాంకాలు ఒకింత ప్రమాదకరంగా ఉన్నాయి. గురువారం నమోదైన కొత్త కేసుల్లో 500 కేసులు ఇక్కడి నుంచే రావడం గమనార్హం. జిల్లాలో ఒక్క రోజే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓవరాల్ గా తూర్పులో 3862 కేసులు, 29 మరణాలు నమోదయ్యాయి. కరోనా ఎఫెక్టెడ్ జాబితాలో తొలి నుంచి టాప్ లో ఉన్న కర్నూలు జిల్లాలో గురువారం అత్యధికంగా 590 కేసులు వచ్చాయి. అన్ని జిల్లాల్లో కంటే ఎక్కువగా 114 మరణాలు చోటుచేసుకున్నాయిక్కడ.

English summary
record spike 2584 cases, 40 deaths in last 24 hours in Andhra pradesh. state covid-19 tally crossed 38000 mark as per health department latest bulletin
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X