బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబుకు కరోనా - ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరుకు - మెరుగైన చికిత్స కోసం

|
Google Oneindia TeluguNews

దేశంలోనే అత్యధిక యాక్టివ్ కేసులున్న రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వరుసగా ఇన్ఫెక్షన్ కు గురవుతున్నారు. ఈ క్రమంలోనే అధికార వైసీపీకి చెందిన పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు కూడా వైరస్ సోకింది. తొలుత కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన.. మెరుగైన వైద్యం కోసం ఆదివారం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బెంగళూరు వెళ్లిపోయారు.

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారి విజయ్ శేఖర్ శనివారం వెల్లడించారు. టెస్టులు వచ్చిన కొద్దిసేపటికే ఎమ్మెల్యే దొరబాబు కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. తనకు పాజిటివ్‌ వచ్చిందని స్వయంగా ప్రకటించిన ఆయన.. ఇటీవల తనను కలిసిన వారందరూ టెస్టు చేయించుకోవాలని సూచించారు. దొరబాబుకు కొవిడ్‌ రావడంతో సీఎం జగన్‌ ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా,

కామోన్మాదంతో కరోనా రోగిపై రేప్ - 108 అంబులెన్స్‌‌లో డ్రైవర్ అకృత్యం - చివరికి ఏమైందంటే..కామోన్మాదంతో కరోనా రోగిపై రేప్ - 108 అంబులెన్స్‌‌లో డ్రైవర్ అకృత్యం - చివరికి ఏమైందంటే..

covid-19: Pitapuram YSRCP MLA Dorababu Airlifted to Bengaluru

దొరబాబును ఆయన కుటుంబీకులు ఆదివారం హెలికాప్టర్‌లో బెంగళూరు తరలించారు. కాకినాడలోని జిల్లా ఎస్పీ కార్యాలయం హెలిప్యాడ్‌ నుంచి దొరబాబు బెంగళూరుకు పయనమయ్యారు. దొరబాబు వెంట ఆయన భార్యతో పాటు మరో ఇద్దరు బంధువులు హెలికాప్టర్‌లో వెళ్లారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను బెంగళూరు తీసుకెళ్లారు. బెంగళూరులో దొరబాబు సమీప బంధువుల ఆస్పత్రి ఉండటంతో ఆయన్ను అక్కడికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

అబద్ధం నడిచొస్తే చంద్రబాబులా - ఇలాంటి చరిత్రహీనుడు ఎవర్ ఆఫ్టర్ - విజయసాయిరెడ్డి ఫైర్అబద్ధం నడిచొస్తే చంద్రబాబులా - ఇలాంటి చరిత్రహీనుడు ఎవర్ ఆఫ్టర్ - విజయసాయిరెడ్డి ఫైర్

covid-19: Pitapuram YSRCP MLA Dorababu Airlifted to Bengaluru

దొరబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. గడిచిన మూడు వారాలుగా ప్రతిరోజూ 1000కి తక్కువ కాకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం నాటికి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 66,948కి పెరిగింది. కరోనా వల్ల తూర్పుగోదావరిలో మొత్తం 427 మంది ప్రాణాలు కోల్పోయారు.

English summary
Pitapuram YSRCP MLA Dorababu, who was testede positive for coronavirus yesterday, has airlifted to Bengaluru from Kakinada in a Special Helicopter to join him in a Corporate hospital there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X