వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు సంచలన వీడియో.. జగన్ సర్కారు బాగోతం ఇదంటూ ఫైర్.. చేతల్లో చూపాలని సవాల్..

|
Google Oneindia TeluguNews

''ట్యాబ్లెట్లు కావాలని మూడు రోజులుగా అడుగుతున్నాం. ఇక్కడున్న వాళ్లలో చాలా మందికి బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంది. ఎన్ని సార్లు అడిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. చనిపోయినవాళ్ల విషయంలోనూ మీరు ఇలాగే వ్యవహరించారు. ఆలస్యం అవుతోన్న అన్నం కూడా పెట్టట్లేదు. బయటి నుంచి భోజంన తెచ్చుకుందామంటే సెక్యూరిటీ వాళ్లు లంచం అడుగుతున్నారు. క్వారంటైన్ సెంటర్లో ఒక్కో పేషెంటు మీద ప్రభత్వం వేల రూపాయలు ఖర్చు చేస్తోంది. టాయిలెట్ కు పోదామంటే బకెట్లు కూడా లేవు. క్వారంటైన్ లో పెట్టి మమ్మల్ని చంపేస్తారా?'' అంటూ పేషెంట్ల ఆందోళన..

కొవిడ్-19: హైదరాబాద్‌లో హైరిస్క్ జోన్లు ఇవే.. 100కుపైగా కంటైన్మంట్లకు అధికారుల కసరత్తు..కొవిడ్-19: హైదరాబాద్‌లో హైరిస్క్ జోన్లు ఇవే.. 100కుపైగా కంటైన్మంట్లకు అధికారుల కసరత్తు..

''బాబూ.. మమ్మల్నేం చేయమంటారు? ఈ సెంటర్లలో ఒకవైపు 140 మంది, మరోవైపు 50 మంది పేషెంట్లు ఉన్నారు. అందరి బాగోగులూ నేనొక్కదాన్నే చూసుకోవాలి. నాక్కూడా భార్త, పిల్లలు ఉన్నారు. శక్తికి మించి పని చేస్తున్నాం. అడ్మినిస్ట్రేషన్ మమ్మల్ని పట్టించుకోకుంటే నేనేం చేయాలి. అలాంటిది మీరు మా మీద ఫైర్ కావడం ఎంతవరకు కరెక్టో ఆలోచించండి.. '' అంటూ సిబ్బంది వివరణ.. ఆంధ్రప్రదేశ్ లో కరోనా క్వారంటైన్ సెంటర్లలో వాస్తవ పరిస్థితికి అద్దంపట్టే దృశ్యాలివీ అంటూ ప్రతిపక్షనేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు షేర్ చేసిన ఈ వీడియో సంచలనంగా మారింది. కరోనా కట్టడికి వేల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తూ, జగన్ సర్కారు చేస్తోన్న బాగోతమిదీ అంటూ టీడీపీ శ్రేణులు ఈ వీడియోను వైరల్ చేశారు.

covid-19: tdp chief chandrababu slams cm jagan over facilities at quarantine centre

ఏదైనా అనుకోని ఆపద వస్తే ప్రభుత్వం ఆదుకుంటుంది కదా అనే భరోసా ప్రజలకు కల్పించాలని, అయితే, ప్రస్తుతం రాష్ట్రంలోని కరోనా క్వారంటైన్ కేంద్రాలలోని పరిస్థితులు చూస్తే ప్రజల్లో ఆందోళన, అభద్రతా భావం పెంచేలా ఉన్నాయని చంద్రబాబు మండిపడ్డార. వాస్తవాలు ఇలా ఉంటే.. ప్రభుత్వం మాత్రం కరోనా కట్టడికి భారీగా ఖర్చుపెడుతున్నాం అని లెక్కలు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు.

Recommended Video

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు, టీపీసీసీ కార్యదర్శి జీ నరేందర్ యాదవ్ కరోనా వైరస్‌కు బలి!

''క్వారంటైన్ సెంర్లలో సౌకర్యాల కోసం కోట్లు ఖర్చుపెడుతున్నామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. అలాంటప్పుడు వాస్తవ పరిస్థితులు ఎందుకింత దారుణంగా ఉంటున్నాయి? పేషంట్ల పేరు చెప్పి అవినీతికి పాల్పడుతున్నారా? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఏంటి? అక్షయ లాంటి సంస్థలతో కలిసి అన్న క్యాంటీన్ లను ఎంతో ఘనంగా నిర్వహించాం. పనితనం మాటల్లో, ప్రకటనల్లో కాదు చేతల్లో చూపించండి'' అని జగన్ సర్కారుపై చంద్రబాబు మండిపడ్డారు.

English summary
ex-cm, tdp chief chandrababu criticizes ysrcp govt and cm ys jagan over facilities at quarantine centre across the state. chandrababu allegges that govt is spendig huge money but fails to protect people
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X