వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా: పెరిగిన వైరస్ వ్యాప్తి -కొత్తగా 70 కేసులు, ఒకరి మృతి -కనిష్టానికి యాక్టివ్ కేసులు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారికి సంబంధించి తాజా గణాంకాలు ఒకింత ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సోమవారం నాటి బులిటెన్ లో కొత్త కేసుల సంఖ్య 41గా ఉంది.

జగన్ ఆదాయం రోజుకు 300 కోట్లు -ప్రధానికీ డబ్బు కావాలి -మనుషులకే పుట్టామా? -కాల్చిపారేయాలి: జేసీజగన్ ఆదాయం రోజుకు 300 కోట్లు -ప్రధానికీ డబ్బు కావాలి -మనుషులకే పుట్టామా? -కాల్చిపారేయాలి: జేసీ

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 28,268 శాంపిళ్లను టెస్టు చేయగా, 70 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,89,409కి పెరిగింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 18 కొత్త కేసులు వెలుగు చూశాయి. విశాఖ జిల్లాలో 9, తూర్పు గోదావరి జిల్లాలో 9 కేసులు గుర్తించారు. కర్నూలు జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. కడప జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.

covid-19 in ap: 70 new cases, one death in last 24 hrs, tally goes up to 8,89,409

కరోనా మహమ్మారి కాటుకు తాజాగా విశాఖపట్నం జిల్లాలో ఒక మరణం నమోదైంది. ఏపీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,168కి చేరింది. మరోవైపు, రాష్ట్రంలో డిశ్చార్జీల సంఖ్య కూడా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 84 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. తద్వరా మొత్తం రికవరీల సంఖ్య 8,81,666కు పెరిగింది.

వాలంటీర్ వ్యవస్థ రద్దుకు డిమాండ్ -అంతలోనే సీఎం జగన్ కీలక ఆదేశాలు -ఇక ప్రపంచ స్థాయిలో..వాలంటీర్ వ్యవస్థ రద్దుకు డిమాండ్ -అంతలోనే సీఎం జగన్ కీలక ఆదేశాలు -ఇక ప్రపంచ స్థాయిలో..

ప్రస్తుతానికి యాక్టివ్ కేసుల సంఖ్య కనిష్టంగా 575కి తగ్గింది. ఏపీలో ఇప్పటివరకు 1కోటి 37లక్షల 75వేల 253 శాంపిళ్లను పరీక్షించినట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ కరోనా కొత్త వేరియంట్లు బయటపడుతుండగా, ఏపీ యంత్రాంగం అప్రమత్తమైంది.

English summary
Andhra Pradesh reported 70 fresh COVID-19 cases, 84 recoveries and one death in the 24 hours ending 9 am on Tuesday.With the addition of the new infections, the tally went up to 8,89,409,according to the latest bulletin. Recoveries rose to 8,81,666,while the toll mounted to 7,168, it said. The active cases now stood at 575, it added. Chittoor once again reported the highest number of 18 new cases while all other districts added less than 10 each. Visakhapatnam reported one COVID-19 fatality in a day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X