వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా విలయం: కొత్తగా 22,018 కేసులు, ఒక్కరోజే 96 మరణాలు, తూర్పుగోదావరిలో ఉధృతి

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విలయం కొనసాగుతున్నది. కొత్త కేసులతోపాటు మరణాలు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే 2లక్షల మార్కును దాటిన యాక్టివ్ కేసులు ఇంకాపైపైకి పోతున్నాయి. ఏపీకి చెందిన రోగులను తెలంగాణలోకి రానీయకుండా చెక్ పోస్టుల వద్దఅడ్డుకుంటుండటంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి..

బంజరు భూమిలో బంగారం: ఏపీ మహిళా రైతు రమకు ప్రధాని మోదీ ప్రశంసలు - PM Kisan రూ.19 వేల కోట్లు విడుదలబంజరు భూమిలో బంగారం: ఏపీ మహిళా రైతు రమకు ప్రధాని మోదీ ప్రశంసలు - PM Kisan రూ.19 వేల కోట్లు విడుదల

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్ వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 89,087 నమూనాలను పరీక్షించగా.. 22,018 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 13,88,803కి చేరింది. తూర్పు గోదావరి జిల్లాలో కొత్త కేసుల ఉధృతి కొనసాగుతున్నది. ఇవాళ కూడా అక్కడ గరిష్టంగా 3432కేసులు వచ్చాయి. చిత్తూరు జిల్లాలో 2708, అనంతపురం 2213, విశాఖపట్నం 2200 కొత్త కేసులు వచ్చాయి.

గడిచిన 24 గంటల్లో కొవిడ్‌ బారినపడి 96 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 9,173కు పెరిగింది. జిల్లాల వారీగా చూస్తే, అనంత‌పురంలో 11 మంది, తూర్పు గోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి, విశాఖ‌ప‌ట్నంలో 10 మంది చొప్పున‌, విజ‌య‌న‌గ‌రంలో 9 మంది, చిత్తూరు, కృష్ణ‌లో 8 మంది చొప్పున‌, గుంటూరు, నెల్లూరులో ఏడుగురు చొప్పున‌, క‌ర్నూలు, శ్రీ‌కాకుళంలో ఆరుగురు చొప్పున‌, క‌డ‌ప‌లో న‌లుగురు మృత్యువాత‌ప‌డ్డారు.

viral video: ఆ గుండె ఆగింది -కరోనాతో 'లవ్ యూ జిందగీ’ యువతి మృతి -జీవితం అన్యాయం చేసిందన్న సోనూ సూద్viral video: ఆ గుండె ఆగింది -కరోనాతో 'లవ్ యూ జిందగీ’ యువతి మృతి -జీవితం అన్యాయం చేసిందన్న సోనూ సూద్

ఇవాళ ఒక్కరోజే 19,177 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జీల సంఖ్య 11,75, 843కు పెరిగింది. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,03,787గా ఉంది. కొవిడ్ బారినపడిన కొందరు ఆంధ్రప్రదేశ్ వాసులు చికిత్స కోసం తెలంగాణకు వస్తుండగ, సరిహద్దుల్లో ఆంబులెన్స్‌లను ఆపడం వివాదాస్పదమైంది. ఆంబులెన్స్‌లను ఆపొద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టంగా చెప్పినా, తెలంగాణ ప్రభుత్వం సాంకేతికంగా గైడ్‌లైన్స్‌ పెట్టిందని ఏపీ సర్కారు మండిపడింది.

English summary
Andhra Pradesh reported more than 20,000 fresh cases of coronavirus for the fourth consecutive day on Friday, while 19,177 patients had recovered and another 96 succumbed to the infection. The latest bulletin said 22,018 positive cases turned out from 89,087 tests in the 24 hours ending 9 am today, taking the infection count to 13,88,803. The number of active cases increased to 2,03,787 after a total of 11,75,843 recoveries and 9,173 deaths. The overall infection positivity rate climbed to 7.81 per cent after 1.77 crore tests while the case fatality rate remained stable at 0.66 per cent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X