విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో తుది దశకు కరోనా పరీక్షలు- త్వరలో మూడో దశ సర్వే..

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఇప్పటివరకూ గుర్తించిన కరోనా వైరస్ బాధితులకు వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ తుది దశకు చేరుకుంటోంది. వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు ఢిల్లీ మర్కజ్ బాధితులు కూడా ఉన్నారు. వీరి నుంచి వైరస్ సోకిన ప్రాథమిక కాంటాక్టులకు పరీక్షల నిర్వహణ ఇప్పుడు కొనసాగుతోంది. ఇవాళ్టి నుంచి కోవిడ్ 19 ర్యాపిడ్ కిట్లు కూడా అందుబాటులోకి రావడంతో మరింత త్వరగా ఈ పరీక్షలు పూర్తి చేసి మిగిలిన వారిని గుర్తించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేయనుంది.

 ఏపీలో తుది దశకు కరోనా పరీక్షలు..

ఏపీలో తుది దశకు కరోనా పరీక్షలు..


ఏపీలో కరోనా వైరస్ బాధితులకు నిర్వహిస్తున్న పరీక్షలు తుది దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటివరకూ ఢిల్లీతో పాటు విదేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించగా.. తాజాగా వారి ప్రైమరీ కాంటాక్టులకు కూడా పరీక్షల నిర్వహణ జోరుగా సాగుతోంది. ఇవాళ్టి నుంచి కోవిడ్ 19 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి రావడంతో అతి త్వరలో వీరికి పరీక్షలు పూర్తవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

మూడోసారి సర్వే

మూడోసారి సర్వే

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం గుర్తించిన కరోనా వైరస్ బాధితులకు పరీక్షలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో.. వీరి నుంచి ఇంకా ఎవరికైనా వైరస్ సోకిందేమో గుర్తించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఇంటింటి సర్వేను మూడో దశ కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. వాలంటీర్ల సాయంతో మరోసారి ఇంటింటికి వెళ్లి జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

 కిట్ల రాకతో మరింత వేగంగా..

కిట్ల రాకతో మరింత వేగంగా..


ఏపీలో ఇప్పటివరకూ కరోనా పరీక్షల నిర్వహణ ఓ ఎత్తయితే ఇవాళ్టి నుంచి మరో ఎత్తుగా చెప్పవచ్చు. ఇవాళ్టి నుంచి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి రావడంతో వైద్యుల పని మరింత సులువు కానుంది. ప్రస్తుతానికి రోజుకు రెండు వేల కిట్లు తయారవుతుండగా..ఈ వారాంతానికి వీటి సంఖ్య రోజుకు 10 వేలకు చేరుకోనుంది. మే నెల మొదటి వారానికి 25 వేలకు చేరుకుని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కూడా చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అలాగే కోవిడ్ 19లో సీరియస్ కేసుల విషయంలో వాడే వెంటిలేటర్లను కూడా భారీ ఎత్తున తయారీకి విశాఖ మెడ్ టెక్ జోన్ లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక రోజుకు 10 వేల పర్సనల్ ఎక్విప్ మెంట్ కిట్లు కూడా అందుబాటులోకి రానుండటంతో పరిస్ధితి మరింత మెరుగుపడనుంది.

English summary
coronavirus diagnosis tests are coming to final stage in andhra pradesh as state govt plans for next stage of door to door survey with volunteers soon. covid 19 rapid testing kits are also made available for doctors in the state from today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X