• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేశంలో తొలిసారి.. జగన్ ప్రతిష్ట రెట్టింపు.. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవిష్కణకు కేంద్రం ఫండింగ్.

|

పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్(పీపీఏ) రద్దు, సవరణ విషయంలో దేశానికి చెడ్డపేరు తెచ్చారంటూ కేంద్ర పెద్దల చేత ఏపీ సీఎం వైఎస్ జగన్ చివాట్లు తినాల్సివచ్చింది. రాజధాని మార్పు దగ్గర్నుంచి మండలి రద్దు దాకా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలపై జాతీయ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే కట్టెలమ్మినచోటే పూలమ్మిన చందంగా, ఏ నోళ్లైతే జగన్ తీరును తప్పుపట్టాయో, వాళ్లే ఇప్పుడు జగన్ తోపాటు వైసీపీ నేతలనూ పొగడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా, వైసీపీ యువ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి రూపొందించిన ఆవిష్కరణకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం.. కేంద్రంలో జగన్ ప్రతిష్టను రెట్టింపు చేసింది.

సవతి కొడుకుతో గర్భం.. ఆపై వివాహం.. సోషల్ మీడియా స్టార్ మెరీనా సంచలనం.. కరోనాకు దీటుగా ట్రెండ్..

ఎంటెక్ ఎమ్మెల్యే..

ఎంటెక్ ఎమ్మెల్యే..

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ వివిధ నియోజకవర్గాల్లో విద్యావంతులకు పెద్ద పీట వేయడం, సీనియర్లను సైతం పక్కనపెట్టి ఎడ్యుకేటెడ్ యంగ్ పర్సన్స్ కు అవకాశం కల్పించడం తెలిసిందే. ఆ క్రమంలోనే అనంతపురం జిల్లా శింగనమల అసెంబ్లీ స్థానం నుంచి జొన్నలగడ్డ పద్మావతికి అవకాశం దక్కడం ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందడం చకచకా జరిగిపోయాయి. పద్మావతి అప్పటికే అనంతపురం జేఎన్టీయూలో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ లో ఎంటెక్ పూర్తి చేశారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చదువుపై ఆమె తన జిజ్ఞాసను పక్కన పెట్టలేదు. అదే ఇప్పుడు ఆమెకు, అధినేత జగన్ కు పేరు తెచ్చిపెట్టాయి.

కొవిడ్-19పై అరుదైన ఆవిష్కరణ..

కొవిడ్-19పై అరుదైన ఆవిష్కరణ..

దేశంలో కొవిడ్-19 కేసులు 11లక్షకు, ఏపీలో మొత్తం కేసులు 45వేలకు చేరువయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా వల్ల చనిపోయినవారి సంఖ్య 27వేలకు పెరిగింది. అందులో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది లాంటి ఫ్రంట్ లైన్ వారియర్ల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. ఈ నేపథ్యంలో కొవిడ్-19 పరీక్షలు, చికిత్స విధానాల్లో నూతన ఆవిష్కరణల్ని ఆదరించాలని, తద్వారా మరింత మెరుగైన పరిస్థితులు కల్పించొచ్చన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరణలకు ఆహ్వానం పలికింది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో నడిచే జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్డీసీ) ఆధ్వర్యంలో కోవిడ్‌ పరీక్ష, చికిత్స నూతన ఆవిష్కరణల పోటీ నిర్వహించింది. దేశ వ్యాప్తంగా జరిగిన పోటీకి వేలాది దరఖాస్తులురాగా 16 ఆవిష్కరణలను విజేతలుగా ప్రకటించారు.

దేశ చరిత్రలో తొలిసారి..

దేశ చరిత్రలో తొలిసారి..

జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్డీసీ) నిర్వహించిన పోటీలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి రెండు ఆవిష్కరణలకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. అనంతపురంలోని శ్రీనివాస రామానుజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎస్‌ఆర్‌ఐటీ), ఏలూరులోని రామచంద్ర కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ఈ ఘనత సాధించాయి. ఎస్‌ఆర్‌ఐటీ ఆవిష్కరణ.. శింగనమల వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో రూపొందించింది కావడం విశేషం. ఓ ఎమ్మెల్యే ఇలాంటి ఆవిష్కరణ చేయడం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి కావడం గమనార్హం.

  YSRCP MP Raghurama Krishnam Raju met JP Nadda రఘురామరాజు ను లోక్ సభలో వెనక సీటుకు పంపేసిన YCP
  పద్మావతి ఏం కనిపెట్టారంటే..

  పద్మావతి ఏం కనిపెట్టారంటే..

  ఎంటెక్ చదివిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. కొవిడ్-19 చికిత్స విధానంలో ఫ్రంట్ లైన్ వారియర్ల సేఫ్టీ కోసం అద్భుతమైన ఆవిష్కరణ రూపొందించారు. వైద్య సిబ్బందికి కరోనా సోకకుండా ఉండేలా రక్షణాత్మక క్యాబిన్‌ ను ఆమె రూపొందించారు. వైరస్‌ చొరబడటానికి అవకాశం లేకుండా క్యాబిన్ లోపల సురక్షితమైన వాతావరణం ఉండటంతో ఎలాంటి రక్షణ కవచాలు లేకపోయినా డాక్టర్లు, నర్సులు అందులో ఉండొచ్చు. ఈ క్యాబిన్ ను ఎటు నుంచి ఎటైనా కదిలించొచ్చు. అందులో ఉంటూనే డాక్టర్లు.. రోగులకు సేవలు అందించొచ్చు. వార్డుల్లో క్యాబిన్‌తో పాటు స్వేచ్ఛగా తిరగవచ్చు. డాక్టర్‌ క్యాబిన్‌ నుంచి బయటకు వచ్చాక అది ఆటోమేటిగ్గా శానిటైజ్‌ అవుతుంది. తరువాత వేరొకరు ఆ క్యాబిన్‌ ద్వారా సేవలందించవచ్చు.

  షాకింగ్: సచివాలయం కింద గుప్త నిధులు.. రంగంలోకి నిజాం వారసులు.. రేవంత్ రెడ్డి.. తొండ వల్ల..

  తయారీకి కేంద్రం నిధులు..

  తయారీకి కేంద్రం నిధులు..

  ఎమ్మెల్యే పద్మావతి రూపొందించిన మూవబుల్ సేఫ్టీ క్యాబిన్లు కొవిడ్-19 చికిత్స విధానంలో గొప్పగా ఉపయోగపడతాయని సైంటిస్టుల బృందం అభిప్రాయపడింది. ఆమె ఆవిష్కరించిన మోడల్ ను తయారు చేసేందుకు కేంద్రం నిధులు సమకూర్చనుంది. అలాగే ఎన్ఆర్డీసీ ఎంపిన చేసిన 16 ఆవిష్కరణలనూ కేంద్ర ప్రభుత్వమే నిధులు అందించి, వాటిని జనసామాన్యానికి అందుబాటులోకి తేనున్నారు. ఏపీ నుంచి ఎంపికైన రెండో ఆవిష్కరణను ఏలూరుకు చెందిన రామచంద్ర కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ టీమ్ రూపొందించింది. బహిరంగ ప్రదేశాల్లో క్రిమిసంహారక మందును అధిక సామర్థ్యంతో స్ప్రే చేయగల ఆటోమేటిక్‌ యంత్రాన్ని వాళ్లు తయారుచేశారు. ఎమ్మెల్యే పద్మావతి ఆవిష్కరణకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై వైసీసీ నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యావంతులకు అవకాశం కల్పించిన అధినేత జగన్ కు కూడా ఈ విజయంలో లో భాగం ఉందని వైసీపీ నేతలు అంటున్నారు.

  English summary
  As many as 16 technology projects, including two from Andhra Pradesh, atmospheric movable cabin alternative to PPE (SRIT, Anantapur) invented by ysrcp mla Jonnalagadda Padmavathy have been selected for funding by the National Research Development Corporation (NRDC). second one is high capacity disinfectant spraying machine with auto-retractable hose heel for use in large public spaces (Ramachandra College of Engineering, Eluru)
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X