వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా: కొత్తగా 161 కేసులు -తగ్గిన మరణాలు -కడపలో జీరో -రెండో రోజూ వ్యాక్సినేషన్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. మరణాల సంఖ్య ఆల్మోస్ట్ తగ్గింది. కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో కడప జిల్లాకు రిలీఫ్ లభించినట్లయింది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ రెండో రోజు కూడా సజావుగా సాగింది. వివరాల్లోకి వెళితే..

కామపిశాచి: 22ఏళ్లకే 11 పెళ్లిళ్లు -భార్య ముందే బాలికపై రేప్ -స్నేహితులతో సెక్స్‌కు ఒత్తిడి -లవ్లీ గణేశ్కామపిశాచి: 22ఏళ్లకే 11 పెళ్లిళ్లు -భార్య ముందే బాలికపై రేప్ -స్నేహితులతో సెక్స్‌కు ఒత్తిడి -లవ్లీ గణేశ్

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 36,091 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 161 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,85,985కి చేరింది. నిన్న ఒక్కరు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. తద్వారా కరోనాకు బలైనవారి సంఖ్య 7,140కి చేరింది. ఇక..

 covid-19 in ap: 161 new cases, one death in last 24 hrs, 2nd day vaccination

రాష్ట్రంలో డిశ్చార్జిల సంఖ్య స్వల్పంగా పడిపోయింది. కరోనా మహమ్మారి బారి నుంచి ఆదివారం మొత్తం 251 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రికవరీల సంఖ్య 8,76,949కు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1,896గా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,25,76,272 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు బులిటెన్ లో పేర్కొన్నారు...

రామ మందిరానికి విరాళాల వెల్లువ - 2రోజుల్లోనే రూ.100కోట్లు: అయోధ్య ట్రస్ట్ వెల్లడిరామ మందిరానికి విరాళాల వెల్లువ - 2రోజుల్లోనే రూ.100కోట్లు: అయోధ్య ట్రస్ట్ వెల్లడి

కొత్తగా వెలుగులోకి వచ్చిన కేసుల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 52 కేసులు నమోదయ్యాయి. వైఎస్సార్ కడప జిల్లాలో ఒక్క కేసు కూడా రాలేదు. గడిచిన 8 నెలల్లో కడప జిల్లాలో కొత్త కేసుల సంఖ్య సున్నాకు పడిపోవడం ఇదే తొలిసారి. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 35 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో..

రెండో రోజైన ఆదివారం కూడా రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా ముగిసింది. 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కరోనా వారియర్లకు టీకాలు అందించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగలేదని అధికారులు చెప్పారు. వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల‌కు వ్యాక్సిన్ వేస్తున్నారు. ఏపీలో తొలి ద‌శ‌లో మొత్తం 332 కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల‌కు వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఏపీకి మొత్తం 4.96 లక్షల డోసుల వ్యాక్సిన్ వచ్చిన విష‌యం తెలిసిందే.

English summary
In the latest health bulletin released by state health and medical department on Sunday, as many as 161 new coronavirus cases reported taking the total number of cases in the state to 8,85,985 while the number of deaths reported in last twenty-four hours is one in Chittoor district taking the total death toll to 7140.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X