వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా: జగన్ సర్కారు సక్సెస్ - పెరిగిన రికవరీలు - కొత్తగా 3,746 కేసులు -10 రోజుల స్పెషల్ డ్రైవ్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్ కేసులను, మరణాలను తగ్గించటంలో ప్రభుత్వం విజయం సాధించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వెల్లడించారు. ఇప్పటికే 94.9 శాతం రికవరీ రేటుతో ఏపీ దేశంలోనే టాప్ లో నిలిచింది. కొవిడ్-19 కేసులు, మరణాలకు సంబంధించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం వెలువరించిన బులిటెన్ లోనూ ఇది ప్రస్పుటమైంది.

మూసీ నదికి సర్కార్ శాంతి పూజలు - 1908నాటి నిజాం తరహాలో - 10 రోజుల్లో 101 చెరువులకు గండ్లుమూసీ నదికి సర్కార్ శాంతి పూజలు - 1908నాటి నిజాం తరహాలో - 10 రోజుల్లో 101 చెరువులకు గండ్లు

 స్వల్పంగా పెరిగిన కేసులు..

స్వల్పంగా పెరిగిన కేసులు..

ఏపీ ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,746 కేసులు, 27 మరణాలు నమోదయ్యాయి. మంగళవారం 3503 కేసులురాగా, ఇవాళ 243కేసులు ఎక్కువ రావడం గమనార్హం. అయితే రికవరీలు భారీగా ఉండటం ఉపశమనం కలిగిస్తున్నది. కొత్త వాటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 7,93,299కు, మొత్తం మరణాల సంఖ్య 6508కి చేరాయి.

 రికవరీలు పెరిగాయి..

రికవరీలు పెరిగాయి..

ఏపీలో గడిచిన 24 గంటల్లో మొత్తం 74,422 శాంపిళ్లను టెస్టు చేశారు. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 72.71లక్షలకు చేరింది. బుధవారం ఒక్కరోజే 4,739 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తద్వారా వ్యాధి నుంచి కోలుకున్నవాళ్ల సంఖ్య 7,54,415కు పెరిగింది. ప్రస్తుతం 32,376 మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, కరోనా పాజిటివ్‌ రేటు 10.91శాతానికి పడిపోయిందని అధికార వర్గాలు తెలిపాయి.

 జిల్లాల వారీగా ఇలా..

జిల్లాల వారీగా ఇలా..

గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఐదుగురు, అనంతపురంలో ముగ్గురు, చిత్తూరులో ముగ్గురు, తూర్పు గోదావరిలో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, కడపలో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మృత్యువాత పడ్డారు. కొత్త కేసుల పరంగా తూర్పుగోదావరిలో అత్యధికంగా 677, పశ్చిమగోదావరిలో 519, కృష్ణా జిల్లాలో 503, చిత్తూరు 437, గుంటూరు 396, అనంతపురం 301, శ్రీకాకుళం జిల్లాలో 167 కేసులు వచ్చాయి.

 10 రోజులపాటు స్పెషల్ డ్రైవ్..

10 రోజులపాటు స్పెషల్ డ్రైవ్..

కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో 10 రోజులపాటు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు బుధవారం నుంచి అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా సీఎస్‌ నీలం సాహ్ని విజయవాడలో భారీ ర్యాలీని ప్రారంభించారు. ఈ నెల 31 వరకు కొనసాగనున్న కార్యక్రమంలో ఆరోగ్యశాఖ సిబ్బంది అన్ని చోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

జగన్‌పై మోదీకి ఫిర్యాదు - 18 నెలల కుదుపు - 2021లెక్కలే కీలకం - బీమా మెలిక చూశారా?: ఎంపీ రఘురామజగన్‌పై మోదీకి ఫిర్యాదు - 18 నెలల కుదుపు - 2021లెక్కలే కీలకం - బీమా మెలిక చూశారా?: ఎంపీ రఘురామ

English summary
The cumulative confirmed cases of coronavirus increased to 7,93,299 in Andhra Pradesh as 3,746 were added afresh on Wednesday. As 27 more patients died. Chief Secretary Neelam Sahni has said that the government has succeeded in reducing the number of positive cases and the number of deaths due to covid-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X