• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీ కరోనా: కొవ్వూరులో విషాదం - వైరస్‌కు తండ్రి బలి - ఆదరణలేక గోదావరిలో దూకిన కుటుంబం

|

చేతికి ఎదిగొచ్చిన పిల్లలు, సర్దుకుపోయే భార్య, వాళ్లనే సర్వస్వంగా భావించే తండ్రి.. హ్యాపీగా సాగిపోతోన్న ఆ ఫ్యామిలీ జర్నీ అనూహ్య మలుపులతో విషాదాంతంగా ముగిసింది. కరోనా మహమ్మారి వాళ్ల జీవితాలను డెడ్ ఎండ్ వైపునకు తీసుకెళ్లింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో చోటుచేసుకున్న ఈ విషాద సంఘటనపై స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాలివి..

కొవ్వూరు మండలం పసివేదల గ్రామానికి చెందిన నరసయ్య వ్యవసాయం చూస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతనికి భార్య సునీత(50), కొడుకు ఫణికుమార్(25), కూతురు అపర్ణ(23) ఉండేవారు. తెలియకుండానే ఆయనకు కరోనా సోకింది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో చికిత్సలేవీ పనిచేయలేదు. ఈ నెల 16న(శనివారం) నర్సయ్య తుదిశ్వాస విడిచాడు.

రామ్ పోతినేనికి వైసీపీ బెదిరింపులు - కుల కరోనాపైనా చంద్రబాబు - రాయపాటి శైలజ షాకింగ్ కామెంట్స్

ఒక్కగానొక్క ఆధారాన్ని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో మునిగిపోయిన ఆ కుటుంబానికి ఆదరణ కరువైంది. కరోనా సోకుతుందనే భయంతో బంధువులుగానీ, స్నేహితులుగానీ, చుట్టుపక్కలవాళ్లుగానీ కనీసం వాళ్లను పలకరించిన పాపానపోలేదు. పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురై చివరికి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.

covid-19 tragedy: father dies of virus, family jupmed into godavari, incident at Kovvur

నర్సయ్య మరణాన్ని తట్టుకోలేకపోయిన భార్య, కొడుకు, కూతురు.. రైల్వే బ్రిడ్జి పై నుంచి గోదావరిలోకి దూకినట్లు వెల్లడైంది. భారీ వర్షాల కారణంగా గోదావరి ఇప్పటికే ఉగ్రరూపం దాల్చింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఆ ముగ్గురి ఆచూకీ కనిపెట్టడం కష్టసాధ్యమైంది. గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

జేడీ లక్ష్మీనారాయణపై జగన్ ట్యాపింగ్ - మోదీకి రాస్తే డీజీపీ స్పందనా? - చంద్రబాబు సంచలనం

కరోనా బాధిత రాష్ట్రాల జాబితాలో టాప్ మూడో స్థానంలో ఉన్న ఏపీలో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 3 లక్షలు దాటింది. మరణాలు 3వేలకు చేరువయ్యాయి. మంగళవారం ఒక్కరోజే కొత్తగా 9,652 కేసులు వచ్చాయి. మొత్తంగా దాదాపు 30 లక్షల శాంపిల్స్ ను టెస్టు చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. కొవ్వూరులో కరోనా విషాదంపై ప్రభుత్వ పరంగా ప్రకటన వెలువడాల్సిఉంది.

English summary
another covid-19 tragedy happened in andhra pradesh. after father dies of coronavirus, other three members of family commits suicide by jumping into godavari river. incident happened in kovvur of west godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X