విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో కరోనా: భారీగా తగ్గిన కొత్త కేసులు - ఒక్కరోజే 80 మృతి - అగ్నిప్రమాదం ఘటనలో అరెస్టులు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో గడిచిన వారం రోజులుగా భయానక రీతిలో ఏరోజూ కొత్త కేసులు పదివేలు తక్కువ కాకుండా నమోదవుతూరాగా, తాజా ప్రకటనలో మాత్రం కొత్త కేసుల సంఖ్యలో భారీ తగ్గుదల చోటుచేసుకుంది. వైద్య శాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,665 కేసులు, 80 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2.35లక్షలకు, మొత్తం మరణాల సంఖ్య 2116కు పెరిగింది. మరోవైపు విజయవాడ అగ్నిప్రమాద ఘటనలో పోలీసులు అరెస్టులకు దిగారు.

ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్‌: గుడ్‌న్యూస్ - 2020లోనే వస్తుందన్న సీరం సీఈవో - ఫైనల్ ధర ఎంతంటే..ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్‌: గుడ్‌న్యూస్ - 2020లోనే వస్తుందన్న సీరం సీఈవో - ఫైనల్ ధర ఎంతంటే..

ఎందుకు తగ్గాయంటే..

ఎందుకు తగ్గాయంటే..


గడిచిన కొద్ది రోజులుగా ప్రతిరోజూ 60వేల పైచిలుకు టెస్టులు నిర్వహిస్తోన్న ప్రభుత్వం.. ఆదివారం సిబ్బంది తక్కువగా ఉండటంతో కేవలం 47వేల శాంపిళ్లను మాత్రమే పరీక్షించారు. ఈ కారణంగానే కొత్త కేసుల నమోదులో తగ్గుదల కనిపించింది. ఇప్పటిదాకా మొత్తం 25.34లక్షల కరోనా టెస్టులు చేసినట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో డిశ్చార్జీల సంఖ్య(6,924) కూడా భారీగానే ఉంది. ఏపీలో వ్యాధి నుంచి కోలుకున్నవాళ్ల సంఖ్య 1.45లక్షలుకాగా, యాక్టివ్ కేసులు 87,773గా ఉన్నాయి.

కొత్త జిల్లాలపై జగన్ సర్కారు ట్విస్ట్ - రాత్రికిరాత్రే జీవో సవరణ - సవాళ్లు - ఏపీలో కేసీఆర్ ఫార్ములా?కొత్త జిల్లాలపై జగన్ సర్కారు ట్విస్ట్ - రాత్రికిరాత్రే జీవో సవరణ - సవాళ్లు - ఏపీలో కేసీఆర్ ఫార్ములా?

జిల్లాల వారీగా లెక్కలు..

జిల్లాల వారీగా లెక్కలు..

కేసులు, మరణాల పరంగా ఉభయగోదావరి జిల్లాల్లో పరిస్థితి ప్రమాదకర పరిస్తితితులు కొనసాగుతున్నాయి. తూర్పులో అధ్యధికంగా 1235 కేసులు, నాలుగు మరణాలు నమోదుకాగా, పశ్చిమలో 722 కొత్త కేసులు, తొమ్మిది మరణాలు చోటుచేసుకున్నాయి. మిగతా జిల్లాల్లో గత 24 గంటల్లో నమోదైన కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి.. అనంతపురం(631కొత్త కేసులు, 5 మరణాలు), చిత్తూరు(479- 6), గుంటూరు (621 - 10), కడప (439 - 7), కృష్ణా(146 - 0), కర్నూలు (883 - 6), నెల్లూరు (511 - 5), ప్రకాశం (450 - 11), శ్రీకాకుళం(354 - 7), విశాఖపట్నం(620 - 5), విజయనగరం జిల్లాలో కొత్తగా 574కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే,

రమేశ్ ఆస్పత్రి బాధ్యుల అరెస్టు..

రమేశ్ ఆస్పత్రి బాధ్యుల అరెస్టు..

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విజయవాడ కొవిడ్ సెంటర్ అగ్నిప్రమాదం ఘటనలో సోమవారం అరెస్టుల పర్వం చోటుచేసుకుంది. కోవిడ్ కేర్ సెంటర్ కోసం స్వర్ణ ప్యాలెస్ తో ఒప్పందం కుదుర్చుకున్న రమేష్ ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కొడాలి రాజగోపాల్ రావు తోపాటు జనరల్ మేనేజర్ కూరసాటి సుదర్శన్ ,నైట్ షిఫ్ట్ మేనేజర్ పొల్లబోతు వెంకటేష్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందడం తెలిసిందే.

English summary
andhra pradesh on monday reported 7,665 COVID-19 cases and 80 deaths according to state health department bulletin. aap's tally increased to 2,35,525, the death-toll climbed to 2116. three arrested in vijayawada covid care center fire accident case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X