వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా: మళ్లీ పెరిగింది - కొత్తగా 9,597 కేసులు, 93 మరణాలు - చిత్తూరులో భయానకం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ గడిచిన రెండ్రోజులతో పోల్చుకుంటే కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్లీ పెరిగింది. మరణాల సంఖ్య కూడా భారీగా నమోదవుతున్నది. వైద్య శాఖ బుధవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,597 కేసులు, 93 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2.54 లక్షలకు, మొత్తం మరణాల సంఖ్య 2,296కు పెరిగింది.

గడిచిన 24 గంటల్లో 57,148 శాంపిల్స్ ను పరీక్షించామన్న ప్రభుత్వం.. మొత్తం టెస్టుల సంఖ్య 26.49లక్షలుగా ఉన్నట్లు తెలిపింది. రికవరీల పరంగా రాష్ట్రం మెరుగ్గా ఉందని, బుధవారం ఒక్కరోజే 6,676 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని, మొత్తంగా 1.61లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారని, యాక్టివ్ కేసుల సంఖ్య 90,425గా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు.

కేసులు, మరణాల పరంగా కొద్ది రోజులుగా ఉభయగోదావరి జిల్లాల్లో పరిస్థితి ప్రమాదకరంగా ఉండగా, ఇప్పుడా సీన్ చిత్తూరులోనూ నెలకొంది. చిత్తూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1235 కొత్త కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. తూర్పు గోదావరిలో అత్యధికంగా 1332 కొత్త కేసులు, ఐదు మరణాలు నమోదయ్యాయి. పశ్చిమగోదావరిలో 929 కొత్త కేసులురాగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఈసీ సంచలన నిర్ణయం - షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు - సీఎంకు అసలైన 5 సవాళ్లివే..ఈసీ సంచలన నిర్ణయం - షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు - సీఎంకు అసలైన 5 సవాళ్లివే..

covid-19 in ap: 9,597 new cases, 93 deaths reported, state tally reaches to 2.54 lakh

మిగతా జిల్లాల్లో గత 24 గంటల్లో నమోదైన కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి.. అనంతపురం(781కొత్త కేసులు, 7 మరణాలు), గుంటూరు (762 - 13), కడప (364 - 7), కృష్ణా(335 - 2), కర్నూలు (781 - 4), నెల్లూరు (723 - 10), ప్రకాశం (454 - 11), శ్రీకాకుళం(511 - 9), విశాఖపట్నం(797 - 6), విజయనగరం జిల్లాలో కొత్తగా 593కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే,

వైఎస్సార్ చేయూత లెక్కల్లో బొక్కలివిగో - కష్టాలు వినాశనానికి కాదు - నారా లోకేశ్ గెలుపు సూత్రాలువైఎస్సార్ చేయూత లెక్కల్లో బొక్కలివిగో - కష్టాలు వినాశనానికి కాదు - నారా లోకేశ్ గెలుపు సూత్రాలు

Recommended Video

AP CM YS Jagan Launches YSR Cheyutha Scheme || Oneindia Telugu

విజయవాడలోని కొవిడ్ సెంటర్ అగ్నిప్రమాదం ఘటనకు సంబంధించి రమేశ్ ఆస్పత్రి యజమాని రమేశ్ బాబు, స్వర్ణ ప్యాలెస్ హోటల్ యజమాని శ్రీనివాసరావు పరారయ్యారు. అగ్నిప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

English summary
andhra pradesh on wednesday reported 7,665 COVID-19 cases and 93 deaths according to state health department bulletin. ap's tally increased to 2,54,146. the death-toll climbed to 2,296. after east godavari, now, chittoor become hot spot for virus spread.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X