వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా: 7లక్షలకు కేసులు, 5,828 మరణాలు - కొత్తగా 6,133 మందికి ఇన్ఫెక్షన్ -తూర్పులో టెన్షన్

|
Google Oneindia TeluguNews

కొవిడ్ బాధిత రాష్ట్రాల జాబితాలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో భారీగా చేపడుతోన్నటెస్టులకు అనుగుణంగా కొత్త కేసులూ అదే స్థాయిలో వస్తున్నాయి. అయితే, గడిచిన నెల రోజులతో పోల్చుకుంటే, ఈ వారం కొత్తగా ఇన్ఫెక్షన్ కు గురవుతోన్న వారి సంఖ్య తగ్గుముఖంపట్టింది. అదే సమయంలో డిశ్చార్జీల సంఖ్య భారీగా పెరిగింది. మరణాలు సైతం కంట్రోల్ లోకి వస్తుండటం శుభపరిణామం.

సీబీఐకి భారీ షాక్: 40వేల సాక్ష్యాలు, 100 ఆడియో, వీడియో టేపులు నిరాధారం - తీర్పుపై సవాలు దిశగాసీబీఐకి భారీ షాక్: 40వేల సాక్ష్యాలు, 100 ఆడియో, వీడియో టేపులు నిరాధారం - తీర్పుపై సవాలు దిశగా

కొత్తగా 6,133 కేసులు

కొత్తగా 6,133 కేసులు

రాష్ట్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,133 పాజిటివ్ కేసులు, 48 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 7లక్షలకు చేరువగా, 6,93,484కు పెరిగింది. అన్ని జిల్లాల్లో కలిపి కరోనా కాటుకు బలైపోయినవారి సంఖ్య 5,828కి చేరింది. గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఎనిమిది మంది, ప్రకాశంలో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ఐదు, విశాఖపట్నం ఐదు, అనంతపురం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున, కడపలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

బీజేపీ ‘మహా'ఎత్తుగడ:బీహార్ ఎన్నికల ఇంచార్జ్‌గా ఫడ్నవిస్ - సీట్ల పంపకంపై లొల్లి -ఎన్డీఏ, యూపీఏ ఇలాబీజేపీ ‘మహా'ఎత్తుగడ:బీహార్ ఎన్నికల ఇంచార్జ్‌గా ఫడ్నవిస్ - సీట్ల పంపకంపై లొల్లి -ఎన్డీఏ, యూపీఏ ఇలా

భారీగా డిశ్చార్జిలు..

భారీగా డిశ్చార్జిలు..

ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 71,806 శాంపిళ్లను పరీక్షించారు. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 58.06లక్షలకు చేరింది. కొత్త కేసుల సంఖ్య తగ్గుతుండటంతోపాటు ఏపీలో డిశ్చార్జీల సంఖ్య పెరగడం గమనార్హం. ఇవాళ ఒక్కరోజే 7,075 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 6.93లక్షల కేసులకుగానూ ఇప్పటికే 6.29లక్షల మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 58,445గా ఉంది.

తూర్పులో అదే టెన్షన్..

తూర్పులో అదే టెన్షన్..

ఏపీలో కరోనా బాధిత జిల్లాల్లో టాప్ లో ఉన్న తూర్పు గోదావరిలో పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. జిల్లాలో కొత్తగా 983 కేసులు, ఐదు మరణాలు నమోదయ్యాయి. తూర్పులో మొత్తం కేసులు 97,174కాగా, మరణాల సంఖ్య 524గా ఉంది. ఇక సెకండ్ మోస్ట్ ఎఫెక్టెడ్ జిల్లా చిత్తూరులో కొత్తగా 925 కేసులు, ఎనిమిది మరణాలు నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం కేసులు 61,858కాగా, మరణాల సంఖ్య 655. ఇతర జిల్లాల్లో అత్యధికంగా అనంతపురంలో 580, గుంటూరు 498, పశ్చిమ గోదావరిలో 464కొత్త కేసులు వచ్చాయి.

Recommended Video

#BabriMasjidVerdict : మసీదు దానికదే కూలిందా? హిట్ అండ్ రన్ కేసు : Prakash Raj || Oneindia Telugu

English summary
Andhra Pradesh on wednesday reported 6,133 new Covid-19 cases, 7,075 recoveries and 48 deaths in the last 24 hours, taking total positive cases to 6,93,484, including 6,29,211 recoveries, 58,445 active cases & 5,828 deaths according to State Health Department bulletin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X